పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌రోసారి తండ్రి అయ్యాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – అన్నా లెజొనెవా దంపతులకు కొడుకు పుట్టాడు. ఆయన భార్య అన్నా లెజొనెవా ఇవాళ పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఇది పవన్ కి నాలుగవ సంతానం. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముందుగా వైజాగ్‌కు చెందిన నందినిని పెళ్లి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి త‌న‌తో బ‌ద్రి, జానీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రేణు దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు.

ప‌వ‌న్ – రేణు దంప‌తుల‌కు అకీరా, ఆద్య జ‌న్మించారు. 2010లో రేణుతో విడిపోయాక పవన్ రష్యాకు చెందిన అన్నాను వివాహం చేసుకున్నారు. అన్నా ప‌వ‌న్ తీన్‌మార్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. వీరిద్దరికీ ఇంతకు మునుపే పొలెనా అనే పాప ఉంది. ఇప్పుడు బాబు పుట్టాడు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో అన్నా లెజొనెవాకు కాన్పు జరిగింది.

ఆసుపత్రిలో బాబును ఎత్తుకుని మురిపెంగా చూస్తున్న పవన్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. తమ ఇంటికి మరో చిన్నారి రాకతో పవన్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. మొత్తానికి పవన్ మళ్ళీ తండ్రి కావడం తో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల్లో ఉన్నారు.

pawan