ఈ ‘ ప‌ద్మావ‌తి ‘ తో బాహుబ‌లికి ముప్పా?

బాహుబ‌లి సినిమా రిలీజ్ అయ్యాక నార్త్ సినిమాపై సౌత్ డామినేష‌న్ గురించి ఒక్క‌టే చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తేడాది వ‌ర‌కు సౌత్ ఇండియ‌న్ సినిమాపై త‌మిళ సినిమా ఆధిప‌త్యం స్ప‌ష్టంగా ఉండేది. బాహుబ‌లి 1,2ల దెబ్బ‌తో ఇప్పుడు తెలుగు సినిమా సౌత్‌కే కాదు నార్త్‌కే స‌వాల్ విసిరే స్థాయికి వెళ్లిపోయింది. బాహుబ‌లిని ఇండియ‌న్ సినిమా గ‌ర్వించ‌ద‌గ్గ రీతిలో తెరకెక్కించాడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.

ఇక బాహుబ‌లి సినిమాకు ధీటుగా నిలుస్తుంద‌ని ముందునుంచి అంచ‌నాలు ఉన్న ప‌ద్మావ‌తి ట్రైల‌ర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ట్రైల‌ర్ క‌ళ్లు చెదిరిపోయేలా ఉంది. విజువ‌ల్స్‌, న‌టీన‌టుల అభిన‌యం, వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ చూసిన వాళ్లు బాహుబ‌లితో పోటీప‌డే స‌త్తా ఈ సినిమాకు ఉంద‌ని భావిస్తున్నారు. బాహుబ‌లి వ‌సూళ్లు ఈ సినిమాకు వ‌స్తాయా ? రావా ? అన్న‌ది ప‌క్క‌న పెట్టేస్తే కంటెంట్ ప‌రంగా ఖ‌చ్చితంగా బాహుబలిని మించిన లేదా బాహుబ‌లికి ధీటైన సినిమాగా ప‌ద్మావ‌తి నిలుస్తుంద‌ని సినిమా నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

వాస్త‌వంగా చూస్తే సంజ‌య్‌లీలా బ‌న్సాలీ సినిమాల‌న్ని కంటెంట్ ప‌రంగా చాలా బలంగా ఉంటాయి. ఆయ‌న బాజీరావు మ‌స్తానీ సినిమా అలాంటిదే. అయితే ఇప్పుడు ప‌ద్మావ‌తి ట్రైల‌ర్ చూస్తుంటేనే దానిని మించిన బ‌ల‌మైన క‌థాంశంతో రానుంద‌ని తెలుస్తోంది. ట్రైల‌ర్‌లో ఉన్న విష‌యం సినిమాలో ఉంటే ఖ‌చ్చితంగా క‌థాప‌రంగా ప‌ద్మావ‌తి బాహుబ‌లిని మించిన సినిమాగా నిలుస్తుంద‌ని ఇండియ‌న్ సినిమా నిపుణులు చెపుతున్నారు. ఏదేమైనా ప‌ద్మావ‌తి సినిమా క‌థాప‌రంగా మాత్రం బాహుబ‌లిని డామినేట్ చేసేలా క‌నిపిస్తోంది