ఏపీ బీజేపీ నేత‌ల‌కు ప‌వ‌న్ భలే సాయం చేశాడే

March 15, 2018 at 1:06 pm
AP, BJP, Pawan Kalyan, Janasena, Politics, AP Special Status

ఏపీ బీజేపీ నేత‌ల‌కు కొత్త ఊపు వ‌చ్చింది. మిత్ర‌ప‌క్షంగా ఇన్నాళ్లూ వ్య‌హ‌రించిన టీడీపీ.. తెగదెంపులు చేసుకుని కేం ద్రం, బీజేపీని బ‌ద్నాం చేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నా.. దానిని తీవ్ర స్థాయిలో ప్ర‌తిఘ‌టించ‌లేకపోతున్నారు. ప్ర‌శ్న‌లు అడుగుతున్నా.. దానికి స‌రైన స‌మాధానం ఇవ్వ‌క‌పోగా తిరిగి విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. త‌మ‌ను ఇబ్బందులు పెడుతున్న చంద్ర‌బాబును ఇరుకున పెట్టాల‌ని భావిస్తున్న వారికి ఇప్పుడు స‌రికొత్త అస్త్రం దొరికింది. ఇన్నాళ్లూ బీజేపీపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన ప‌వ‌న్‌.. ఇప్పుడు టీడీపీ అధినేత‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అవినీతి పెరిగిపోయిందంటూ చేసిన వ్యాఖ్య‌ల‌ను.. బీజేపీ నేత‌లు ప‌ట్టుకున్నారు. తాము ఎప్ప‌టినుంచో ఇవే వ్యాఖ్య‌లు చెబుతున్నామ‌ని, ఇప్పుడు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 

 

బీజేపీతో క‌టీఫ్ త‌ర్వాత‌.. బీజేపీని ఇబ్బందులు పెట్టేందుకు టీడీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. కేంద్రం అన్యాయం చేసింద‌ని ప‌దేప‌దే ఆ పార్టీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఏపీకి న్యా యం చేస్తామ‌ని, ఇప్ప‌టికీ నిధులు ఇచ్చామ‌ని వాటిని ప్ర‌భుత్వం దుర్వినియోగం చేసింద‌ని బీజేపీ నేత‌లు వివ‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే వీరిని టీడీపీ నేత‌లు పట్టించుకోవ‌డం లేదు. అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ గుంటూరులో నిర్వహించిన సభలో  పలు ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్‌ స్కామాంధ్రప్రదేశ్‌ కాకుండా ఉండాలంటే బీజేపీ- టీడీపీకి ఓటేయాలని మోడీ చెప్పారని.. కానీ ఇప్పుడు ఏపీని కరెప్షన్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని పవన్ విమర్శించారు. 

 

ఇసుక ఉచితం అని ప్రజలకు చెప్పి దాన్ని లారీ 15వేలకు అమ్ముతున్నారని పవన్‌ మండిపడ్డారు. దోపిడి చేస్తుంటే చూస్తూ ఉండాలా అని నిలదీశారు. లోకేష్ చేస్తున్న అవినీతి ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిందా లేదా అని నిలదీశారు. ఎన్టీఆర్‌ మనవడు అయి ఉండి ఇప్పుడు ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 2019 ఎన్నికల కోసం ప్రతి నియోజకవర్గానికి పాతిక కోట్లు ఆల్‌రెడీ సిద్ధం చేసేశామని టీడీపీ నేతలు చెబుతున్నారని పవన్‌ వివరించారు. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టేనన్నారు. ఎన్టీఆర్‌ ఆత్మ కూడా క్షోభిస్తోందన్నారు. మీ అబ్బాయి లోకేష్‌ చేస్తున్న అవినీతి మీకు తెలిసి జరుగుతోందా లేదా చెప్పాలన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఈ అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబే సమాధానం ఇవ్వాలని బీజేపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ… జనం అనుకుంటున్నదే ఇవాళ పవన్ చెప్పారన్నారు. ఇసుక, భూములు దోచేస్తున్నారంటూ తాము ఎప్పట్నుంచో చెబుతున్నామన్నారు. మిత్రపక్షంగా తాము చెప్పింది ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పవన్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అటు ప‌వ‌న్‌, ఇటు బీజేపీ నేత‌లు ఇలా మూకుమ్మ‌డి దాడి చేయ‌డంతో టీడీపీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం! 

 

ఏపీ బీజేపీ నేత‌ల‌కు ప‌వ‌న్ భలే సాయం చేశాడే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share