ఏపీలో ఫైటింగ్ ఓకే… ఢిల్లీలో ఏం జ‌రుగుతుందో తెలుసా..

February 24, 2018 at 5:46 pm
Andhra pradesh, Delhi, Politicians, TDP, BJP, Special Status

ఏపీ విభ‌జ‌న హామీల అమ‌లు, చ‌ట్టంలోని హామీల మేర‌కు నిధుల మంజూరు.. వంటి కీల‌క అంశాల మీద ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంటు స‌మావేశాల్లో మిత్ర‌ప‌క్షం టీడీపీ భారీ ఎత్తున ఆందోళ‌న‌కు దిగిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా ఏపీలో విప‌క్ష వైసీపీ స‌హా ఇత‌ర ప‌క్షాలు సైతం పోరు జ‌రిపి.. రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇక‌, రాష్ట్ర బీజేపీ-టీడీపీ నేత‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే… భ‌గ్గుమ‌నేలా మారిపోయింది వాతావ‌ర‌ణం. ఏపీలో రెండు పార్టీల మ‌ధ్య తీవ్ర వాగ్యుద్ధం జ‌రుగుతోం ది. మీరు మాకు చేసింది ఏమీలేదు… అని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తుంటే.. ఇదంతా మేమే చేశాం.. అంటూ బీజేపీ నేత‌లు లెక్క‌ల స‌హితంగా వివ‌రిస్తున్నారు. అదేస‌మ‌యంలో మాట‌ల తూటాలు సైతం పేల్చుకుంటున్నారు. ఒక‌రిపై ఒక‌రు కారాలు-మిరియాలు నూరుకుంటున్నారు.  మిత్రులుగా ఉంటూనే ఎత్తి పొడుపుల‌తో కాలం వెళ్ల‌దీస్తున్నారు. 

 

అంతా బాగానే ఉంది. రాష్ట్రంలో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం, లెక్క‌లు, ప‌ద్దులు, జ‌మ‌లు చ‌ర్చించుకోవ‌డం కూ డా బాగానే ఉంది. అయితే, అసలు ఏపీకి ఏం చేయాల‌న్నా.. ఏం ఇవ్వాల‌న్నా కూడా కేంద్రం చేతిలోనే ఉంది. కేంద్రం క‌లం క‌దిలిస్తేనే.. లెక్క‌ల ప‌ద్దులు పెరిగి..,. ఏపీ ఆశ‌లు నెర‌వేరేది. అయితే, ఢిల్లీలో ఈ దిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఏమైనా క‌ద‌లి క ఉందా?  మ‌నకున్న ఇద్ద‌రు కేంద్ర మంత్రులు కానీ, గ‌త పార్ల‌మెంటు స‌మావేశాల్లో భారీ ఎత్తున ప్ర‌సంగించి అంద‌రినీ ఆక‌ట్టుకున్న గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కానీ ఇప్పుడు ఢిల్లీలో మాట్లాడుతున్నారా?  వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారుల ను క‌లుస్తున్నారా?  ఏపీ గురించి మ‌రోసారి అక్క‌డ చ‌ర్చ జ‌రిగేలా చూస్తున్నారా? అంటే క‌నీస మాత్రంగా నైనా స‌మాధానం రావ‌డం లేదు. ఎవ‌రి సొంత ప‌నుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. ఏపీలో మాత్రం రాజ‌కీయాలను వేడి పుట్టిస్తున్నారు. 

 

రాష్ట్ర సమస్యల గురించి ఆలోచించేవారు కానీ, ఆలకించేవారుకానీ ప్రస్తుతం దేశరాజధానిలో కనిపించడంలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా అసెంబ్లీ ఎన్నికల ప్రచార నిమిత్తం రోజుకో రాష్ట్రానికి వెళ్లడంలో నిమగ్నమయ్యారు. దీంతో ఏపీలో జరుగుతున్న విషయాలపై దృష్టిసారించి పరిష్కారమార్గాలు ఆలోచించేవారు ఇక్కడ కనిపించడంలేదు. పార్లమెంటు బడ్జెట్‌ తొలి విడత సమావేశాలు ముగిసి శుక్రవారానికి రెండువారాలు పూర్తయింది. 

 

ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ చేస్తున్న ఏ ఒక్క అంశంపైనా చర్చించిన దాఖలా కనిపించలేదు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరగాల్సిన తెలుగురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం కూడా వాయిదాపడటంతో ఉన్న ఆశకూడా కొడిగట్టిపోయింది. మ‌రి ఢిల్లీలో వేడి పుట్టించకుండా.. ఏపీలో ఎన్ని బూతులు తిట్టుకుని ఏం ప్ర‌యోజ‌న‌మో.. టీడీపీ నేత‌లే చెప్పాలి. ఈ ప‌రిణామాలు అనుమానాల‌కు తావివ్వ‌కుండా చూసుకోవాలి. 

 

ఏపీలో ఫైటింగ్ ఓకే… ఢిల్లీలో ఏం జ‌రుగుతుందో తెలుసా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share