కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌

చిన్న వ‌య‌స్సులోనే స్టార్ హీరో అయిన నంద‌మూరి హీరో ఎన్టీఆర్…మూడు ప‌దుల వ‌య‌స్సు కూడా రాకుండానే పొలిటిక‌ల్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. రెండు ప‌దుల వ‌య‌స్సులోనే సింహాద్రి లాంటి బ్లాక్‌బస్ట‌ర్ మూవీతో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ త‌ర్వాత 2009లో టీడీపీకి ప్ర‌చారంలో స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌కు అటు నంద‌మూరి ఫ్యామిలీతోను, ఇటు నారా ఫ్యామిలీతోను గ్యాప్ వ‌చ్చింది.

రాజ‌కీయంగా త‌న కొడుకు లోకేశ్‌కు ఎన్టీఆర్ పోటీ వ‌స్తాడ‌ని చంద్ర‌బాబు, ఇటు సినీరంగంలో త‌న కుమారుడు మోక్ష‌జ్ఞ‌ను ఎన్టీఆర్‌ను మించిన స్టార్‌ను చేయాల‌ని బాల‌య్య ఎన్టీఆర్‌ను అణ‌గ‌దొక్కుతున్నార‌ని ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌చ్చాయి. ఏదేమైనా 2009లో పొలిటిక‌ల్‌గా టీడీపీ ప్ర‌చారంలో స్టార్‌గా ఉన్న ఎన్టీఆర్ 2014 ఎన్నిక‌ల టైంకు ఎక్క‌డ ఉన్నాడో కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

ఇవిలా ఉంటే కొద్ది రోజులుగా ఎన్టీఆర్ న‌వ‌భార‌త్ నేష‌న‌ల్ పార్టీకి ఏపీ అధ్య‌క్షుడిగా ఎంపిక‌య్యాడ‌ని, ఆ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుందంటూ ఓ లేఖ కూడా సోష‌ల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. దీనిపై ఎన్టీఆర్ నుంచి ఎలాంటి క్లారిటీ లేక‌పోవ‌డంతో ఇటు మీడియాలోను అటు ఎన్టీఆర్ అభిమానుల్లోను ఎవ‌రికి తోచిన‌ట్టు వారు ఊహించేసుకుంటున్నారు.

ప్ర‌స్తుతం జైల‌వ‌కుశ సినిమా షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్ త‌నను క‌లిసిన అభిమానుల‌తో ఈ విష‌యంపై స్పందించిన‌ట్టు స‌మాచారం. తాను ఇలాంటి వార్త‌ల‌ను ప‌ట్టించుకోన‌ని, త‌న‌కు రాజ‌కీయ పార్టీ పెట్టే ఉద్దేశ‌మే లేద‌ని, అలాంటి ఉద్దేశం ఉంటే తాను స్వ‌యంగా బహిరంగ ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని చెప్పాడ‌ట‌. ఇక వేరే పార్టీ బేస్ చేసుకుని తాను సీక్రెట్‌గా రాజ‌కీయాల్లోకి రావాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా చెప్పాడ‌ట‌. ఓవ‌రాల్‌గా ఎన్టీఆర్ కొత్త పార్టీ ఏర్పాటుపై వ‌స్తోన్న రూమ‌ర్ల‌కు మ‌నోడు చెక్ పెట్టాడు.