చంద్ర‌బాబుకు కౌంట్ డౌన్ స్టార్ట్‌…. రామ్ మాధ‌వ్ చెప్పేశాడు

May 15, 2018 at 1:11 pm
Chandra babu, modi, karnataka, elections, BJP is better position, Ram madav

అవును ఇప్పుడు నెటిజ‌న్లు ఇదే మాట అంటున్నారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు గుండెల్లో రైళ్లు ప‌రిగెడు తున్నాయ‌ని చెబుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధానంగా న‌రేంద్ర మోడీని బాబు త‌క్కువ అంచ‌నా వేయ‌డం ఆయ‌న‌కు భారీ మైన‌స్‌గా మారిపోయింద‌ని చెబుతున్నారు.  ఏపీకి సాయం చేస్తున్నా.. చేయ‌డం లేద‌ని, ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌న్న నోటితోనే ప్ర‌త్యేక హోదా కోసం మోడీని, బీజేపీని తిట్టిపోయ‌డం వంటి కీల‌క ప‌రిణామాల‌ను బీజేపీ అధిష్టానం తీవ్రంగా ప‌రిణ‌గిస్తోంది. 

 

ఇక‌, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటేయాల‌ని చంద్ర‌బాబు భారీ ఎత్తున పిలుపునిచ్చారు. అంతేకాదు, కొంత‌మంది త‌న అనుయాయుల‌ను అన‌ధికారికంగా పంపి మ‌రీ ప్ర‌చారం చేయించారు. ఈ ప‌రిణామం.. బీజేపీ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు త‌మ అభీష్టం మేర‌కే ఓటు వేయ‌డం ప‌రిశీలించాల్సిన విషయం. ప్ర‌ధానంగా తెలుగు వారు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో అందునా.. ఏపీ వారు ఎక్కువ‌గా ఉన్న బెంగ‌ళూరు, బ‌ళ్లారి ప్రాంతాల్లో ప్ర‌ధానికి వ్య‌తిరేకంగా, బీజేపీకి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు ప్ర‌చారం చేయించారు. 

 

అయిన‌ప్ప‌టికీ,.. క‌ర్ణాట‌క‌లో బీజేపీ హ‌వా ఎక్క‌డా ఆగ‌లేదు. బీజేపీకి గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే.. దాదాపు 50 స్థానాలు అత్య‌ధికంగా అది కూడా ప్ర‌ధాని మోడీ ష‌రిష్మాతోనే సాధ్య‌మ‌వుతోంది. ఈ ప‌రిణామాన్ని నిశితంగా గ‌మ‌నిస్తున్న ఏపీ టీడీపీ శ్రేణులు.. ఇప్పుడు ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కావ‌డం లేదు. నిజానికి క‌ర్ణాట‌క‌లో తిరిగి కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఏపీలో ధీమాగా బీజేపీని వ్య‌తిరేకిస్తూ కామెంట్లు చేశారు. కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయ‌డం లేద‌ని, అంతా మ‌న‌మే చేసు కుంటున్నామ‌ని అన్నారు. కేంద్రం ఇస్తున్న ప్ర‌తి పైసానూ వినియోగించుకుంటున్నా.. లేద‌ని చెబుతున్నారంటూ బీజేపీ నాయ‌కులు ఎదురు దాడి చేసినా టీడీపీ నాయ‌కులు మాత్రం ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. 

 

ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల సంవ‌త్స‌రం ప్రారంభ‌మ‌య్యే స‌రికి చంద్ర‌బాబు వ్యూహం మార్చుకున్నారు. ఈ ప‌రిణామాల‌పై బీజేపీ నాయ‌కులు భారీ ఎత్తున అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వీటిపై నిశితంగా ప‌రిశీలించిన బీజేపీ క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత ఆప‌రేష‌న్ ఏపీని స్టార్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. దీంతో చంద్ర‌బాబు గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయ‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కాపు వ‌ర్గానికి చెందిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా నియ‌మించడం గ‌మ‌నార్హం. ఇక క‌ర్ణాట‌క ఎన్నికల ఫ‌లితాల అనంత‌రం రామ్ మాధ‌వ్ కూడా మాట్లాడుతూ క‌న్న‌డ‌లో బీజేపీని ఓడించేందుకు ఇక్క‌డ తెలుగు ఓట‌ర్ల‌ను బీజేపీకి వ్య‌తిరేకంగా ఓట్లు వేసేలా చంద్ర‌బాబు ప్రేరేపించార‌ని… దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నామ‌ని చెప్పారు. ఏదేమైనా క‌న్న‌డలో ఘ‌న‌విజ‌యంతో బీజేపీ జాతీయ నాయక‌త్వం ఏపీలో బాబును టార్గెట్ చేసేందుకు పెద్ద ఆప‌రేష‌న్ స్టార్ట్ చేసిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. 

 

చంద్ర‌బాబుకు కౌంట్ డౌన్ స్టార్ట్‌…. రామ్ మాధ‌వ్ చెప్పేశాడు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share