ప‌వ‌న్ పొలిటిక‌ల్ సినిమాకు ఆ మీడియాధినేత డైరెక్ష‌న్‌

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఓ ట్రెండ్. ప‌వ‌న్ రాజ‌కీయంగా 2019 ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావం చూపిస్తాడు ? అన్న అంశం ప‌క్క‌న పెడితే మ‌నోడు అటు అధికార టీడీపీ, ఇటు విప‌క్ష వైసీపీలలో ఎవ‌రికి దెబ్బేస్తాడు ? అన్న‌ది మాత్రం కాస్త స‌స్పెన్స్‌గానే ఉంది. ప‌వ‌న్ గెలుస్తాడ‌ని గ్యారెంటీగా చెప్పేవాళ్లు లేక‌పోవ‌చ్చు. కానీ ప‌వ‌న్ దెబ్బ ఈ రెండు పార్టీల‌లో ఎవ‌రో ఒక‌రి గూబ‌గుయ్‌మ‌నిపిస్తుంద‌నేది మాత్రం గ్యారెంటీ అంటున్నారు.

ప‌వ‌న్ ఏపీలో గెలిచే సీట్ల లెక్క కౌంట్ క‌న్నా …ఆయ‌న ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోను 20 వేల‌కు పైగా ఓట్లు చీలుస్తాడ‌నే అంచ‌నాలు అన్ని పార్టీల వాళ్లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ప‌వ‌న్ రాజ‌కీయంగా ఎప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటాడ‌నేది ప్ర‌స్తుతానికి ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు కూడా లేదు. ఈ టైంలో పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసే అంశంపై ఇప్ప‌ట‌కీ కాన్‌సంట్రేష‌న్ చేయ‌ని జ‌న‌సేన అన్ని జిల్లాల్లోను ఎంపిక‌లు నిర్వ‌హిస్తోంది. ఈ కొత్త ట్రెండ్ ఏంటో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.

ప‌వ‌న్ రాజకీయ ప్ర‌యాణం ఏంటో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఇదిలా ఉంటే ప‌వ‌న్ పొలిటిక‌ల్ కెరీర్‌కు ఓ టాప్ మీడియా సంస్థ‌కు చెందిన అధినేత గైడ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం తెలుగు మీడియా రంగంలో టాప్ మీడియా సంస్థ‌కు అధినేత‌గా, సీనియ‌ర్ ప‌త్రికా సంపాద‌కుడిగా, రాజ‌కీయ విశ్లేష‌కుడిగా మంచి గుర్తింపు ఉన్న స‌ద‌రు వ్య‌క్తి ప‌వ‌న్‌కు అన‌ధికార రాజ‌కీయ స‌ల‌హాదారుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న గుస‌గుస‌లు ఒక్క‌టే వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే స‌ద‌రు మీడియా సంస్థ‌లో ప‌వ‌న్‌కు చెందిన కార్య‌క్ర‌మాలు, జ‌న‌సేనను హైలెట్ చేసేలా ప్రోగ్రామ్స్ వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల టైంకు ముందుగా ఇవి మ‌రింత స్పీడ‌ప్ చేస్తార‌ని టాక్‌. జ‌న‌సేన అభ్య‌ర్థుల ఎంపిక‌, పార్టీ విధివిధానాలు అంశంలో కూడా ప‌వ‌న్ స‌ద‌రు మీడియాధినేత స‌ల‌హాల‌తోనే ముందుకు వెళుతున్నార‌ట‌. మ‌రి ఈ కొత్త స్టైల్ పాలిటిక్స్ ప‌వ‌న్‌కు ఎంత వ‌ర‌కు క‌లిసొస్తాయో ? చూడాలి.