ప‌వ‌న్‌ని హీరోని చేయ‌డం ఇష్టం లేదు.. అదిరిపోయే కౌంట‌ర్‌

March 17, 2018 at 4:12 pm
Balakrishna, TDP, Pawan Kalyan, Janasena, Counter, ananthapuram

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి చంద్ర‌బాబు వియ్యంకుడు, హీరో నంద‌మూరి బాల‌కృష్ణ అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చారు. రెండు రోజుల కింద‌ట గుంటూరులో నిర్వ‌హించిన జ‌న‌సేన ఆవిర్భావ స‌ద‌స్సులో ప‌వ‌న్ రెచ్చిపోయిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మంత్రి లోకేష్‌బాబులు అవినీతిలో కూరుకుపోయార‌ని, అధికార టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయార‌ని అందుకే కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏపీని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వ్యాఖ్య‌లు సంధించారు. 

 

అంతేకాదు, చెన్నైకి చెందిన అవినీతి సామ్రాట్టుగా పేరు తెచ్చుకుని, ఐటీ శాఖ‌కు ప‌ట్టుబ‌డిన‌ శేఖ‌ర్‌రెడ్డి కేసులో మంత్రి నారా లోకేశ్ పేరు కూడా వెలుగు చూసింద‌ని, అందుకే మోడీ… ఉద్దేశ పూర్వ‌కంగానే చంద్ర‌బాబును ప‌క్క‌కు పెట్టార‌ని, అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం సృష్టించాయి. వీటిపై టీడీపీ శ్రేణులు మండిప డ్డాయి కూడా. మంత్రి లోకేష్ స‌హా సీఎం చంద్ర‌బాబు కూడా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. 

 

తాను త‌న తాత ఎన్టీఆర్‌కు, తండ్రి చంద్ర‌బాబుకు మ‌చ్చ‌క‌లిగేలా ఎలాంటి కార్య‌క్ర‌మాలూ చేప‌ట్ట‌న‌ని లోకేష్ శాస‌న మండ‌లిలోనే వెల్ల‌డించారు. ఇక‌, చంద్ర‌బాబు సైతం ట్రాన్స్‌ప‌రెన్సీకి తానే పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకొచ్చారు. అలాంటి త‌న‌పైనే వ్యాఖ్య‌లు చేయ‌డం ఎంత మేర‌కు స‌మంజ‌స‌మ‌ని అన్నారు. ఇక‌, ఈ వ్యాఖ్య‌లు ఇప్ప‌టికీ సంచ‌ల‌నంగానే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా టీడీపీ నేత‌, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌దైన స్టైల్‌లో స్పందించారు. 

 

శనివారం అనంతపురం జిల్లాకు వచ్చిన బాలకృష్ణ.. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలిచ్చేప్రయత్నం చేశారు. ‘‘తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి ఒక్కటే అజెండా. ఎవరెవరో ఏవేవో విమర్శలు చేస్తుంటారు. వాటిని మేం పట్టించు కోం. పవన్‌ కల్యాణ్‌పై నేనేదో మాట్లాడి అతణ్ని హీరోని చెయ్యడం మాకు ఇష్టంలేదు. ఇప్పటికీ, ఎప్పటికీ మేమే హీరోలం’’ అని బాలకృష్ణ చెప్పారు. 

 

అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ.. రూ.2 కోట్లతో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియానికి మరమ్మతులు చేపట్టామని, విద్యార్థులకు ఇండోర్ స్టేడియం ఎంతో అవసరమ ని చెప్పారు. మొత్తంగా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను బాల‌య్య లైట్‌గా కొట్టిపారేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ముందుముందు ఈ ప‌ర్య‌వ‌సానాలు ఎలా మార‌తాయో చూడాలి. 

 

ప‌వ‌న్‌ని హీరోని చేయ‌డం ఇష్టం లేదు.. అదిరిపోయే కౌంట‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share