బాబుగారి తీరుతో బోరుమంటున్న త‌మ్ముళ్లు..!

March 14, 2019 at 4:58 pm

బాబుగారి తీరుతో త‌మ్ముళ్లు బోరుమంటున్నారు. ఆయ‌న వ్య‌వ‌హారంపై ఎక్క‌డిక‌క్క‌డ అస‌మ్మ‌తి సెగ‌లు క‌క్కుతున్నారు. ఇక‌ బాబుగారు ఇస్తున్న ట్విస్ట్‌ల‌తో మ‌రికొంద‌రు నేతలైతే లోలోప‌ల ఎక్కిఎక్కి ఏడుస్తున్నార‌నే టాక్ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఆయ‌న‌తే వేగ‌లేక‌.. తెలుగుదేశం పార్టీలో ఇమ‌డ‌లేక‌.. ఎవ‌రిదారి వారు చూసుకుంటున్నారు. ఇందులో ఎక్కువ‌మంది వైసీపీ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ఆఖ‌రికి ఎప్పుడు ఎవ‌రు ఎలాంటి షాక్ ఇస్తారో తెలియ‌క చంద్ర‌బాబు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. మొత్తంగా టీడీపీ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఆగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంద‌ని త‌మ్ముళ్లులో తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యూహాల‌ను అందుకోలేక చంద్ర‌బాబు ఆగ‌మాగం అవుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా మ‌ళ్లీ గెలిచేందుకు.. వైసీపీని దీటుగా ఎదుర్కొనేందుకు చంద్ర‌బాబు వేస్తున్న ఎత్తుల‌న్నీ కూడా బెడిసికొడుతున్నాయి. ఈసారి మంత్రుల‌ను ఎంపీలుగా పంపిచాల‌న్న బాబుగారి వ్యూహం ఏమాత్ర‌మూ ప‌నిచేయ‌డం లేదు. తాము లోక్‌స‌భ‌కు పోటీ చేయ‌మంటే చేయ‌బోమ‌ని ప‌లువురు మంత్రులు తెగేసి చెబుతున్నారు. ఇక మ‌రికొంద‌రైతే.. అల‌క‌బూని అజ్ఞాతంలోకి కూడా వెళ్తున్నారు. ఇప్ప‌టికీ ఇంకా మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు దారెటో ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. తాను టీడీపీలోనే కొన‌సాగుతాన‌ని చెబుతున్నా.. లోలోప‌ల ఏదో తతంగం జ‌రుగుతుంద‌నే టాక్ వినిపిస్తోంది.

మ‌రో మంత్రి శిద్ధ రాఘవరావు ప‌రిస్థితి కూడా ఇలాగే త‌యారైంది. లోక్ సభకు పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ.. ఆయ‌న అనుచ‌రులు ఇందుకు ఏమాత్ర‌మూ ఒప్పుకోవ‌డం లేదు. మంత్రి శిద్ధా రాఘవరావు అయితే ఏకంగా చంద్ర‌బాబుకే ఓ కండిష‌న్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. “నన్ను లోక్ సభకు పంపితే…. నా భార్యకు కానీ, కుమారుడికి కానీ దర్శి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి” అని డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ఈసారి టికెట్ ఇవ్వ‌నే ఇవ్వొద్ద‌ని తెలుగు త‌మ్ముళ్లు రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. ఇలా ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ టీడీపీ తీవ్ర ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుక్కొంటోంది. ఈ ప‌రిణామాల‌న్నీ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మికి సంకేతాల‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

బాబుగారి తీరుతో బోరుమంటున్న త‌మ్ముళ్లు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share