ఆళ్లకి అదిరిపోయే షాక్‌!.. కోర్టు చీవాట్లు కూడా!

January 6, 2018 at 4:11 pm

అన్ని విష‌యాల్లోనూ మ‌న‌దే పైచేయి అంటే కుద‌ర‌దు క‌దా?! ఈ విష‌యం ఇప్పుడే తెలిసొచ్చింది మంగ‌ళ‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి! రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌లు కార్య‌క్ర‌మాలు స‌హా వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నార‌ని భావించే వారిపైనా ఇటీవ‌ల కాలంలో ఆళ్ల న్యాయ‌పోరాటాల‌కు దిగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ప్ర‌భుత్వంపై 25కు పైగా పిటిష‌న్లు వేశారు. రైతుల భూములు బ‌ల‌వంతంగా లాక్కుంటున్నార‌ని, అగ్రి గోల్డ్  బాధితుల‌కు న్యాయం చేయ‌డం లేదని, స‌దావ‌ర్తి స‌త్రం భూముల‌ను త‌మ్ముళ్ల‌కు దోచి పెడుతున్నార‌ని పేర్కొంటూ కోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. కొన్నింటిలో విజ‌యం సాధించారు. మ‌రికొన్నింటిలో చేదు అనుభ‌వాలు త‌ప్ప‌లేదు. 

ఈ ప‌రంప‌ర‌లోనే వైసీపీకి బ‌ద్ధ శ‌త్రువు.. ఆంధ్ర‌జ్యోతి పేప‌ర్‌పై కూడా ఆళ్ల కోర్టుకెక్కారు. స‌ద‌రు ప‌త్రిక‌లో త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాశార‌ని, జ‌గ‌న్ ప‌రువు తీశార‌ని పేర్కొంటూ హైకోర్టులో ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేశారు. ఈ క్ర‌మంలో చాలా సీరియ‌స్ అయిన కోర్టు.. ఆంధ్ర‌జ్యోతి అధిప‌తి రాధాకృష్ణ‌కు స‌మ‌న్లు పంపింది. ఆయ‌న రాక‌పోవ‌డంతో నాన్ బెయిల‌బుల్ వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో కొన్నాళ్ల కింద‌ట ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఇక‌, ఇప్పుడు ఇదే విష‌యంలో ఆళ్ల‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. కోర్టు చీవాట్లు కూడా త‌ప్ప‌లేదు. విష‌యంలోకి వెళ్తే.. గ‌త ఏడాది జ‌రిగిన నంద్యాల ఉప పోరుకు ముందుకు వైసీపీఅధినేత జ‌గ‌న్ ఆయ‌న అనుచ‌రులు కొంద‌రు ఢిల్లీకి వెళ్లారు. అక్క డ‌ప్ర‌ధాని మోడీని క‌లిశారు. 

అయితే, ఈ భేటీపై దృష్టి పెట్టిన జ్యోతి ప‌త్రిక మోడీని మ‌భ్య‌పెట్టి కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు మాత్ర‌మే జ‌గ‌న్ ఢిల్లీ బాట ప‌ట్టాడ‌ని పేర్కొంటూ.. అమ్మ జ‌గ‌నా! పేరుతో ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. అయితే, దీనిపై మండిప‌డ్డ ఆళ్ల‌.. జ‌గ‌న్ ప‌రువు తీశారంటూ కోర్టుకెక్కారు. దీనిపై సుదీర్గ విచార‌ణ చేసిన కోర్టు.. నిన్న తుది తీర్పు వెలువ‌రించింది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై ఆయన వేసిన పరువునష్టం కేసును శుక్రవారం కొట్టివేసింది. ఈ కేసును కొట్టి వేయాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యం హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని లోతుగా విచారించిన హైకోర్టు శుక్రవారం 69 పేజీలు సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది. వేర్వేరు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఉటంకించారు. ఆ కథనంతో మీకేం సంబంధం ఉందని పిటిషనర్‌ను నిలదీశారు. సంబంధంలేని అంశంపై కోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. పిటిషనర్‌కు ఎలాంటి అర్హతా లేదని స్పష్టం చేశారు. మొత్తంగా ఈప రిణామం ఆళ్ల‌కు అదిరిపోయే షాకిచ్చింది. మ‌రి ఆయ‌న త‌దుప‌రి డెసిష‌న్ ఏంటో చూడాలి. 

 

ఆళ్లకి అదిరిపోయే షాక్‌!.. కోర్టు చీవాట్లు కూడా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share