వాజ్‌పేయిపై బాబుకు ఇంత కోప‌మా? ఏం చేశారంటే!

August 17, 2018 at 4:35 pm

మ‌హానేత‌గా, మ‌చ్చ‌లేని రాజ‌కీయ రుషిగా ప్ర‌పంచ వ్యాప్తంగా కొనియాడ‌బ‌డుతున్న దివంగ‌త వాజ్‌పేయి.. పార్ధివ దేహానికి ప్ర‌పంచ నాయ‌కులు సైతం అంజ‌లి ఘ‌టిస్తున్నారు. ఆయ‌న సేవ‌ల‌ను సైతం కొనియాడుతున్నారు. అంతెందుకు ఆయ‌నంటే మండి ప‌డే పాకిస్థాన్ సైతం ఆయ‌న ఫొటో పెట్టి అంజ‌లి ఘ‌టించింది. ఆయ‌నను కొనియాడ‌క పోయినా.. తిట్ట‌లేదు. ఆయ‌న క‌వి అంటూ.. కాబోయే ప్ర‌ధాని(ఈనెల 18 ప్ర‌మాణం చేస్తారు) ఇమ్రాన్ ఖాన్ సంతాపం వ్య‌క్తం చేశారు. ఇక‌, అమెరికా, బ్రిట‌న్ వంటి రాష్ట్రాల్లో కూడా వాజ్‌పేయికి ఘ‌న నివాళులు అర్పిస్తున్నారు. ఇక‌, దేశం విష‌యానికి వ‌స్తే.. ప్ర‌తి రాష్ట్ర‌మూ.. ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడింది. ఆయ‌న ప్ర‌ధానిగా ఉన్న కాలంలో అమ‌లు చేసిన ప‌థ‌కాలు, ఆయా రాష్ట్రాలు పొందిన ల‌బ్ధి వంటి వాటిపై పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం కూడా శుక్ర‌వారం ఒక‌పూట సెల‌వు ప్ర‌క‌టించి మ‌హాభినిష్క్ర‌మ‌ణం చెందిన మ‌హానేత‌కు ఘ‌న నివాళి అర్పించింది. త‌మిళ‌నాడు,కేర‌ళ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాలు కూడా సెల‌వు ప్ర‌క‌టించి మాజీ ప్ర‌ధానికి సంతాపం వ్య‌క్తం చేశారు. నిన్న‌గాక మొన్న పుట్టిన తెలంగాణ‌లోనూ వాజ్‌పేయికి అక్క‌డి ప్ర‌భుత్వం అంజ‌లి ఘ‌టించి సెల‌వు ప్ర‌క‌టించి, అధికారిక కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేసుకుంది. కానీ, వాజ్‌పేయితో అంట‌కాగి, ఆయ‌న ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధి పొంది.. హైటెక్ సిటీ నిర్మాణం వంటి వాటికి అనుమ‌తులు తెచ్చుకుని, ఆయ‌న స‌హ‌కారంతో గ‌ట్టెక్కిన చంద్ర‌బాబు, ఏపీ సీఎం మాత్రం వాజ్‌పేయిని చుల‌క‌న చేశార‌నే భావం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మవుతోంది. మచ్చలేని నాయకుడు ,ఉత్తమ పార్లమెంటేరియన్, 3 సార్లు ప్రధాని అయిన అటల్ బిహారీ వాజపేయి మృతికి సంతాపసూచకంగా అన్ని రాష్ట్రాలు సెలవుదినంగా ప్రకటిస్తే.. చంద్ర‌బాబు మాత్రం సెల‌వు ఇవ్వ‌కుండా అధికారిక కార్య‌క్ర‌మాల‌ను కానిచ్చేశారు.

దీనికి చంద్ర‌బాబుకు బీజేపీపై ఉన్న కోపంమేన‌ని టీడీపీలోని సీనియ‌ర్లే భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. వాజ్ పేయి ప్రభుత్వంలో గతంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆయన మరణానంతరం కూడా చావువద్ద కూడా రాజకీయంగా ప్రవర్తిస్తున్నారు. వాజ్ పేయి ప్రభుత్వంలో నీవు భాగస్వామి అని మరిచిపోయావా చంద్రబాబూ? ఛీ మరీ ఇంత అవకాశవాదమా? అని టీడీపీ సీనియ‌ర్ నాకులే ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అలాగే చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం యావత్ రాష్ట్రానికే చెడ్డపేరు తీసుకొచ్చేలా ఉందని మండిపడుతున్నారు.

అయితే, కొస‌మెరుపు ఏంటంటే.. ఇలా సెల‌వు ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణం.. వాజ్‌పేయికి సెల‌వులంటే ఇష్టంలేద‌ని చంద్ర‌బాబు విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అయితే, దీనిపైనా ఉన్న‌తాధికారులు సటైర్లు విసురుతున్నారు. చంద్ర‌బాబుకు ఒక్క‌రికే వాజ్ పేయి ఇలా చెప్పి ఉంటార‌ని, అందుకే ఆయ‌న ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. ఒక‌వేళ నిజంగానే వాజ్‌పేయికి ఇష్టం లేక‌పోతే.. బీజేపీ ఎందుకు సెల‌వు ప్ర‌క‌టించిందో బాబు వివ‌ర‌ణ ఇస్తే బాగుంటుంది. ఏదేమైనా ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేయ‌డం బాబుకు ఈ మ‌ధ్య కాలంలో బాగా అల‌వాటైంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

వాజ్‌పేయిపై బాబుకు ఇంత కోప‌మా? ఏం చేశారంటే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share