అక్కడ గెలుపు మళ్లీ వైసీపీదేనా…!

October 17, 2018 at 10:39 am

ఎక్క‌డైనా.. ఎప్పుడైనా.. గెలుపు గుర్రం ఎక్కాల‌నుకునే వారు వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తారు. కానీ, అధికార టీడీపీ మా త్రం అలా చేయ‌డంలేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా టీడీపీ చచ్చు రాజ‌కీయాల‌కు తెర‌దీస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కీల‌కంగా ముందుకు వెళ్లాల‌ని టీడీపీ భావిస్తోంది. ముఖ్యంగా తిరిగి అధికారం నిల‌బెట్టుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే, ఇది అంత ఈజీ కాద‌నే విష‌యం తాజాగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. రాష్ట్రంలో టీడీపీ ఒక‌ప‌క్క‌, మిగిలిన పార్టీలు మొత్తం మ‌రోప‌క్క అనే విధంగా రాజ‌కీయాలు మారుతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఈ వ్యూహ ప్ర‌తివ్యూహాలుమ‌రింత పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది.

cm-11

ఇక‌, నెల్లూరు వంటి వైసీపీకి మంచి బ‌లం ఉన్న జిల్లాలోటీడీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌ని అంద‌రూ భావించా రు. కానీ, వ్యూహాత్మ‌కంగా మాత్రం అడుగులు వేయ‌క‌పోగా.. యువ‌త‌ను ప‌క్క‌న పెడుతోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ నుంచి బొల్లినేని కృష్ణ‌య్య‌ను చంద్ర‌బాబు రంగంలోకి దింపుతున్న‌ట్టు స‌మాచారం. దీనిని తాజాగా ఆదాల ప్ర‌భా క‌ర్ రెడ్డి వంటి కీల‌క నాయ‌కులు కూడా ధ్రువీక‌రించారు. దీంతో ఇక్క‌డ నుంచి బొల్లినేని పోటీ చేయ‌డం ఖాయంగా క‌ని పిస్తోంది. ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి కుమారుడు, మేక‌పాటి గౌతంరెడ్డి ప్రాతినిధ్యం వ‌హి స్తున్నారు. ఈయ‌న యువ నాయ‌కుడు కావ‌డం, మంచి ఫాలోయింగ్ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

మ‌రి ఇలాంటి చోట‌.. వృద్ధ‌నాయ‌కుడికి చంద్ర‌బాబు చోటు ఇవ్వ‌డం అంటే.. ఓట‌మిని అంగీక‌రించ‌డ‌మే న‌ని అంటు న్నా రు. నిజానికి ఇక్క‌డ రెడ్డి వ‌ర్సెస్ క‌మ్మ పోరు సాగుతోంది. ఈ నేప‌థ్యంలో బొల్లినేనికి శిష్యుడుగా ఉన్న క‌న్న‌బాబు.. వ్యూహా త్మ‌కంగా టీడీపీకి అనుకూలంగా మార‌తాడ‌ని బాబు ఊహించి ఉండొచ్చు. కానీ, క‌న్న‌బాబు మాత్రం అలా ఆలోచించ‌డం లేదు. ఆదాల విష‌యంలో త‌న‌కు ఏర్ప‌డిన వివాదాన్ని ప‌రిష్క‌రించ‌లేక‌పోగా, ఆదాల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని బొల్లినేనిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న వ‌ర్గం మొత్తం బొల్లినేనికి వ్య‌తిరేకంగా ప‌నిచేసే ప్ర‌మాదం పొంచి ఉంది.మ‌రి ఇది టీడీపీకి ఎట్టిప‌రిస్థితిలోనూ ప్ల‌స్ అయ్యే అవ‌కాశం లేదు. పైగా వృద్ధ నేత కావ‌డం బొల్లినేనికి మైన‌స్ కానుంది. ఆయ‌న ఎప్పుడో 1999లో ఆత్మ‌కూరు నుంచి గెలుపొందారు. అదికూడా కాంగ్రెస్ టికెట్‌పై. మ‌రి ఇది టీడీపీకి ఎలా ప్ల‌స్ అవుతుందో చంద్ర‌బాబుకే తెలియాలి!

అక్కడ గెలుపు మళ్లీ వైసీపీదేనా…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share