బాబు నో..కేసీఆర్ ఎస్..జమిలీ ట్విస్ట్!

July 9, 2018 at 7:13 pm
Chandra babu, AP, KCR, Telangana, Jamili elections

తెలుగు రాష్ట్రాలకు ఎన్నికల వేడి తాకింది. రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు సార్వత్రిక ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ లోపే కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికల పేరిట ఓ ప్రతిపాదనను రాష్ట్రాల ముందు ఉంచడంతో దానిని వ్యతిరేకించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది నిర్వహించాలన్న ప్రతిపాదన వస్తే దానిని వ్యతిరేకించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. దానికోసం అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాల పదవీకాలం పొడిగించడం లేదా కుదించడం చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు లోక్‌సభకు, అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనను చాలా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది రాజ్యాంగవిరుద్ధమని, ఆచరణ సాధ్యం కాదని అంటున్నాయి. జమిలీ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలతో లా కమిషన్‌ శనివారం నాడు సంప్రదింపులు మొదలుపెట్టింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రక్రియలో తొలిరోజున- ప్రధాన పక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ హాజరుకాలేదు.

కేసీఆర్ మాత్రం ముందస్తుకు ఓకే చెప్పేశారు. ఆ పార్టీ ప్రతినిధిగా ఎంపీ వినోద్ కుమార్ లా కమిషన్‌కు తమ అభిప్రాయాన్ని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్లపాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపాలన సాగించాలంటే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటూ కేసీఆర్ రాసిన లేఖను ఎంపీ వినోద్ న్యాయశాఖ కమిషన్‌కు అందించారు. టీఆర్ఎస్.. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న వాదనకు ఇది బలాన్ని చేకూర్చుతోందని పలువురు విశ్లేషిస్తున్నారు.

బాబు నో..కేసీఆర్ ఎస్..జమిలీ ట్విస్ట్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share