బాల‌య్య భ‌య‌ప‌డుతున్నారా? ఆద‌ర్శంగా నిలుస్తున్నారా?

June 29, 2018 at 2:25 pm
Balakrishna, TDP, MLA, Hindupur constituency, SC colony, staying

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎన్నిక‌ల స‌మ‌యం జ‌రుగుతోంది. మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఎవ‌రికి వారు.. త‌మ గెలుపుకోసం విప‌రీతంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు కొన్ని ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌ను సైతం గీసేశారు. కొద్దిరోజుల్లోనే నేత‌లంతా.. ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని ఆయ‌న ఇప్ప‌టికే దిశానిర్దేశం చేసేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కి తీరాల్సిందేన‌ని, రికార్డు సృష్టించాల్సిందేన‌ని ఆయ‌న తీర్మానించేశారు. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యేల‌కు ర్యాంకులు కూడా ప్ర‌క‌టించారు. ఈ ర్యాంకుల్లో వెనుక‌బ‌డ్డ వారిని ఇంటికి పిలిచి మ‌రీ త‌లంటే కార్య‌క్ర‌మాన్ని ఉద్రుతం చేశారు.

ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే.. బాల‌కృష్ణకు కూడా బాబు చూచాయ‌గా ఫోన్‌లోనే కొన్ని హెచ్చ‌రిక‌లు పంపారని అమ‌రావ‌తి వ‌ర్గాలు అంటున్నాయి. బాల‌య్య‌ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన త‌ర్వాత‌.. గ‌డిచిన నాలుగేళ్ల‌లో అక్క‌డ అభివృద్ధి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేర‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు అంత‌ర్గ‌తంగా నిర్వ‌హించిన సర్వేలోనూ బాల‌య్య‌కు పెద్ద‌గా మార్కులు ప‌డ‌లేదు. ఆయ‌న నియ‌మించిన గ‌త పీఏ ఇక్క‌డ తీవ్ర వివాదం సృష్టించిన విష‌యం తెలిసిందే. దీంతో బాల‌య్య గ్రాఫ్ భారీ ఎత్తున నేల చూపులు చూస్తోంది. దీనిని గ‌మ‌నించిన బాల‌య్య ఇప్పుడు చ‌క్క‌దిద్దుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.

నిజానికి హిందూపురం టీడీపీకి కంచుకోటే అయినా.. మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఎక్కువ‌గా ఇక్క‌డ క‌నిపిస్తోంది. నాలుగు షూటింగులు, రెండు సినిమాలు అంటూ బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గానికి దూర‌మ‌వుతున్నార‌నే వ్యాఖ్య‌లుజోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌జ‌ల‌ను సంతృప్తి ప‌రిచేందుకు వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. ఎప్పుడూ సినిమా షూటింగులతోనే గడిపేస్తూ, తన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టే ప్రయత్నాలను బాలకృష్ణ ప్రారంభించారు. హిందూపురం నియోజకవర్గం అంతా విస్తృత పర్యటనలకు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా ‘మూడు రోజుల పల్లె నిద్ర’ల‌కు శ్రీకారం చుట్టారు.

తొలిరోజు చిలమత్తూరు మండలం చాగలేరు ఎస్సీ కాలనీలో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం దిగువపల్లె ఎస్టీ తాండాలో బాలకృష్ణ పల్లెనిద్ర చేశారు. ఊహించ‌ని ఈప‌రిణామం బాల‌య్య విష‌యంపై చ‌ర్చ‌కు దారితీసింది. ఎవ‌రిమాటా విన‌ని సీత‌య్య‌గా పేరు తెచ్చుకున్న బాల‌య్య ఇప్పుడు అనూహ్యంగా ప‌ల్లెనిద్ర‌లు చేప‌ట్ట‌డంపై స‌ర్వ‌త్రా ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆయ‌న ఎన్నిక‌ల విష‌యంలో ఒకింత బెరుకుగానే ఉన్నార‌ని అందుకే ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని అనేవారు పెరుగుతున్నారు. మ‌రి బాల‌య్య మ‌దిలో ఏముందో చూడాలి.

balayya

బాల‌య్య భ‌య‌ప‌డుతున్నారా? ఆద‌ర్శంగా నిలుస్తున్నారా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share