త్రివిక్ర‌మ్‌, కొరటాల వెన‌క్కి…. మ‌రో కొత్త డైరెక్ట‌ర్‌తో తార‌క్ నెక్ట్స్ మూవీ

September 11, 2017 at 3:34 am
NTR, Thrivikram, Koratala Siva,

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కెరీర్‌లోనే తిరుగులేని పీక్‌స్టేజ్‌లో ఉన్నాడు. టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల‌తో దూకుడు మీద ఉన్న ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాకు ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా అన్ని రైట్స్ క‌లుపుకుని రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు కూడా తెలుస్తోంది.

ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో ఆ సినిమా త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తాడ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రికి తెలిసిన విష‌యం. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌తో సినిమా చేస్తోన్న త్రివిక్ర‌మ్ ఆ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ సినిమా చేస్తాడ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ అనుకుంటున్నారు. ఇక మ‌హేష్‌తో భ‌ర‌త్ అను నేను సినిమా చేస్తోన్న కొర‌టాల శివ ఆ త‌ర్వాత ఎన్టీఆర్ సినిమా చేస్తాడ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న టాక్‌.

అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు వెన‌క్కి వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ మ‌రో కొత్త డైరెక్ట‌ర్‌తో నెక్ట్స్ సినిమాకు క‌మిట్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టి, నేష‌న‌ల్ అవార్డు అందుకున్న స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్ న‌టిస్తాడ‌ని తెలుస్తోంది.

అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కే ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాకు శ్రీనివాస కళ్యాణం అనే పేరు కూడా ప‌రిశీలిస్తున్నార‌ట‌. మ‌రి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇద్ద‌రు అగ్ర ద‌ర్శ‌కులు అయిన త్రివిక్ర‌మ్‌, కొర‌టాల సినిమాల‌ను ఎంత వ‌ర‌కు వెన‌క్కు పంపుతాడ‌న్న‌ది తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.

 

త్రివిక్ర‌మ్‌, కొరటాల వెన‌క్కి…. మ‌రో కొత్త డైరెక్ట‌ర్‌తో తార‌క్ నెక్ట్స్ మూవీ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts