కాపు కులం మీదనే కమలం ఫోకస్!

September 15, 2018 at 8:13 pm

రాజకీయాలు కులాల ఆధారంగా నడవడం వింత విషయం కాదు. అలాగే సంఖ్యాపరంగా మెజారిటీగా ఉన్నా కూడా వెనుకబడిన, ఎస్సీ ఎస్టీ వర్గాలు అధికారం అనుభవించే స్థాయిలో కులప్రాతిపదిక మీద రాజకీయ పార్టీలు నిర్వహించిన చరిత్ర కూడా మన రాష్ట్రంలో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాము వేళ్లూనుకోవాలంటే ఏదో ఒక కులం ప్రాపకం సంపాదించాల్సిందేనని భారతీయ జనతా పార్టీ ఫిక్సయినట్లుగా కనిపిస్తోంది. ఏపీకి సంబంధించినంత వరకు అందుకోసం వాళ్లు కాపు కాలాన్ని ఎంచుకున్నారు.

అవును ఏపీలో రాజకీయాలకు సంబంధించినవరకు అధికార తెలుగుదేశం పార్టీ మీద కమ్మ ముద్ర, ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ మీద రెడ్డి ముద్ర ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు కులాలు కాకుండా మరో బలమైన అగ్రవర్ణం కాపు కులాన్ని భారతీయ జనతా పార్టీ నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని చంద్రబాబునాయుడు ఇప్పటికే వారిని వంచించారు. అదే సమయంలో తనకు కాపులు తమ వాడిగా చూస్తున్నప్పటికీ, ఆ కులానికి తనకి సంబంధమే లేదని… తాను విశ్వమానవుడిని అని పవన్ కల్యాణ్ చెప్పుకుంటూ ఉంటారు. రిజర్వేషన్ అసాధ్యం అని.. వారి అభివృద్ధి కోసం ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని సూటిగా, దాపరికం లేకుండా చెప్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే.

ఉన్న పార్టీలకు కాపుల్లో ప్రాబల్యం ఈ రకంగా ఉండగా.. భాజపా ప్రస్తుతం పూర్తిగా వారిమీద ఆధారపడినట్లుగా కనిపిస్తోంది. కంభంపాటి హరిబాబు చేతుల్లో ఉన్న రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను మరొకరికి అప్పగించే సమయంలో కేవలం కాపు కార్డు ఒక్కటే వారు పరిశీలించారు. తుదిజాబితాలోని పైడికొండ మాణిక్యాల రావు, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ మూడు పేర్లూ కాపులవే. ఇద్దరికి పదవులిచ్చారు. ఆతర్వాత నియమించిన కమిటీలోనూ కాపు ప్రాబల్యం కనిపిచింది. తాజాగా మహిళా మోర్చా.. అధ్యక్షురాలిగా కూడా తోట విజయలక్ష్మిని నియమించారు. మొత్తానికి ఏపీ భాజపాను- కాపు పార్టీగా మార్చేసి.. ఆ వర్గంలో గరిష్టంగా మైలేజీ సాధించాలని భాజపా చూస్తున్నట్లుంది.

కాపు కులం మీదనే కమలం ఫోకస్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share