మంత్రి ఆది ప‌ని ఖేల్ ఖ‌త‌మేనా?

August 18, 2018 at 10:05 am

వైసీపీ నుంచి గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకుని మంత్రి కూడా అయిన ఆది నారాయ‌ణ రెడ్డి ఫ్యూచ‌ర్‌పై ఆయ‌న అనుచ‌ర గ‌ణంలోనే తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మవుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈయ‌న గెలుపు అంత ఈజీ కాద‌ని అంటున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయ‌న పార్టీలో స‌మ‌న్వ‌యం సంపాయించుకోలేక పోవ‌డ‌మే అంటున్నారు! గ‌త ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లా జమ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ టికెట్‌పై గెలుపొందిన ఆది.. త‌ర్వాత కాలంలో యూట‌ర్న్ తీసుకుని బాబు చెంత‌కు చేరిపోయారు. అయితే, ఇక్క‌డ టీడీపీలో ఆయ‌న ఇమ‌డ‌లేక పోతున్నారు. నాయ‌కుల‌తో క‌లిసి క‌ట్టుగా ముందుకు సాగ‌లేక పోతున్నారు. ఈ ప‌రిణామం ఆయ‌న‌కు చేటు తెస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

1518740414-1633

జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీ సీనియ‌ర్ నేత‌గా రామ‌సుబ్బారెడ్డి ఉన్నారు. ఈయ‌న‌కు ఆదికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఆది టీడీపీ ఎంట్రీని ఈయ‌న తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో టికెట్ల గోల మొదలైంది.జమ్మలమడుగు టీడీపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరుతోంది. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు జమ్మలమడుగు టికెట్ కోసం ఇప్పటి నుంచే సిగపట్లకు దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ తనదేనని ఆదినారాయణరెడ్డి చెప్పుకోవడంపై రామసుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించగా.. ఆది మరోసారి స్పందించారు.

వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు టికెట్ తనదేనని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. అయితే జమ్మలమడుగులో పోటీ చేసేది తానేనని ఆదినారాయణరెడ్డి ఎలా ప్రకటిస్తారు? ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు.. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తామనే హామీ ఇచ్చారని అలాంటిది ఇప్పుడు ఆదినారాయణరెడ్డి ఎలా ప్రకటన చేస్తారని రామసుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఇలా ఒకరికి ఒకరు నాకే అంటూ ఘ‌ర్ష‌ణ‌కు దిగుతున్నారు. వాస్త‌వానికి ఆదినారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరిన తర్వాత జమ్మలమడుగు రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి.

KDP TDP RAMA SUBBA REDDY

ఆదినారాయణరెడ్డి పార్టీలోకి రావడాన్ని రామసుబ్బారెడ్డి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆదినారాయణరెడ్డి వర్గం చేతిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు..? అలాంటి ఆదినారాయణరెడ్డికి తాము ఓట్లు వేయాలా? అని అంటున్నారట! వచ్చే ఎన్నికలలో ఆదినారాయణరెడ్డికి రామసుబ్బారెడ్డి వర్గం ఓటు వేయదని గట్టి వాదన కూడ వినిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మంత్రి ఆది ప‌ని ఖేల్ ఖ‌త‌మేనా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share