తెలంగాణ భారం బాలయ్యదే!

October 12, 2018 at 11:40 am

తెలంగాణలో టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా బాలయ్య బాబు రంగంలోకి దిగుతున్నారా..? టీడీపీ అభ్యర్థలు బరిలోకి దిగుతున్న స్థానాల్లో ఆయన పూర్తి స్థాయిలో ప్రచారం చేయబోతున్నారా..? అంతేకాకుండా మహాకూటమి తరుపున కూడా ప్రచారం చేస్తారా..? అంటే తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మదిర నియోజకవర్గాల్లో బాలయ్య బాబు చేసిన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో తెలంగాణ టీడీపీ నేతలు ఆయనను కలిసి ప్రచారం చేయాలని కోరినట్లు తెలిసింది. నిజానికి.. మొదట చంద్రబాబు ప్రచారం చేస్తారనే వార్తలు వినిపించినా.. అది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈనేపథ్యంలో టీడీపీ నేతలు బాలయ్య బాబు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

balayya

ఇందులో భాగంగా నే సారథి స్టూడియోలో బాలయ్య బాబు ను కలిసినట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి కలిసి ఆయనకు విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే… సత్తుపల్లి, మదిరలో ప్రచారం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే తాము బాలకృష్ణ ను కలిసామని అంటున్నారు. స్టూడియోలో నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ రూపుదాల్చుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న విషయం విదితమే. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ సమయంలో.. అదికూడా పార్టీ జెండా ఆవిష్కరణ సన్నివేశం చిత్రీకరిస్తున్న ఆయనను కలవడం ఆనందంగా ఉందని టీ టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఇక్కడ మరొక ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే… తెలంగాణ లో టిక్కెట్లు ఆశిస్తున్న పలువురు టీడీపీ నేతలు బాలయ్య బాబు చుట్టూ తిరుగుతున్నారు. మొన్న ఏపీలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. పలువురు టీ టీడీపీ నేతలు ఆయనను కలవడం గమనార్హం. చంద్రబాబు తో అపాయింట్ మెంట్ దొరకడం కష్టం కావడంతో ఆశావహులు బాలయ్య బాబును ఆశ్రయిస్తున్నారు. ఇదిలా వుండగా.. మహాకూటమి తరుపున ఆయన ప్రచారం చేయడం కొంతమంది కి ఇష్టం లేదనే టాక్ వినిపిస్తోంది. ఆయన ప్రసంగం గందరగోళం గా ఉంటుందని.. అలాంటప్పుడు ప్రచారం సీరియస్ నెస్ తగ్గి అసలుకే ఎసరు పడుతుందని పలువురు నాయకులు లోలోపల గుసగుసలాడుకుంటున్నారు.

తెలంగాణ భారం బాలయ్యదే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share