త్రివిక్ర‌మ్‌కు ఎన్టీఆర్ షాక్ వెన‌క ఏం జ‌రిగింది..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. నాలుగు వ‌రుస హిట్ల‌తో ఉన్న ఎన్టీఆర్ మార్కెట్‌, క్రేజ్ అన్ని డ‌బుల్ దాటేసి ట్రిబుల్ అయిపోయాయి. టెంప‌ర్ నుంచి జై ల‌వ‌కుశ సినిమా వ‌ర‌కు ఎన్టీఆర్ నాలుగు సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్‌, వ‌సూళ్లు ప‌రిశీలిస్తే ఎన్టీఆర్ మార్కెట్ స్ట్రాట‌జీ ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంది. దీంతో ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ సినిమా విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు.

జై ల‌వ‌కుశ త‌ర్వాత త‌న నెక్ట్స్ సినిమా త్రివిక్ర‌మ్‌తోనే ఉంటుంద‌ని కూడా ఓపెన్ అయిపోయాడు. దీంతో అంద‌రూ త్రివిక్ర‌మ్ – ఎన్టీఆర్ కాంబోపై మంచి ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్ర‌కారం ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ సినిమా విష‌యంలో త్రివిక్ర‌మ్‌కు షాక్ ఇచ్చిన‌ట్టే తెలుస్తోంది. త్రివిక్రమ్ కంటే ముందే ఎన్టీఆర్ మరో డైరెక్టర్‌తో మ‌ధ్య‌లో ఓ సినిమా చేసే అవకాశం ఉంది.

మ‌ధ్య‌లో ఈ ట్విస్ట్ వెన‌క క‌థేంటంటే ప్ర‌స్తుతం ప‌వ‌న్ సినిమాను డైరెక్ట్ చేస్తోన్న త్రివిక్ర‌మ్‌కు ఇంకా ఆ సినిమాతోనే మ‌రో మూడు నెల‌లు టైం ప‌ట్టేలా ఉంది. జ‌న‌వ‌రి 10న ఈ సినిమా వ‌స్తుంద‌ని చెపుతున్నా ప‌వ‌న్ పొలిటిక‌ల్ బిజీ వ‌ల్ల ఇంకా లేట్ అవుతుంద‌ని అంటున్నారు. ఈ సినిమా అయ్యాక ఎన్టీఆర్ సినిమా స్క్రిఫ్ట్ మీద వ‌ర్క్ చేసేందుకు మ‌రో 3 నెల‌లు కావాలి. ఈ లెక్క‌న త్రివిక్ర‌మ్‌తో సినిమా అంటే ఎన్టీఆర్ 7 నెల‌లు ఖాళీగా ఉండాలి.

ఈ గ్యాప్ ఇష్టంలేని ఎన్టీఆర్ ప్ర‌స్తుతం దిల్ రాజుతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌. క‌న్‌ఫార్మ్‌గా 6 నెల‌ల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తాన‌ని రాజు నుంచి గ్యారెంటీ వ‌స్తే రాజు బ్యాన‌ర్‌లో ఎన్టీఆర్ ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాట్ట‌. ఇక ఈ సినిమాకు డైరెక్ట‌ర్ ఎవ‌రు ? క‌థ ఏంట‌న్న‌దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా త్రివిక్ర‌మ్ సినిమా కంటే ముందే ఎన్టీఆర్ నుంచి మ‌రో సినిమా రావ‌డం ప‌క్కా అనుకోవ‌చ్చేమో..!