ఇక టీడీపీలో వేగ‌లేం..సొంత గూటికి అఖిల‌!

April 26, 2018 at 4:44 pm

నివురు గప్పిన నిప్పులా ఉన్న‌ క‌ర్నూలు పంచాయితీ టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద‌కు చేరింది. మంత్రి భూమా అఖిల‌ప్రియ‌, టీడీపీ సీనియ‌ర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య ర‌గులుతున్న విభేదాలు చివ‌రికి చినికి చినికి గాలివాన‌లా మారిపోయా యి. ఆధిపత్య పోరులో పై చేయి సాధించేందుకు చేస్తున్న ప్ర‌యత్నాల‌న్నీ చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ విష‌యంలో వెన‌క్కే త‌గ్గేది లేదంటున్నారు అఖిల‌ప్రియ‌. ఈ విష‌యంపై మాట్లాడేందుకు స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పిలిచినా గైర్హాజ‌రవ‌డంపై ఆయ‌న అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన నాటి నుంచి ఆమె వ్య‌వ‌హార శైలిపై సీనియర్లు  గుర్రుగానే ఉన్న విష‌యం తెలిసిందే! మ‌రి పార్టీ అధినేత ఆదేశాలు కూడా బేఖాత‌రు చేసిన నేప‌థ్యంలో ఆమెపై ఎలాంటి చ‌ర్యలు తీసుకుంటార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో ఆమె వైసీపీ వైపు వెళ్ల‌వ‌చ్చనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

 

అఖిల‌ప్రియ‌, నాగిరెడ్డి అనుచ‌రుడు ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య నెల‌కొన్న విభేదాల‌కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు అధిష్టానం చ‌ర్య‌లు తీసుకుంటోంది. నాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల నాటి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య పోరు న‌డుస్తోంది. ఆ టికెట్.. అన్న బ్ర‌హ్మానంద‌రెడ్డికి వ‌చ్చేలా అఖిల తీవ్రంగా ప్ర‌య‌త్నించ‌గా..  ఇదే టికెట్ కోసం సుబ్బారెడ్డి కూడా గ‌ట్టిగానే శ్ర‌మించారు. టికెట్ ద‌క్క‌లేద‌న్న ఆగ్ర‌హంతో ఆయ‌న ఎన్నిక‌ల్లో స‌హాయ నిరాక‌ర‌ణ కూడా చేశారు. కానీ అఖిల‌ప్రియే అన్నను గెలిపించుకునే బాధ్య‌త‌ను త‌న భుజాల‌పై వేసుకుని విజ‌యం సాధించింది. అప్ప‌టి నుంచి అఖిల‌ప్రియ వ‌ర్సెస్ సుబ్బారెడ్డి పోరు న‌డుస్తూనే ఉంది. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా రెండు వ‌ర్గాల మ‌ధ్య ఆగ్ర‌హావేశాలు పెల్లుబుకుతూనే ఉన్నాయి.

 

ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇక్క‌డి క్యాడర్ కూడా ప‌లుమార్లు ఈ విష‌యంపై చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేసింది. ఇటీవ‌ల ఆళ్లగడ్డలో జరిగిన రాళ్ల దాడికి సంబందించిన పంచాయతీలో ఆమె మంకుపట్టు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి భూమా అఖిలప్రియను, ఆమె ప్రత్యర్దిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని రావాలని ఆదేశించారు. చంద్రబాబు పిలుపుతో సుబ్బారెడ్డి అమరావతి వచ్చినా అఖిలప్రియ మాత్రం రాలేదు. రావాలని తనను ఎవరూ చెప్పలేదని, అలాంటి సమాచారం లేదని బదులిచ్చారు. కానీ టీడీపీ వర్గాలు మాత్రం తాము సమాచార‌మిచ్చామ‌ని చెబుతున్నాయి. సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు అఖిల వర్గానికి చెందినవారు రాళ్ల దాడి చేశారు. ఇప్పుడు సీఎంతో సమావేశానికి అఖిలప్రియ డుమ్మా కొట్టడం అనేక సందేహాలకు తావిస్తోంది. 

 

నిజంగానే పిలుపు రాలేదా? లేక కావాలనే ఆమె హాజరుకాలేదా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి ఆఫర్ ఉన్నందు వల్లే అఖిలప్రియ ఇలా వ్యవహరిస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఆమె జగన్ తో టచ్ లో ఉన్నారని కొందరు టీడీపీ నేతలు కూడా అంటున్నారు. ఇప్పుడు సీఎంతో సమావేశానికి అఖిలప్రియ డుమ్మా కొట్టడం అనేక సందేహాలకు తావిస్తోంది. నిజంగానే పిలుపు రాలేదా? లేక కావాలనే ఆమె హాజరుకాలేదా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. మొత్తానికి ఆళ్ల‌గ‌డ్డ పంచాయితీపై త్వ‌ర‌లోనే ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోలేదంటున్నారు విశ్లేషకులు.. 

 

ఇక టీడీపీలో వేగ‌లేం..సొంత గూటికి అఖిల‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share