ప‌వ‌న్ నీ ప్ర‌శ్న‌ల్లో నిజాయితీ ఎక్క‌డ‌..!

ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టాన‌ని చెప్పుకునే ప‌వ‌న్ సినిమాల వ‌ర‌కు ప‌వ‌ర్‌స్టార్ అయినా పొలిటికల్‌గా ఇంకా ఏ స్టారో చెప్ప‌లేని ప‌రిస్థితి. ప‌వ‌న్ నీతి, నిజాయితీ ఆయ‌న‌కు ప్ల‌స్ కావొచ్చేమో గాని, అవి పొలిటిక‌ల్‌గా సెకండ్ కేట‌గిరిలో ఉన్నాయి. కానీ పొలిటిక‌ల్‌గా ప‌వ‌న్ త‌న ప‌వ‌ర్ చూపిస్తాడ‌ని అంద‌రూ అనుకుంటుంటే ఆయ‌న చేస్తోన్న రాజ‌కీయం మాత్రం ఆయ‌న సినిమాల్లాగానే రొటీన్‌గా, రెగ్యుల‌ర్‌గా ఉంద‌న్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

ప‌వ‌న్ న్యూస్ పేప‌ర్ల‌ను, వార్త‌ల‌ను బాగానే ఫాలో అవుతాడు. ఆయ‌న‌కు ఏపీ, తెలంగాణ‌లో ఎక్క‌డెక్క‌డ ఏ స‌మ‌స్య‌లు ఉన్నాయో కాస్తో కూస్తో అవ‌గాహ‌న ఉంది. వివిధ స‌మ‌స్య‌ల్లో ఉంటోన్న వారు ప‌వ‌న్‌ను క‌లుస్తున్నారు. అలాంట‌ప్పుడు ప‌వ‌న్ మూడు నెల‌ల‌కో, ఆరు నెల‌ల‌కో ఏదో ఒక స‌మ‌స్య‌పై స్పందించ‌డ‌మో లేదా ప్రెస్‌మీట్ పెట్ట‌డ‌మో చేసి చేతులు దులిపేసుకుంటున్నాడు.

ఓ స‌మ‌స్య‌పై ఆలోచ‌న‌తో కాకుండా ఆవేశంగా స్పందింది..ఆ వెంట‌నే చ‌ల్లారిపోవ‌డం ప‌వ‌న్‌కు కామన్ అయిపోయింది. ప‌వ‌న్ గ‌తేడాదిలో చూసుకుంటే మూడు, నాలుగు స‌భ‌లు, వేళ్ల‌మీద లెక్కించే ప్రెస్‌మీట్లు మిన‌హా జ‌న‌సేన‌ను ఎస్టాబ్లిష్ చేసేందుకు చేనిందేమి క‌న‌ప‌డ‌డం లేదు. అటు రాజ‌కీయం – ఇటు సినిమాలు ఇలా రెండు ప‌డ‌వ‌ల మీద ప‌వ‌న్ ప్ర‌యాణం చేస్తుండ‌డంతో రాజ‌కీయంగా ప‌వ‌న్ స్టార్‌గా ఎద‌గ‌లేక‌పోతున్నాడ‌న్న చ‌ర్చ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

ఎక్క‌డో ఉత్త‌రాది బీజేపీ నాయ‌కుడు ద‌క్షిణాది వారి మీద చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ స్పంద‌న బాగానే ఉంది. కానీ ఇక్క‌డ ఏపీలో చంద్ర‌బాబు ఫిరాయింపుదారుల‌కు మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు..దానిపై ప‌వ‌న్ నుంచి ఎలాంటి స్పంద‌నా లేదు. లోక‌ల్ రాజ‌కీయంపై స్పందించ‌క‌పోతే ప‌వ‌న్‌లో నిజాయితీని శంఖించ‌క త‌ప్ప‌దుగా..? ఇక ప‌వ‌న్ అక్వాఫుడ్ పార్కు బాధితుల ప‌క్షాన పోరాటం చేస్తూ అవ‌స‌ర‌మైతే తాను కూడా అరెస్టు అవుతాన‌ని చెప్పాడు…ఇప్పుడు అక్క‌డ బాధిఉతుల‌ను జైళ్లో పెడుతుంటే ప‌వ‌న్ నుంచి స్పంద‌నే లేదు.

పొలిటిక‌ల్‌గా పవన్ కళ్యాణ్ ఏదో కొత్త ట్రెండ్ సెట్ చేస్తాడని ఆయన సినిమా అభిమానులు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటే ఆయ‌న మాత్రం తన సినిమాల్లాగానే రొటీన్‌, రెగ్య‌లర్ రాజ‌కీయ‌మే చేస్తున్నాడ‌న్న చర్చ‌లే ప్ర‌స్తుతం ఎక్కువ‌య్యాయి. ప‌వ‌న్ ఇలా అయితే రాజ‌కీయ‌ల్లో ట్రెండ్ సెట్ చేయ‌డం క‌ష్ట‌మే..!