ఏపీ పొలిటికల్ సీన్..వారికి మిగిలింది అదే!

July 7, 2018 at 3:21 pm
Andhra Pradesh, politics, Jumping, YSRCP, TDP, Janasena

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. నేత‌లు ఎలా యూట‌ర్న్ తీసుకుంటారో ఊహించ‌డ‌మూ క‌ష్ట‌మే. క్ష‌ణ‌క్ష‌ణ‌ముల్‌.. నేత‌ల అభిప్రాయాలు మారిపోతుంటాయి. 2014లో వైసీపీ నుంచి వైఎస్ పేరు, సింప‌తీపై గెలుపొందిన 22 మంది ఎమ్మెల్యేలు.. అనంత‌ర కాలంలో త‌మ చిత్తాన్ని మార్చుకుని అధికార పార్టీలోకి జంప్ చేశారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపు మేర‌కు వారంతా అభివృద్ధి కోసం పార్టీ మారిన‌ట్టు చెప్పుకొచ్చారు. వ‌రుస‌గా దాదాపు రెండు నెల‌ల కాలంలోనే 18 మంది పార్టీ మారిపోగా.. మిగిలిన వారు నెమ్మ‌దిగా చేరుతూ వ‌చ్చారు. వీరంతా చెప్పిన‌ట్టు త‌మ నియోజ‌క వ‌ర్గాల్లో అభివృద్ధి కోసం పార్టీ మారామ‌ని చెప్పినా.. తెర‌వెనుక మాత్రం కోట్ల రూపాయ‌లు చేతులు మారిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.

రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న‌.. వైసీపీలో పెను భూకంప‌మే తెచ్చింది. ఎప్పుడు ఎవ‌రు జ‌గ‌న్‌కు హ్యాండిస్తారో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో ఉన్నారు. అయితే, వీరంతా.. టీడీపీలోనే ఉండిపోతారా? బాబుకు జైకొడ‌తారా? టీడీపీ జెండా భుజాన వేసుకుని ఎన్నిక‌ల గోదాలోకి దిగుతారా? అంటే.. అంత‌సీన్ లేద‌ని అంటున్నారు రాజ‌కీయ పండితులు. రాజ‌కీయాల్లో అవ‌స‌రం, అవ‌కాశమే ప‌ర‌మావ‌ధిగా నేత‌లు అడుగులు వేస్తుంటార‌ని సెల‌విస్తున్నారు. ఇక్క‌డ కూడా అంతేన‌ని అంటున్నారు. చంద్ర‌బాబు ఈ 22 మందిలో కొంద‌రికే మంచి పొజిష‌న్ ఇచ్చారు.మ‌రికొంద‌రిని అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం మానేశారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వైసీపీలో ఉండ‌గానే వారికి అంత సీన్ లేద‌ని, కేవ‌ల జ‌గ‌న్ హ‌వా.. వైఎస్ సింప‌తీపై నెట్టుకొచ్చార‌ని, వీరిని చంద్ర‌బాబు ఆదరించార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరికి టికెట్ ఇచ్చినా గెలుపు గుర్రం ఎక్క‌డ క‌ష్ట‌మ‌ని వారు చెప్పుకొస్తున్నారు. ఈ విష‌యం ముందుగానే తెలిసిన చంద్ర‌బాబు ఇలాంటి వారిని ప‌క్క‌న పెట్టార‌ని అంటున్నారు. ఇక‌, ఎమ్మెల్యేల విష‌యానికి వ‌స్తే.. వారి ప‌రిస్థితి కూడా అలానే ఉంది. చంద్ర‌బాబును న‌మ్మి పార్టీ మారితే.. త‌మ‌ను తొక్కేశార‌ని, మ‌ణిగాంధీ వంటి ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి వారు దాదాపు 12 మంది వ‌ర‌కు బాబును వ‌దిలించుకునేందుకే రెడీ అవుతున్నారు.

మ‌రి ఇలా.. ఇప్ప‌టికిప్పుడు పార్టీ మ‌ళ్లీ మారితే.. ప‌రిస్థితి ఏంటి? అనేది రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం. అందుకే వీరంతా అవ‌కాశం చూసుకుని జంప్ చేయాల‌ని యోచిస్తున్నార‌ట‌. తిరిగి వైసీపీలోకి వెళ్దామంటే ఒక్కసారి నమ్మక ద్రోహం చేసిన వారిని, వారు ఎంతటి సమర్థులైనా తిరిగి మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రస‌క్తి లేద‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. దీంతో వీరందరికీ ఇప్పుడు ఒకటే ఆప్షన్. అదే జనసేన. వచ్చే ఎన్నికల బరిలో నిలవాలంటే ఈ బ్యాచ్ కు ఇప్పుడు జనసేనే దిక్కు. ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న అప‌ప్ర‌ద‌ ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్లే ఛాన్సే లేదు. అందుకే లిస్ట్ లో ఉన్న 12మంది ఎమ్మెల్యేలు అవకాశం వచ్చినప్పుడు జనసేనలోకి జంప్ చేద్దామని కాచుక్కూర్చున్నారు. నిజానికి ఈ నిర్ణ‌యం చంద్ర‌బాబుకు శ‌రాఘాతంగా ప‌రిణ‌మిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ఏపీ పొలిటికల్ సీన్..వారికి మిగిలింది అదే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share