పవన్ ట్విట్టర్…విమర్శలు విన్నపాలు కితాబులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పై జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా టీడీపీ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.అంటే విరుచుకుపడిపోయాడా అని అడిగిగితే అవును విరుచుకుపడినట్టే పడి అంతలోనే తనకి బాగా ఇష్టమైన అర్థిస్తున్నాను..విన్నవిస్తున్నాను అంటూ ముక్తాయించేసాడు ఎప్పటిలాగే.

ఇంతకీ విషయం ఏంటంటే..ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చిన సందర్భంలో సదరు టీడీపీ ఎంపీ ల తీరును జనసేనాని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించేశాడు.సభలో టీడీపీ ఎంపీ అశోక గజపతి రాజు మౌనాన్ని అదే సమయం లో మిగిలిన టీడీపీ ఎంపీ ల గైరుహాజరీనీ తప్పుపట్టారు.అంతటితో ఆగ కుండా ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చే హక్కు టీడీపీ ఎంపీ లకు లేదంటూ  అసలు టీడీపీ మరియు బీజేపీ కి రాష్ట్రం లో ప్రజలు ఓటేసింది ప్రత్యేక హోదా ఇస్తారన్న నమ్మకంతోనే ..ఆ విషయం లో రాజి పడే హక్కు రెండు పార్టీలకు లేదంటూ విమర్శించాడు.

అంతేనా పనిలో పనిగా ప్రత్యేక హోదా కి మద్దతు పలికిన తెలంగా ఎంపీ లయిన కేశవరావు,రాపోలు ఆనంద భాస్కర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.విచిత్రంగా వైసీపీ ఎంపీ లు ప్రత్యేక హోదా విషయం లో బాగా పోరాడుతున్నారని కితాబిచ్చేశారు. కృతజ్ఞతలు,కితాబులయితే సూటిగా సుత్తి లేకుండా ఇచ్చేస్తున్న పవన్ విమర్శల విషయానికి వచ్చేసరికే సున్నితంగా సుతిమెత్తగా ఉండటమే అనుమానాలకు తావిస్తోంది.

ఎంత సేపు టీడీపీ ఎంపీ లు విభజన సమయం లో ఉత్తరాది ఎంపీ లు మన ఎంపీ లపై చేసిన దాడిని మరచిపోయారా..మీ వ్యాపార ప్రయోజనాలే మీకు ముఖ్యమా…నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే రాష్ట్ర ప్రయోజనాల్ని మరీ ముక్యంగా ప్రత్యేక హోదా అంశాన్ని కేద్రం వద్ద తాకట్టు పెట్టకండి.ఇది పవన్ టీడీపీ ఎంపీలపై ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు.ఇందులో అస్త్రాలెక్కడున్నాయి అనడక్కండి..అదంతే.

కొత్త రాష్ట్రం ఏర్పడి టీడీపీ అధికారం లోకి వచ్చి దాదాపుగా మూడేళ్లవుతోంది. ప్రత్యేకహోదా అదుగో ఇదిగో అంటూ కాలక్షేపం చేసి..ఆబ్బె దాని వల్ల ఉపయోగం లేదు.ఇదిగో ప్యాకేజ్ అంటూ ఏపీ కి పెద్ద క్యాబేజ్ ఇస్తే..మన మీడియా మొఘల్స్ అంతా ఆహా ఓహో అంటూ భజన పారవశ్యం లో మునిగి తేలి..అభినందన సభలు కూడా పెట్టి నీచానికి దిగజారిపోయారు.అప్పటికీ పవన్ నిద్రలోనే వున్నారు.ఇక వైసీపీ ప్రత్యేక హోదాపై ఎడా పెడా సభలు,ఉద్యమాలంటూ రోడ్డెక్కుతుంటే పరిస్థితి చేజారిపోతుందనుకున్నారో ఏమో…ఇక పవన్ ప్రత్యేక భజన శురూ అయ్యింది.

ఎంత సేపు టీడీపీ ఎంపీ లు,బీజేపీ అధిష్టానం పై విమర్శలు చేస్తూ..టీడీపీ అధినేత చంద్రబాబుకి సూచనలు చేయడం ఒక్క పవన్ కె చెల్లింది.రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పోరాటం లో ముందు నడవాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే..ఆయనే దాన్ని నీరుగార్చేస్తున్నా పవన్ ఈ సూచనలు..విన్నపాలు చేయడం పవన్ కూడా సగటు రాజకీయ నాయకుడే అన్న భావన సామాన్యుల్లో నెలకొంది.

అసలు పవన్ పాలక వర్గమా..ప్రజా సంక్షేమ పోరాట పక్షమా నిర్ణయించుకోవాలి..పాలక పక్షం చెంతనుంటూ నే పాలక పక్షాని నొప్పి తగలకుండా ప్రజా పక్షాన నిలబడతానంటే ఈ జనసేనానిని జనాలు నమ్మరు.ప్రశ్నించడం అంటే నిలదీయడం..మన హక్కులు కాలరాస్తున్న కాలక్షేప సూచనలు విన్నపాలు పవన్ మనుగడనే ప్రస్నార్ధకం చేస్తాయి.