బాబు కత్తిరింపుల్ని ప్రజలకు చెప్పాలి

September 12, 2018 at 3:13 pm

చంద్రబాబునాయుడు వ్యవహార సరళి, పరిపాలన తీరు తెన్నుల మీద రాష్ట్ర భాజపా నాయకులు ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతున్న సంగతి తెలిసిందే. కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న దాదాపు అన్ని పథకాలకు చంద్రబాబు నాయుడు తన పేరు తగిలించుకుంటున్నారనే ఆరోపణ కూడా వారు చాలా కాలంగా చేస్తూనే ఉన్నారు. ‘సొమ్మొకడిది సోకొకడిది.’ అన్న చందంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలద్వారా తనకు, తన పార్టీకి రాజకీయ మైలేజీ పెంచుకుంటున్నారనేది వారి ఆరోపణ.

తాజాగా.. దేశవ్యాప్తంగా ఉండే అంగన్ వాడీలకు మోడీ సర్కార్ వేతనాలు పెంచితే.. ఆ సాయం లబ్ధిదారులకు అందకుండా మధ్యలో చంద్రబాబు కత్తిరించేస్తున్నాడని రాష్ట్ర భాజపా నాయకులు మండిపడుతున్నారు. మోడీ పథకాలకు, సాయానికి… లబ్ధిదారులకు మధ్య కత్తెర పాత్ర పోషిస్తున్న చంద్రబాబు గురించి ప్రజలకు తెలియజెప్పాలని అనుకుంటున్నారు.

Kanna-Lakshminarayana-Fires-on-Chandrababu-naidu-1528026536-142

ఎప్పటినుంచో అంగన్ వాడీ వర్కర్లు రూ.3000 జీతాలకు పనిచేస్తున్నారు. వేతనాల పెంపుగురించి ఎన్నో ఆందోళనలు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వత.. తెలంగాణలో కేసీఆర్ సర్కారు వేతనాలు పెంచేసింది. ఆ తర్వాత ఏపీలో ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. విజయవాడలో ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. ఇంత జరగగా ఇటీవలే వారి వేతనాలను ప్రభుత్వం 10500కు పెంచింది. అందులో 1800 కేంద్రం వాటా కాగా, మిగిలినది రాష్ట్రం భరిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో మోడీ దేశంలో ఉన్న అంగన్ వాడీలు అందరికీ 1500 వంతున వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇవి నవంబరు నుంచి వారి జీతాల్లో కనిపిస్తాయని అన్నారు. అయితే.. ఏపీలో మాత్రం.. వేతనాలు పెరిగే అవకాశం లేదు. కేంద్రం కొత్తగా పెంచుతున్న 1500, తాము ఇదివరకే పెంచిన 7500 లో తమ ప్రభుత్వ ఖాతాకే జమ అయిపోతుందని ఏపీ సర్కార్ వాదిస్తోంది.

d43613c9216eeadc810201e3ba29f489

సరిగ్గా ఈ పాయింటు దగ్గరే ఏపీ భాజపా నాయకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అంగన్ వాడీలకు మేలు చేస్తూ నరేంద్రమోడీ జీతం పెంచితే.. అది వారికి చేరకుండా మద్యలో చంద్రబాబు కత్తెర వేసేస్తారా అంటూ ఆగ్రహిస్తున్నారు. కేంద్రసాయాలు లబ్ధిదారులకు అందకుండా చంద్రబాబు ఎలా డైవర్ట్ చేస్తున్నారో.. అంగన్ వాడీ ల జీతాలకు ఎలా కత్తెర వేస్తున్నారో.. ప్రజలందరికీ తెలియజెప్పేలాగా.. విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అనుకుంటున్నారు.

బాబు కత్తిరింపుల్ని ప్రజలకు చెప్పాలి
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share