పవన్ క్రేజ్ వారికి శ్రీరామ రక్ష

కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత ఫలితం రాకపోయినా పవన్ అవేమి పట్టించుకోకుండా తన నెక్స్ట్ సినిమా చిరకాల మిత్రుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బారి బడ్జెట్ సినిమాకి తెర తీశారు, సుమారు 100 కోట్ల బడ్జెట్ అని మాట వినిపిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా తాలూకు పూజ కార్యక్రమాలు అయిపోయాయి, ఇప్పటికి ఈ సినిమాకి సంబందించిన కొంతభాగం రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశారని సమాచారం. ఈ సినిమాకోసం పవన్ ౩౦ కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడట అలాగే త్రివిక్రమ్ 20 కోట్లు, వీరిద్దరి వరకే 50 కోట్లు బడ్జెట్ అయిపోతుంది.

ఇక మిగిలిన బడ్జెట్ సినిమాలో పవన్ క్యారక్టర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి దాని కొరకు ముందు ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ చూదామనుకున్నారట కానీ అది సెట్ అవేలేదట. ఇప్పుడు ఆ ఆఫీస్ సెటప్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీ లో బారి ఖర్చు పెట్టి కడుతున్నట్టు సమాచారం, ఇప్పుడు ఈ ఖర్చు పవన్ త్రివిక్రంల రెమ్యూనిరేషన్ ఖర్చు అంచనాలను మించిపోవడంతో. నిర్మాతలు కాస్ట్ కటింగ్ వేటలో పడ్డారు ముందుగా వారికి దొరికిన చాయిస్ హీరోయిన్స్. ఈ సినిమా కోసం కీర్తిసురేష్ ను మరియు అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా తీసుకున్నారు, వీరు కూడా పవన్ సినిమా అంటే బారి రెమ్యూనిరేషన్ బీభత్సమైన పాపులారిటీ వస్తుందని వెంటనే ఓకే అనేసారు.

ఇక్కడే వీరిద్దరూ బుట్టలో పడ్డారు కానీ నిర్మాతలు పారితోషికాల్లో భారీగా కోత పెట్టారట, పవన్ సరసన నటిస్తే క్రేజ్ డబుల్ అవుతుందని, రెమ్యూనరేషన్ గురించి ఆలోచించొద్దని బ్రెయిన్ వాష్ చేశారట. కాకపోతే పవన్ సరసన నటించి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్లను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. గతంలో భూమిక, ఇలియాన… తాజాగా శృతిహాసన్ మాత్రమే పవన్ తో సినిమాలు చేసి క్లిక్ అయ్యారు. వీళ్ల కోవలోకి కీర్తిసురేష్, అను చేరతారో లేదో చూడాలి.