ఆ 27 సీట్లే బీజేపీ కొంప ముంచాయ్‌..

May 17, 2018 at 10:23 am
BJP, Karnataka, election, result, draw back

క‌ర్ణాక‌ట ఎన్నిక‌ల ఫ‌లితాలు తీవ్ర ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. 104 సీట్ల‌తో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించినా మ్యాజిక్ ఫిగ‌ర్ 112కు కొద్దిపాటి దూరంలోనే ఆగిపోయింది. ఇక కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇత‌రులు ఇద్ద‌రు విజ‌యం సాధించారు. అయితే ఒక‌సారి ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే మాత్రం ఆస‌క్తిక‌ర‌మైన అంశం బ‌య‌ట‌ప‌డింది. సుమారు 27 స్థానాల్లోనూ బీజేపీ అభ్య‌ర్థులు కొద్దిపాటి తేడాతోనే ఓడిపోయారు. ఎన్నిక‌ల ప్ర‌చారంతోపాటు పోలింగ్ స‌మ‌యంలో మ‌రికొంత శ్ర‌ద్ధ‌వ‌హించి ఉంటే… ఆ స్థానాల్లో సునాయాసంగా గెలిచేవాళ్ల‌మ‌ని ప‌లువురు నేత‌లు అంటున్నారు.

 

ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్‌, బీజేపీ అభ్య‌ర్థుల‌కు ప‌డిన ఓట్ల‌ను ఒక‌సారి గ‌మ‌నిస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. మస్కీ అసెంబ్లీ స్థానాన్ని కేవలం 213 ఓట్లతో, హిరికెరూర్‌ స్థానంలో 555 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలిచారు. ఇక కుండ్గోల్‌లో 634 ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయింది. ఇక్కడ నోటాకు 1032 ఓట్లు వచ్చాయి. స్వతంత్రులు సుమారు 3వేల ఓట్లు సాధించారు. సీఎం సిద్దరామయ్య బాదామిలో 1696 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి బి.శ్రీరాములు ఆయనకు గ‌ట్టిపోటీనిచ్చారు. 

 

యల్లాపూర్‌లో 1483, గదగ్‌లో 1868, శృంగేరిలో 1989, అథానిలో 2331, విజయనగర్‌లో 2775, జమ్‌ఖందిలో 2795, యంకన్‌మర్దిలో 2850, బళ్లారి రూరల్‌లో 3129, హనూర్‌లో 3513 ఓట్ల తేడాతో బీజేపీ అభ్య‌ర్థులు ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం.

 

ఇక దావణగెరె నార్త్‌లో 4071, చిత్తాపూర్‌లో 4393, బిళగిరిలో 4811, చామరాజనగర్‌లో 4913, సకలేశపురలో 4942, ఖానాపూర్‌లో 5133, హళియాళలో 5140, కంప్లిలో 5555, కుణిగల్‌లో 5600, తుమకూరు గ్రామీణలో 5640, బ్యాటరాయనపురలో 5671, చింతామణిలో 5673, భట్కళ్‌లో 5390, గుల్బర్గాలో 5940 ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయింది. 

 

ఇలా పెద్ద‌సంఖ్య‌లో కొద్దిపాటి తేడాతో బీజేపీ అసెంబ్లీ స్థానాల‌ను కోల్పోయింది.  ఈ స్థానాల్లో పోలింగ్ రోజు మ‌రికొంత అప్ర‌మ‌త్తంగా ఉంటే.. ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని ఆ పార్టీ నాయ‌కులు త‌ల‌లుప‌ట్టుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఆయా స్థానాల్లో నోటాకు, స్వతంత్రులకు ఎక్కువ ఓట్లు పోల్ కావ‌డం కూడా బీజేపీ ఓట‌మికి కార‌ణంగా క‌నిపిస్తోంది. 

 

ఆ 27 సీట్లే బీజేపీ కొంప ముంచాయ్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share