ఫ్యామిలీ విష‌యంలో ప‌వ‌న్ – తార‌క్ ఒక‌టేనా..!

వాళ్లిద్ద‌రూ పెద్ద కుటుంబాల‌కు చెందిన‌వారు. ఒక‌రు సినీ హీరోగా ఉంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. మ‌రొక‌రు రాజ‌కీయం, సినీ నేప‌థ్యం క‌ల‌గ‌ల‌సిన వారు! కానీ విచిత్రంగా వీరు ఇద్ద‌రూ ఒకే విధంగా అడుగులేస్తున్నారు. ప‌రిస్థితులు ఇద్ద‌రినీ వారివారి కుటుంబాల నుంచి దూరం నెట్టేశాయి. వారు మ‌రెవ‌రో కాదు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌! ఇప్పుడు ఏపీలో వీరి గురించే చ‌ర్చ మొద‌లైంది. వీరిని గ‌మ‌నిస్తే..ఇద్ద‌రిలోనూ చాలా కామ‌న్ పాయింట్లే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో బ‌ల‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారు కావ‌డం.. ఇద్ద‌రూ పొలిటిక‌ల్‌గా అవ‌గాహ‌న ఉన్న వారు కావడం.. మ‌రీ ముఖ్యంగా ఇద్ద‌రూ కుటుంబాల‌కు దూర‌మైపోవ‌డం!

ఇటీవ‌ల నారా-నంద‌మూరి, మెగా ఫ్యామిలీ కుటుంబాల మ‌ధ్య సారుప్య‌త ఎక్కువ క‌నిపిస్తోంది. అటు నారా-నంద‌మూరి వేడుక‌ల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించక‌పోవ‌డం.. అటు మెగా ఫ్యామిలీ వేడుక‌ల‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ అటెండ్ కాక‌పోవ‌డం.. కొంత యాదృశ్చిక‌మే కావొచ్చు. సినీ ఇండ‌స్ట్రీలో ఇద్ద‌రూ అంచెలంచెలుగా ఎదిగి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్నారు. వీరి ల‌క్ష‌ణాలు డిఫ‌రెంట్గా ఉన్నా.. వీరిద్ద‌రూ ఒకే బాట‌లో న‌డుస్తున్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

మెగా ఫ్యామిలీ ఈవెంట్ల‌లో ప‌వ‌న్ క‌నిపించి చాలాకాల‌మే అయింది. త‌న సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కి అన్న చిరంజీవి వ‌చ్చినా.. ప‌వ‌న్ మాత్రం ఇత‌ర మెగా హీరోల ఫంక్ష‌న్‌లో క‌నిపించ‌లేదు. అంతెందుకు చిరంజీవి కూతురు పెళ్లికి కూడా హాజ‌రుకాలేడంతే అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు రాజ‌కీయంగా అడుగులేస్తున్న ప‌వ‌న్‌.. మెగా ఫ్యామిలీలో జ‌రిగే ఫంక్ష‌న్ల‌కు రాక‌పోవ‌డం వెనుక‌.. ఉన్న కార‌ణాలు ఏవీ తెలియ‌క‌పోయినా.. అభిమానుల్లో మాత్రం కొంత గ్యాప్ ఉంది.

ఇక నారా-నంద‌మూరి వారి ఇంట జ‌రిగే వేడుక‌ల్లో ఎన్టీఆర్ క‌నిపించి చాలా ఏళ్లు దాటింది. ముఖ్యంగా ఈ రెండు కుటుంబాలకు ఎన్టీఆర్ దూర‌మై చాలా కాల‌మే అయింది. ఇటీవ‌ల చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ మంత్రి ప‌ద‌వి స్వీకారోత్స‌వంలో హ‌రికృష్ణ‌, క‌ల్యాణ్‌రామ్ క‌నిపించారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రాలేదు. ఇక చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో క‌ట్టుకున్న నూత‌న ఇంటి గృహ‌ప్ర‌వేశానికి ఎన్టీఆర్‌కు ఆహ్వానం అంద‌లేద‌ని అందుకే రాలేద‌ని తెలుస్తోంది. మొత్తానికి ఇద్ద‌రు టాప్ హీరోలు త‌మ‌కు తెలియ‌కుండానే ఒకే రూట్లో న‌డుస్తున్నారు.