ఆ దిగులే వివేకాను మింగేసిందా..?

April 26, 2018 at 11:10 am
aanam vivekanandhareddy, dead, MLA, nellore, politics, TDP

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం ఆనం ఫ్యామిలీ నుంచి గ‌ర్జించే గొంతుక నిష్క్ర‌మించింది. నిత్యం స‌ర‌దాలు, జ‌ల్సాలు, వ‌చ్చిపోయేవారు.. ఇలా సంద‌డిగా క‌నిపించే బోలా పురుషుడు.. త‌న అభిమానుల‌ను, రాజ‌కీయ నాయ‌కుల‌ను శోక‌సంద్రంలో ముంచి తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు. పోయినోళ్లు అంద‌రూ మంచోళ్లు! అన్న‌ట్టుగా ఆనం గురించి రెండు మంచి మాట‌లు మాట్లాడుకోవాలి. ఆయ‌న ఏదైనా మ‌న‌సులో దాచుకునే త‌త్వం ఉన్న మ‌నిషి కాదు.  ఇన్‌స్టెంట్‌గా ఆయ‌న త‌న మ‌నసులో భావాన్ని బ‌య‌ట‌కు చెప్పేస్తారు.  

 

ఆనం వివేకానంద‌రెడ్డి ఇంటి నుంచి బ‌య‌ల్దేరితే .. అదో పెద్ద ఉత్స‌వంగా ఉండేది. అయితే, ఆయ‌న త‌న మ‌న‌సులో మాత్రం చాలా వేద‌న దాచుకున్నార‌ని తాజాగా బ‌య‌ట ప‌డుతోంది. పైకి ఎంత‌గా న‌వ్వి.. అంద‌రినీ న‌వ్వించాడో.. అదేస‌మ‌యంలో ఆయ‌న త‌న మ‌న‌సులో అంతే వేద‌న అనుభ‌వించాడు. ఆ వేద‌నే ఆయ‌న‌ను మాన‌సికంగా కుంగదీసింది. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టేవారికి ప్ర‌త్యేకంగా ఉండాల్సింది ఏమీలేదు… ప్ర‌జాద‌ర‌ణ త‌ప్ప‌! ఈ ప్ర‌జాద‌ర‌ణ‌లో ఆనం వివేకాను మించిన నేత నెల్లూరులోనే లేడు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నాటి నుంచి 2014 వ‌ర‌కు ప‌ద‌వులు అనుభ‌విస్తూనే ఉన్నాడు. 

 

అయితే, రాష్ట్ర విభ‌జ‌న తెచ్చిన తంటా.. ఆనం కుటుంబానికి శాపంగా మారింది. రాజ‌కీయాల్లో ఉన్నా.. ఆనం ఏనాడూ .. త‌న స్వార్థం చూసుకోలేదు. వాస్త‌వానికి వైఎస్‌, బాబు, ఆనంలు స‌మ‌కాలికులు. 1976లో నెల్లూరు యూత్‌ కాంగ్రెస్‌ కార్యదర్శిగా ఉండగా అదే సమ యంలో చిత్తూరు, కడప యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నారు. ఆనాటి నుంచి ఆ ఇద్దరు నాయకులతో వివేకాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా తన పరిచయాలను తన తమ్ముని కోసం వాడుకున్నారు తప్ప తన కోసం ఉపయోగించుకో లేదు.

 

అయితే, తాను మాత్రం సాధార‌ణ ప‌ద‌వుల్లో ఉంటే చాల‌ని అనుకున్నారు. అయితే, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్‌పై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉండ‌డంతో ఆనం వ‌ర్గం ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంది. ఆ త‌ర్వాత ఇక కాంగ్రెస్‌లో ఉండి లాభం లేద‌ని భావించి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆనం వివేకాకు ఎమ్మెల్సీ, ఆనం రామ నారాయ‌ణ‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చిన‌ట్టు పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. అయితే, నాలుగేళ్లు గ‌డిచి పోయినా బాబు నుంచి ఎలాంటి ఉలుకు, ప‌లుకు కూడా లేకుండా పోయింది. దీంతో ఆనం వివేకా మాన‌సికంగా తీవ్రంగా న‌లిగిపోయారు. 

 

ఇదిలావుంటే, గ‌త ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు సుబ్బారెడ్డికి టికెట్ ఇప్పించు కున్నా.. ఆయ‌న గెల‌వ‌లేక పోయాడు. ఇది కూడా ఆనంను కుంగ‌దీసింది. ఇక‌, త‌న‌కు ఎమ్మెల్సీ అయినా ద‌క్కుతుంద‌ని ఆశ పెట్టుకున్నా అది కూడా సాధ్యం కాలేదు. దీంతో ఆనం ప‌ద‌విపై దిగులు పెట్టుకున్నాడు. ఎమ్మెల్సీ గా వెళ్లిపోవాలన్న కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇవ‌న్నీ త‌లుచుకుని ఆనం వ‌ర్గీయులు, అభిమానులు కంట‌త‌డి పెడుతున్నారు. 

 

ఆ దిగులే వివేకాను మింగేసిందా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share