అయ్య‌న్న పాత్రుడుకు పుత్ర‌ర‌త్నం బెంగ‌..!

May 5, 2018 at 4:28 pm
Ayyanna Patrudu, TDP, Minister, Son, political Entry

త‌న‌యుడి భ‌విష్య‌త్‌ను తండ్రి తీర్చిదిద్దితే.. ఇక్క‌డ‌మాత్రం తండ్రి రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను త‌న‌యుడు ప్ర‌శ్నార్థకం చేస్తున్నారు. తండ్రి సంపాదించిన పేరును పాత‌రేసే ప‌నిలో కొడుకు నిమ‌గ్న‌మ‌య్యారు. ఇప్పుడు విశాఖ‌ప‌ట్నంలో ఎక్క డ‌ న‌లుగురు నాయ‌కులు క‌లిసినా ఇదే చ‌ర్చ‌. రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇదే హాట్‌టాపిక్‌. ఎవ‌రా తండ్రీకొడుకులని అనుకుంటున్నారా..? అయితే ఈ క‌థ‌నం మీరు చ‌ద‌వాల్సిందే. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ముఖ్య‌మంత్రితో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అయ్యన్నపాత్రుడు గతంలో వలే నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేయలేకపోయారనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. పంచాయతీశాఖ గ్రామీణ నీటిపారుదలశాఖకు మంత్రిగా అయ్యన్న ఉన్నప్పుడు ముఖ్య నిర్ణయాలన్నింటిపై ఆయన కుమారుడి ప్రభావం పనిచేసిందని టాక్. 

 

ప్ర‌స్తుతం తండ్రీత‌న‌యుల‌పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా పేరుకే మంత్రి అయ్యన్న అని…పెత్తనమంతా కుమారుడిదేనని ఆశాఖలో ప్రచారం జరుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం ఆ శాఖ అధికారులు మంత్రిగారి ఉత్త‌ర్వుల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌తీ ప‌నిని క్షుణ్ణంగా ప‌రిశీలించిన త‌ర్వాతే ఫైళ్ల‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా.. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తాను పోటీ చేయకుండా తన కుమారుని రాజకీయ వారసునిగా రంగంలోకి దింపాలని రోడ్లు,భవనాలశాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు నిర్ణయం తీసుకోవడం విశాఖపట్నంలో సంచలనం సృష్టించింది. 

 

ప్రతి విషయంలో నిర్మొహాటంగా మాట్లాడుతూ బాహాటంగా విమర్శలు, ఆరోపణలు చేసే మంత్రి అయ్యన్నపాత్రుడుకు త‌న‌యుడితోనే చిక్కులు వ‌చ్చిప‌డుతున్నాయ‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే కుమారుడి ఒత్తిడి వ‌ల్ల‌ మంత్రి ఆ విధంగా వ్యవహరించారా..? లేదా బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే విషయంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ప్ర‌తీ ప‌ని వెనుక మంత్రి అయ్యన్న కుమారుడి ప్రమేయం ఉందని అందరికీ తెలిసిపోయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో పుత్రరత్నాన్ని రాజకీయ వారసుడిగా అయ్యన్నపాత్రుడు తీసుకొస్తే.. ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఓకే అంటారా..? అని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయమంటే పోటీ చేస్తానని.. అదేస‌మ‌యంలో తన కుమారునికి కూడా అవకాశం ఇవ్వాలని మంత్రి అయ్యన్న పట్టుపడుతుతున్న‌ట్లు స‌మాచారం. 

 

1996లో అనకాపల్లి ఎంపీగా అయ్యన్నపాత్రుడు విజయం సాధించి 1998లో ఓడిపోయారు. అప్పట్లో తాను ఎంపీగా గెలిచానని..మళ్లీ తనకు అవకాశం ఇవ్వాలని..తన కుమారునికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు పట్టుబట్టే అవకాశం ఉంద‌ని స‌మాచారం.  ఈ నేప‌థ్యంలో అయ్య‌న్న విష‌యంలో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

అయ్య‌న్న పాత్రుడుకు పుత్ర‌ర‌త్నం బెంగ‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share