ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ టైటిల్ & రిలీజ్ డేట్ ఫిక్సే..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబోలో తెర‌కెక్కుతోన్న సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్ కూడా ఫిక్స్ కాలేదు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స‌యిపోయిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్టుపై టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. వ‌చ్చే యేడాది సంక్రాంతి కానుక‌గా జనవరి 10 లేదా 11తేదీల్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. అలా అయితే లాంగ్ వీకెండ్ వస్తుంది. 10 నుంచి ఫస్ట్ వీకెండ్ ఓపెనింగ్స్ వుంటాయి. ఆ త‌ర్వాత సంక్రాంతి మూమెంట్ ఉంటుంది. దీంతో ఈ సినిమాకు భారీ లాంగ్ వీకెండ్ క‌లిసిరానుంది.

ఇక ఈ సినిమా కోస‌మే సంక్రాంతికి రావాల్సిన చెర్రీ – సుకుమార్ రంగ‌స్థ‌లం 1985 సినిమాను డిసెంబ‌ర్‌లోనే రిలీజ్ చేసేస్తున్నార‌ట‌. ఇక త్రివిక్ర‌మ్ – ప‌వ‌న్ సినిమాకు ఇంజ‌నీరింగ్ అల్లుడు అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ మార్క్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.