ఆ టీడీపీ సీనియ‌ర్ ఓడిపోతాడంటూ ల‌క్ష‌ల్లో బెట్టింగ్‌

December 13, 2017 at 12:51 pm
TDP, Senior Leader, 2019 elections, AP, Politics

ఏపీలో ఆ జిల్లాలో ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్‌. టీడీపీలో ఎంతో సీనియ‌ర్ అయ్యి, కీల‌క ప‌ద‌విలో ఉన్న ఆ సీనియ‌ర్ నేత ఆయ‌న ప్ర‌స్తుతం ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌ళ్లీ పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాడ‌న్న చ‌ర్చ‌లు జోరుగా న‌డుస్తున్నాయి. ఆయ‌న చేసిన త‌ప్పులేం లేకున్నా ఆయ‌న పుత్ర‌ర‌త్నం దెబ్బ‌కు నియోజ‌క‌వ‌ర్గంలో కాంట్రాక్ట‌ర్లు, అధికార్లు, చివ‌ర‌కు పార్టీ నాయ‌కులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. 

ఏపీ రాజ‌ధానికి అతి స‌మీపంలో ఉన్న రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ఇప్పుడు స‌ద‌రు సీనియ‌ర్ నేత కంట్రోల్‌లో ఉన్నాయి. పార్టీలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి లేక‌పోయినా జిల్లాలో మాత్రం ఆయ‌న చెప్పిందే వేదం. ఆయ‌న మాట‌కు తిరుగులేదు. గ‌త ఎన్నిక‌ల్లో చ‌చ్చీచెడీ గెలిచిన ఆ సీనియ‌ర్ నేత నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి విష‌యంలో కొన్ని మంచి ప‌నులు చేసిన మాట వాస్త‌వం. అయితే స‌ద‌రు నేత‌గారి పుత్ర‌ర‌త్నం ఎంట‌ర్ అయ్యాక ప‌రిస్థితి మొత్తం తేడా కొట్టేసింది. 

మురుగుదొడ్ల నిర్మాణం నుంచి ఇళ్ల నిర్మాణం, రోడ్లు, ఇత‌ర ప‌నులు ఏదీ వ‌ద‌ల‌కుండా ఎంత దొరికితే అంత కాంట్రాక్ట‌ర్ల నుంచి పిండేయ‌డం ఆయ‌న‌కు మామూలైపోయింది. ఈ సంగ‌తి ఇలా ఉంటే ఓ ప‌ని ఓ కాంట్రాక్ట‌ర్‌కు అప్ప‌గిస్తే ఆయ‌న 5 శాతం క‌మీష‌న్ ఇస్తే ముందుగా ఆయ‌న‌కే ఆ ప‌ని ఇస్తున్నారు. త‌ర్వాత మ‌రో కాంట్రాక్ట‌ర్ క‌మీష‌న్ 10 శాతం ఇస్తామంటే ముందు ఇచ్చిన కాంట్రాక్ట‌ర్‌ను త‌ప్పించేసి 10 శాతం క‌మీష‌న్ ఇస్తామ‌న్న కాంట్రాక్ట‌ర్‌కు ఇస్తున్నారు. 

దోపిడీకి రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోను ఛాన్స్ దొర‌క‌డంతో స‌ద‌రు పుత్ర‌ర‌త్నం ఆడిందే ఆట‌..పాడిందే పాట‌గా మారింది. ఈ పుత్ర‌ర‌త్నం అడ్డ‌గోలు దోపిడీయే ఇలా ఉంటే ఆయ‌న కుమార్తెపై కూడా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌నే కాదు, ఆయ‌న వార‌సుడు పోటీ చేసినా చిత్తు చిత్తుగా ఓడిపోతార‌ని, అక్క‌డ వైసీపీ ఒక్క ఓటు తేడాతో అయినా గెలుస్తుంద‌ని జిల్లాలో పార్టీల నాయ‌కులే కాకుండా న్యూట్ర‌ల్ పీపుల్ కూడా స‌వాల్ చేసి మ‌రీ ల‌క్ష‌ల్లో పందేలకు దిగుతున్నారు. 

చాలా మంది ఇప్పుడే పందేలు కాసుకుందాం… ఎన్నిక‌ల్లో ఫ‌లితాల త‌ర్వాత ఆయ‌న ఓడిపోతే పందెం గెలిచిన వాళ్లు పందెం డ‌బ్బుల‌తో పాటు అప్ప‌టి వ‌ర‌కు తాము పందెం క‌లిపిన మొత్తానికి వ‌డ్డీ వేసి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ పందేలు ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే కాదు… జిల్లాలో మిగిలిన ఏరియాల్లో కూడా స‌వాల్ చేసి మ‌రీ కాస్తున్నారు. దీనిని బ‌ట్టి స‌ద‌రు సీనియ‌ర్ నేత‌పై, ఆయ‌న కుటుంబంపై ఏ రేంజ్‌లో వ్య‌తిరేక‌త ఉందో అర్థ‌మ‌వుతోంది.

ఆ టీడీపీ సీనియ‌ర్ ఓడిపోతాడంటూ ల‌క్ష‌ల్లో బెట్టింగ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share