ఏపీలో తాజా పొలిటికల్ సర్వే…విజయం ఎవరిది?

June 9, 2018 at 3:34 pm

`2019 ఎన్నిక‌ల్లో టీడీపీని గెలిపించ‌డం చారిత్ర‌క అవ‌స‌రం. న‌న్ను మ‌ళ్లీ ఆశీర్వ‌దించండి` అని ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల‌ను ఇప్ప‌టి నుంచే కోరేస్తున్నారు. ఏపీ అభివృద్ధి నాతోనే సాధ్యం.. వేరొక‌రు వ‌స్తే ఇక ఏపీ అభివృద్ధి చెంద‌దు అనే రేంజ్లో స్పీచ్‌లు ఇస్తున్నారు. నాలుగేళ్ల‌లో చేసిన అభివృద్ధి గురించి చెప్ప‌కుండా ఇలా ప్ర‌చారం చేస్తున్నారేంటా అనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోప‌ణ‌లు, హోదా విష‌యంలో చంద్ర‌బాబు కుప్పిగంతులు.. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల్లో అసంతృప్తిని పెంచుతున్నాయంటూ తాను సొంతంగా నిర్వ‌హించ‌ని స‌ర్వేల్లో తేలిపోవ‌డంతో ఇలాంటి ప్ర‌చారానికి తెర‌తీశార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. తాజాగా నిర్వ‌హించిన స‌ర్వే.. టీడీపీ నేత‌ల గొంతులో వెల‌క్కాయ ప‌డేలా చేసింది. చంద్ర‌బాబు ఎన్ని ప్రార్థ‌న‌లు చేసినా.. ఎంత‌లా వేడుకున్నా.. అవ‌న్నీ ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేద‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబుకు ఓటేసేందుకు నిరాక‌రిస్తున్నారని తేలింది. 
 
చంద్ర‌బాబు ఒక‌టి తలిస్తే ఏపీ ప్ర‌జ‌లు మ‌రొక‌టి భావిస్తున్నారా? అంటే అవున‌నే అంటోంది టైమ్స్ ఆఫ్ ఇండియా స‌ర్వే! అవును.. ప్రభుత్వ అవినీతిమ‌య‌మైనా.. ఎమ్మెల్యేలు అవినీతి అయినా ఎన్నికల సమయంలో గుర్తుపెట్టుకో కుండా తనకు ఓటు వేయటం చారిత్రక అవసరం అని చంద్రబాబు కొంత కాలంగా ప్రజలకు నూరిపోస్తున్నారు. చంద్రబాబు కోరుకుంటున్నది ఒకటి అయితే ప్రజలు తలస్తున్నది మరొకటిగా ఉంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఏ మాత్రం గెలిచే ఛాన్స్ లేదని స‌ర్వేలో తేలింద‌ట‌. ఈ ప్రజాభిప్రాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో బాబు గెలుపునకు ఛాన్సేలేదని తెలుస్తోంది. త‌నకు తాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకుంటుంటే ప్రజలు మాత్రం చంద్రబాబు అనుభవం ఏపీకి ఏ మాత్రం ఉపయోగపడలేదని తేల్చిచెప్పారు. 
 

ఏపీలో చంద్రబాబు పాలన నాలుగేళ్లు పూర్త‌యిన సందర్భంగా ఈ స‌ర్వే జ‌రిగింది. చంద్రబాబు నాలుగేళ్ల పాల‌న‌పై ఏపీలోని ప్రజలు 57 శాతంపైగా నిరాశ వ్యక్తం చేశారు. 42.70 శాతం మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశార‌ట‌. అందులోనూ కేవలం 16 శాతం సూపర్ అన్నార‌ట‌.ఏపీ ప్రగతికి చంద్రబాబు అనుభవం ఏ మాత్రం ఉపయోగపడలేదని 58.30 శాతం తేల్చిచెప్పారు. 33.18 శాతం మాత్రం బాబు అనుభవం పనికొచ్చిందని అంటున్నారు. ఈ క్షణాన ఎన్నికలు జరిగితే ఎవరికి ఓటు వేస్తారని ప్రశ్నించగా.. 42 శాతం జగన్ కు అని  చెప్పగా.. చంద్రబాబుకు 30.85 శాతం మాత్రమే మద్దతు పలికారు. ఇందులో పవన్ కల్యాణ్ కు ఏకంగా 19.35 శాతం రావటం విశేషం. 7.8 శాతం మంది ఇతరులకు అని చెప్పారు. పీఆర్పీ కంటే జనసేన అధినేత పవన్ కు ఎక్కువ శాతం ఓట్లు వచ్చే అవకాశం కన్పిస్తోంది. 
 
బీజేపీతో పొత్తు తెంచుకోవటం మంచిదని 41.39 శాతం చెప్పగా, 35.15 శాతం పెద్ద లాభదాయకం కాదన్నారు. మిగిలిన వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇందులో తేలిన మరో సంచలన విషయం ఏమిటంటే ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం విపరీతంగా పెరిగిందని 67.89 శాతం తేల్చార‌ట‌. 17 శాతం మాత్రమే తాము లోకేష్ జోక్యం లేదని నమ్ముతున్నార‌ట‌. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవటమే కాకుండా.. వారికి మంత్రి పదవులు ఇవ్వటంపైనా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అదే సమయంలో ఏపీలో అవినీతి 64.50 శాతం పెరిగిందని చెప్పగా.. 20 శాతం మాత్రం అవినీతి పెరగలేద‌న్నార‌ట‌. ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు విఫలమయ్యారని ఎక్కువ మంది తేల్చారు. మొత్తంగా వ‌చ్చే సార్వత్రిక ఎన్నికలు బాబుకు స‌వాల్ అని తేల్చేశాయి. 

ఏపీలో తాజా పొలిటికల్ సర్వే…విజయం ఎవరిది?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share