ప‌వ‌న్ కొత్త సినిమాలో టాలీవుడ్ ల‌క్కీ గ‌ర్ల్‌..!

July 16, 2017 at 5:22 am
add_text00002

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇటు వ‌రుస సినిమాల‌తోను, అటు పాలిటిక్స్‌లోను ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాలో న‌టిస్తోన్న ప‌వ‌న్ ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే ఆర్టీ.నీస‌న్ డైరెక్ష‌న్‌లో ఏఎం.ర‌త్నం నిర్మించే సినిమాలోను, సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమాలో ప‌వ‌న్ న‌టించ‌నున్నాడు.

ఇక సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్ప‌టికే స్క్రిఫ్ట్ వ‌ర్క్ కంప్లీట్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌ను కొద్ది రోజులుగా వెతుకుతున్నార‌ట‌. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్ర‌కారం టాలీవుడ్ ల‌క్కీ గ‌ర్ల్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌ను ప‌వ‌న్ ప‌క్క‌న హీరోయిన్‌గా ఫైన‌లైజ్ చేశార‌ట‌.

ఇక టాలీవుడ్‌లో స్టార్ హీరోలంద‌రి ప‌క్క‌న న‌టించి హిట్లు కొట్టిన ర‌కుల్ ఇప్ప‌టికే చాలా సార్లు త‌న‌కు ప‌వ‌న్‌తో న‌టించాల‌ని ఉంద‌ని చెప్పింది. ఇక ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ – ప‌వ‌న్ కాంబోలో వస్తోన్న సినిమాతో ఆమె కోరిక తీరుతోంది. రకుల్ ప్రీత్ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘స్పైడర్’, బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘జయ జానకి నాయక’, కార్తీతో ఒక తమిళ సినిమా చేస్తూ బిజీగా ఉంది.

ప‌వ‌న్ కొత్త సినిమాలో టాలీవుడ్ ల‌క్కీ గ‌ర్ల్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts