బాబు రేటింగ్ పెరుగుతున్న‌ట్టా… త‌గ్గుతున్న‌ట్టా…?

March 19, 2018 at 5:55 pm
chandra babu, AP, CM, Political Graph, Rating

ఆత్మ‌గౌరవ నినాదంతో స్థాపించిన తెలుగు దేశం పార్టీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు పాపులారిటీ, రేటింగ్‌లు పెరుగుతున్నాయా? త‌గ్గుతున్నాయా ? ప‌్ర‌స్తుత ప‌రిస్థితిలో ఆయ‌న హ‌వా ఏమేర‌కు ఉంది? వ‌ంటి కీల‌క అంశాల‌పై చ‌ర్చ న‌డుస్తోంది. ఈ విష‌యంలో విశ్లేష‌కులు రెండు ర‌కాలుగా అభిప్రా య ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. పాల‌న ప‌రంగా చంద్ర‌బాబు ప‌రిస్థితి బాగానే ఉంద‌ని అనుకున్నా.. ఆయ‌న చేస్తున్న‌ వ్యాఖ్య‌ల ప‌రంగా,  తీసుకుంటు న్న నిర్ణ‌యాల ప‌రంగా మాత్రం ఆయ‌న రేటింగ్ ప‌డిపోతోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 

 

ప్ర‌స్తుతం ఏపీ విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై పెద్ద ఎత్తున పోరు సాగుతోంది. ఏపీలో అధికార, విప‌క్షాలు ఈ విష‌యాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డం, ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన సెంటిమెంట్ గా మారిపోయిన నేప‌థ్యంలో ఈ విష‌యంలో పోరాటం చేయ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యాలు ఆయ‌న రేటింగ్‌ను ప‌డిపోయేలా చేశాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

 

వాస్త‌వానికి ఆది నుంచి కూడా చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా అక్క‌ర్లేద‌ని అన్నారు. అదేస‌మ‌యంలో ప్యాకేజీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇక‌, వైసీపీ విష‌యా నికి వ‌స్తే.. మొద‌టి నుంచి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రాన్ని పార్టీ అధినేత జ‌గ‌నే స్వ‌యంగా ప్ర‌జల్లోకి బ‌లంగా తీసుకు వెళ్తున్నారు. ఇక‌, ప్యాకేజీ వ‌ల్ల రాష్ట్రా నికి ఒరిగేది కూడా ఏమీ ఉండ‌ద‌ని ఆయ‌న ప‌దే ప‌దే వెల్ల‌డించారు. అదేస‌మ‌యంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న పాల‌న‌లో అంతా డొల్లే ఉంద‌ని జ‌గ‌న్ మొద‌టి నుంచి చెప్పుకొస్తూనే ఉన్నారు. 

 

అయితే, మొద‌ట్లో జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను, జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా త‌ప్పుప‌ట్టిన చంద్ర‌బాబు, హోదా వ‌ల్ల ఒరిగేది ఏంట‌ని ప్ర‌శ్నించారు. హోదా కోసం పోరాటం చేసేవారు ఢిల్లీ వెళ్లి చేసుకోవాల‌ని, ఇది వృధా ప్ర‌యాసేన‌ని చెప్పుకొచ్చారు. కేంద్రం ఇవ్వ‌న‌ని చెబుతున్న దానిని ప‌ట్టుకుని ఊగిస‌లాడితే.. ఇస్తాన‌ని చెప్పిన ప్యాకేజీ కూడా పోతుంద‌ని చంద్ర‌బాబు సూక్తులు చెప్పారు. అయితే, ఇప్పుడు చంద్ర‌బాబూ పూర్తిగా యూట‌ర్న్ తీసుకున్నారు. ఏ ప్యాకేజీ ముద్దు, హోదా వ‌ద్దు అన్నారో అదే నోటితో హోదా కోసం ఉద్య‌మిస్తామ‌ని ప్ర‌క‌టించారు. 

 

అంతేకాదు, హోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం పెడ‌తామ‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్ పార్టీపై నిప్పులు చెరిగిన చంద్ర‌బాబు అవిశ్వాసంతో సాధించేది ఏంట‌న్నారు. ఆఖ‌రుకు ప‌రిస్థితి చేజారి పోయేలా ఉంద‌ని గ్ర‌హించి మ‌ళ్లీ జ‌గ‌న్ బాట‌లోనే అడుగులు వేశారు. ముందు జ‌గ‌న్ పార్టీ ఎంపీల‌కు మ‌ద్ద‌తిస్తామ‌ని చెప్పారు. ఆ త‌ర్వాత సొంతంగా అవిశ్వాసం ప్ర‌వేశ పెట్టారు. ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలోనూ చంద్ర‌బాబు వైఖ‌రి దుర‌దృష్ట‌క‌రంగా ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. త‌న‌కు అనుకూలంగా ఉన్నంత వ‌ర‌కు ప‌వ‌న్‌ను మంచివాడ‌ని, త‌న‌ను విమ‌ర్శించే స‌రికి ప‌వ‌న్ లాలూచీ ప‌డ్డాడ‌ర‌ని అన్నారు.

 

అమ్ముడు పోయాడ‌ని త‌న పార్టీ నేత‌ల‌తో వ్యాఖ్యానాలు చేయించ‌డంపైనా  విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు చంద్ర‌బాబు తీసుకుంటున్న నిర్ణ‌యాలు, చేస్తున్న వ్యాఖ్య‌లు ఆయ‌న స్థాయికి త‌గిన విధంగా లేవ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌త్యేక హోదా వ‌ద్ద‌న్న‌ది తానేన‌ని అందుకే ప్యాకేజీకి ఇచ్చామ‌ని ఒక‌ప‌క్క కేంద్రం చెబుతున్న విష‌యాన్ని చంద్ర‌బాబు ఎలా తోసిపుచ్చుతార‌ని కూడా వీరు ప్ర‌శ్నిస్తున్నారు. 

 

ఏదేమైనా.. ఎన్నిక‌ల రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి అసలు సిస‌లు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం చంద్ర‌బాబు అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. తాజాగా ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవ‌డం ఖాయ‌మ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే, పార్టీ ప‌రంగా, సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌ప‌రంగా పేరు పోగొట్టుకోవ‌డం, గంట‌కో విధంగా వ్యాఖ్య‌లు చేయ‌డం మంచిది కాద‌నేది విశ్లేష‌కుల వ్యాఖ్య. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి. 

 

బాబు రేటింగ్ పెరుగుతున్న‌ట్టా… త‌గ్గుతున్న‌ట్టా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share