ఏపీ బీజేపీలో అంత‌ర్యుద్ధం.. హ‌రిబాబుపై తిరుగుబాటు!

February 19, 2018 at 3:35 pm
AP, BJP, Haribabu, MP, Internal Conflicts

ఏపీ బీజేపీ చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌ని ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వీధి కెక్క‌ని బీజేపీ అంత‌ర్గ‌త అసంతృప్తు లు ఒక్క‌సారిగా భ‌ళ్లు మ‌న్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడే కేంద్రంగా నేత‌లు విరుచుకుప‌డ్డారు. ఈ హ‌ఠాత్ప‌రిణామంతో రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఇటీవ‌ల మ‌రోసారి ఎంపికైన విశాఖ ఎంపీ కంభంపాటి హ‌రిబాబు నివ్వెర పోయారు. ఏం చేయాలో ఆయ న‌కు తోచ‌లేదు. నోట మాట కూడా రాని ప‌రిస్థితి ఏర్ప‌డిందే ప‌రిస్థితి ఎంత సీరియ‌స్‌గా మారిందో నేత‌లు ఏ రేంజ్‌లో విరు చుకుప డ్డారో అర్ధం చేసుకోవ‌చ్చు. 1983లో ఏర్పాటైన బీజేపీలో అందునా ఏపీ శాఖ‌లో ఈ విధంగా రాష్ట్ర అధ్య‌క్షుడి వ్య‌వ హార‌శైలిపై ఒక్క‌సారిగా మూకుమ్మ‌డిగా నేత‌లు విరుచుకు ప‌డ‌డం చ‌రిత్ర‌లో ఇదే తొలిసార‌ని విశ్లేష‌కులు, బీజేపీ సానుభూ తి పరులు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. 

 

మ‌రి ఇంత‌గా నేత‌లు విరుచుకుప‌డ‌డానికి రీజ‌న్ ఏంటి? ఎవ‌రు ఎందుకు అలా చేశారు? వ‌ంటి కీల‌క ప‌రిణామాలు ఇప్పు డు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీశాయి. మ‌రి అవేంటో చూద్దాం.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీ విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల అమ‌లు విష‌యం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హామీల అమ‌లు విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రం స‌హ‌క‌రించ డం  లేద‌ని, నిధులు ఇవ్వ‌డం లేద‌ని పెద్ద ఎత్తున ఆరోపించ‌డతంతోపాటు.. పార్ల‌మెంటులోనూ గ‌లాభా సృష్టించింది. ఇక‌, రాష్ట్రంలో చంద్ర‌బాబు సైతం బీజేపీపై విరుచుకుప‌డేలా త‌మ్ముళ్ల‌ను ప్రోత్స‌హించారు. దీంతో రాష్ట్రంలో ఏ టీడీపీ ఎమ్మెల్యే మీడియా ముందుకు వ‌చ్చినా బీజేపీని దోషిగా నిల‌బెడుతూ.. తాము మిత్ర ధ‌ర్మానికి క‌ట్టుబ‌డి నాలుగేళ్లుగా మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. కేంద్రం రాష్ట్రానికి రూపాయి ఇవ్వ‌డం లేద‌ని చెబుతున్నారు. 

 

ఫ‌లితంగా రాష్ట్రంలో బీజేపీపై వ్య‌తిరేక ప‌వానాలు వీస్తున్నాయి. వాస్త‌వానికి ఏపీలో పుంజుకోవాల‌ని, ప్ర‌త్యేకంగా ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుదిరితే అధికారంలోకి లేక‌పోతే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగానైనా చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు ఈ ప‌రిణామం తీవ్ర ఇబ్బందిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే టీడీపీపై బీజేపీ నేత‌లు విరుచుకుప‌డుతున్నా రు. అయితే, రాష్ట్ర బీజేపీకి అధ్య‌క్షుడుగా ఉన్న హ‌రిబాబు నిన్న నిర్వ‌హించిన ప‌దాధికారుల స‌మావేశంలో కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చిందో చెప్పుకొనేందుకు అభ్యంత‌రం లేద‌ని, కానీ, టీడీపీని టార్గెట్ చేస్తూ.. వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని సూచించారు. దీంతో నేత‌లు రెచ్చిపోయారు. టీడీపీ నేత‌లు.. బీజేపీ నెత్తిన కుంప‌టి పెడుతున్నా చూస్తూ ఉండాలా? అంటూ విమ‌ర్శించారు.

 

నంద్యాల ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌తం ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నించారు. కాకినాడ కార్పొరేష‌న్‌లో సీట్లు ఇచ్చి రెబ‌ల్స్‌ను రంగంలోకి దింపారు. ఇక‌, ఇప్పుడు కేంద్రం నిధులు, ప‌థ‌కాల కింద అనుమ‌తులు భారీ స్థాయిలో ఇస్తున్నా.. ఏమీ ఇవ్వ‌డం లేద‌ని, రాష్ట్రంలో అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోవ‌డానికి బీజేపీనే కార‌ణ‌మంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రి ఇవ‌న్నీ పార్టీని దెబ్బ‌తీసేవి కావా?  అలాంటి స‌మ‌యంలో టీడీపీపై ఎదురు దాడి చేయ‌క‌పోతే ఎలా అంటూ మంత్రి మాణిక్యాల‌రావు, పురందేశ్వ‌రి త‌దిత‌రులు అధ్య‌క్షుడు హ‌రిబాబుపై విరుచుకుప‌డ్డారు. ఈ ప‌రిణామంతో ఆయ‌నకు ఏం చేయాలో నేత‌ల‌ను ఎలా శాంత ప‌ర‌చాలో కూడా అర్ధం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. 

 

తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అధిష్టానం ఆదేశాలే తరువాయి అంటూ పదాధికారుల సమావేశంలో మంత్రి మాణిక్యాల రావు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు అధ్యక్షుడు హరిబాబు ప్రయత్నం చేసినా ఆయన కేర్ చేయలేదు. అత్యధికశాతం మంది టీడీపీపై మరింత దూకుడు పెంచాలనే అద్యక్షుడి పై వత్తిడి తెచ్చారు. పార్టీ వర్గాలనుంచి వెల్లువెత్తిన నిరసన చూసి హరిబాబు అవాక్కయ్యారు. కేంద్రం చేసింది ఏమీలేదంటూ టీడీపీ చేస్తున్న దాడికి ఎదురుదాడి వ్యూహాన్ని బీజేపీ డిసైడ్ చేసేలా సమావేశం లో నిర్ణయాలు జరిగాయి.  వాస్తవానికి ఈ తరహా దూకుడు అధ్యక్షుడు హరిబాబు ఆశించడం లేదు. ఆచితూచి అడుగులు వేయాలనే ఆయన పార్టీ వర్గాలను కోరినా ఎవరు వినే పరిస్థితే లేకుండా పోయింది. మ‌రి ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి. 

 

ఏపీ బీజేపీలో అంత‌ర్యుద్ధం.. హ‌రిబాబుపై తిరుగుబాటు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share