భార‌త్ బంద్‌.. మోడీ పాల‌న‌కు పోగాలం వ‌చ్చిన‌ట్లే..!

September 10, 2018 at 10:41 am
Bharath Bandh, Petrol rates hike, BJP, Modi

నీతులు ప‌లికి గోతులు తీయ‌డ‌మంటే ఇదేనేమో..! తాము అధికారంలోకి వ‌స్తే.. పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గిస్తాం.. న‌ల్ల‌ధ‌నాన్ని దేశానికి తిరిగి తెప్పిస్తాం.. అంటూ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సంసారి ప‌లుకులు ప‌లికిన మోడీ.. ఇప్పుడు ఏకంగా దేశ ప్ర‌జానీకాన్నినిర్దాక్షిణ్యంగా పెట్రోల్ మంట‌ల్లోకి తోసేస్తున్నాడు. ఇంధ‌న ధ‌ర‌లు మండిపోతుంటే.. మోడీ ప్ర‌భుత్వం అందిన‌కాడికి దండుకుంటోంది. గ‌త ఎన్నిక‌లకు ముందు గుజ‌రాజ‌త్ ముఖ్య‌మంత్రిగా, బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా న‌రేంద్ర‌మోడీ అప్పుడు కాంగ్రెస్ నేత‌`త్వంలో అధికారంలో ఉన్న యూపీఏను ఏకిపారేశారు. పెట్రోల్ ధ‌ర‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని, తాము అధికారంలోకి రాగానే.. పెట్రోల్ ధ‌ర‌ల‌ను కంట్రోల్ చేస్తామ‌ని చెప్పారు. కానీ.. నాడు చెప్పిన మాట‌ల‌కు.. ఇప్పుడు చేస్తున్న దానికి ఏమైనా పొంత‌న ఉందా..? అంటూ జ‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌నం బాధ‌ల్ని గాలికొదిలి పెట్టుబ‌డి దారుల‌కు మోడీ ఊడిగం చేయ‌డంపై తీవ్ర‌స్థాయిలో ప్ర‌జావ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

bharat-bandh-1536467572

నిజానికి.. అప్పుడు చ‌మురు ధ‌ర‌ల‌కు.. ఇప్పుడు చ‌మురు ధ‌ర‌ల‌కు ఉన్న తేడాను ఒక‌సారి గ‌మ‌నిస్తే.. మోడీ ప్ర‌భుత్వం దేశ ప్ర‌జ‌ల‌ను ఎలా లూటీ చేస్తుందో.. ఎలా మోసం చేస్తోంది ఇట్టే అర్థ‌మై పోతుంది. మ‌న‌దేశం దాదాపుగా 80శాతం క్రూడాయిల్ దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డుతోంది. యూపీఏ-2 హయాంలో… బ్యారెల్ క్రూడాయిల్ ధర 140 డాలర్ల వరకూ వెళ్లింది. అప్పుడు అంటే.. ఐదేళ్ల క్రితం.. పెట్రోల్ ధర… రూ. 60కి కొంచెం అటూఇటుగా ఉండేది. ఆ తర్వాత క్రూడాయిల్ ధర పడిపోయింది. 25 డాలర్లకు కూడా వచ్చింది. ప్ర‌స్తుతం 70 డాలర్ల దగ్గర ఉంది. అయినా లీట‌ర్ పెట్రోల్ రేటు వంద‌కు చేర‌వ‌వుతోంది. రూ. 86కి చేరింది. డీజిల్ రూ. 80కి చేరింది. అంత‌ర్జాతీయ చ‌మురు ధ‌ర‌లు త‌గ్గినా.. మోడీ మాత్రం పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గించ‌డం లేదు. రూపాయి ప‌త‌నం ప‌తాక స్థాయికి చేరడ‌మే ఇందుకు కార‌ణ‌మంటూ త‌ప్పించుకుంటున్నారు.

Bharat_Bandh_131404_730x419-m

పెట్ర‌ల్ ధ‌ర‌ల కంట్రోల్‌కు ఏమాత్రం ఆయ‌న చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు లేదు. అంతేగాకుండా.. ప‌న్ను విధింపులోనూ దండుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. అదెలాగో చూడండి.. మోడీ 2014లో అధికారం చేపట్టిన లీటర్‌ పెట్రోల్‌పై ఎక్సైజు పన్ను రూ.9.48 వున్నదల్లా 2018కి రూ.21.48 కి పెంచారు. పెట్రో ప‌న్నుల‌ వల్ల 2014-15లో రూ. 1.05 లక్షల కోట్లు. అదే నాలుగేళ్ల తర్వాత 2018-19లో రూ.2.57 లక్షల కోట్లకు చేరింది. ఇదీ మోడీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన లూటీ బ‌హుమ‌తి. ఇందులోనూ త‌న‌దైన శైలిలో రాష్ర్టాల‌ను బోల్తా కొట్టించారు. మోసం ఏమిటంటే.. ఈ పెట్రో ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వ‌కుండా ట్యాక్స్‌ను లీటర్‌కు రూ. 8 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కాని అదే రోజున మౌలిక వసతుల సెస్‌గా ఆ8 రూపాయలు వసూలు చేస్తామని ప్రకటించారు. ఇక దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వాటా రాద‌న్న విష‌యం తెలిసిందే.

narendra-modi-pti28118

గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో మోడీ అధికారంలోకి రావ‌డానికి పెట్రోల్ త‌గ్గిస్తామ‌ని చేసిన హామీ కూడా బాగా ప‌నిచేసింద‌నే చెప్పాలి. ఇప్పుడు అవే పెట్రోల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డంలో ఆయ‌న పూర్తిగా విఫ‌లం చెందారు. దీనిని నిర‌స‌న‌గా విప‌క్షాలు సోమ‌వారం భార‌త్‌బంద్ పాటిస్తున్నాయి. ఇక్క‌డి నుంచే మోడీ ప‌త‌నం ఖాయ‌మ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. చేసిన హామీల్లో ఒక్క‌దానికి కూడా మోడీ నెర‌వేర్చ‌లేద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను సాగ‌నంపేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని విప‌క్షాల నేత‌లు చెబుతున్నారు.

భార‌త్ బంద్‌.. మోడీ పాల‌న‌కు పోగాలం వ‌చ్చిన‌ట్లే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share