ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌.. బాబుకు బీజేపీ షాక్‌

July 3, 2018 at 12:14 pm
Andhra Pradesh, conflicts between BJP and TDP, BJP leaders are fire on chandra babu

ఏపీలో వివిధ వ‌ర్గాల‌పై దాడులు పెరిగిపోతున్నాయి. శాంతి భ‌ద్ర‌త‌ల అంశం మరోసారి తెర‌పైకి వ‌స్తోంది. ముఖ్యంగా బీజేపీ-టీడీపీ క‌టీఫ్ త‌ర్వాత ప్ర‌జ‌ల్లో ఉన్న భావోద్వేగాల‌ను ఆస‌రాగా చేసుకుని నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా బీజేపీ నేత‌ల‌పై ఆందోళ‌న కారులు భౌతిక దాడుల‌కు దిగుతుండ‌టం ఆ పార్టీ నేత‌ల‌ను క‌ల‌వ‌ర పాటుకు గురిచేస్తోంది. ఏపీకి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందనే అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ నేత‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌జ‌ల్లో బీజేపీపై ద్వేషం పెంచేలా చేయ‌డంలో టీడీపీ నేత‌లు విజ‌య‌వంతం అయ్యారు. స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబే భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టేలా మాట్లాడుతున్నార‌ని బీజేపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఏపీ క‌మ‌ల‌నాథుల‌పై కొంద‌రు దాడులకు తెగ‌పడుతుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. అందుకే ఏపీలో రాష్ట్ర‌పతి పాల‌న విధించాల‌నే కొత్త డిమాండ్ తెర‌పైకి వ‌చ్చింది.

కొద్ది రోజుల క్రితం కొన్ని రోజుల‌ కిందట తిరుమలకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. ఆందోళ‌న కారులు చేసిన దాడిలో ఆయ‌న కాన్వాయ్ లోని ఓ కారు అద్దం పగిలిపోయింది. టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ నేత‌లు ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు అనంతపురం జిల్లాకు వెళ్లారు. అక్కడ కొంత మంది తెలుగు యువత కార్యకర్తలు, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే బీజేపీ కార్యకర్తలు రివర్స్ లో .. వారిపై దాడులకు దిగారు. దీంతో రచ్చ రచ్చ అయింది. ఇటీవ‌ల ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌పైన కూడా దాడికి కొంత‌మంది ప్ర‌య‌త్నించారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి బీజేపీ-టీడీపీ నేత‌ల మ‌ధ్య వార్ మొద‌లైంది. భౌతిక దాడులపై బీజేపీ నేతలు మండిప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పిందని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలంతా కలిసి గవర్నర్ నరసింహన్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లనున్నారు. బీజేపీ నేతలకు రాష్ట్రపతి పాలన విధించాల్సినంతగా లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని చెబుతున్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగింద‌ని బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ మాత్రం దానికే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ దగ్గరకు వెళ్ల‌బోతున్నారు. `కేంద్రంలో ఉన్న మా ప్రభుత్వమే.. మేం ఏమైనా చేయగలమని బెదిరించడమే కదా..!` అంటూ టీడీపీ నాయ‌కులు కూడా స‌మాధానం చెబుతున్నారు.

అనంతపురం ఘటనలో కూడా.. బీజేపీ కార్యకర్తలు దాడి చేశారంటూ టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. బీజేపీనే ఇలాంటి ఆందోళన విషయంలో కాస్తంత రఫ్ గా వ్యవహరించి వివాదం సృష్టించి శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌.. బాబుకు బీజేపీ షాక్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share