వారెంట్ కూడా వరంగా మారిన వేళ!

September 15, 2018 at 8:30 pm

చంద్రబాబునాయుడు కు ధర్మాబాద్ కోర్టునుంచి నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు వచ్చాయి. అయితే ఇందుకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించాలి?కేంద్రంలో ఉండే భాజపాకు లేదా మోడీకి, మహారాష్ట్రలో ఉన్న ధర్మాబాద్ కోర్టుకు ఏంటి సంబంధం? కోర్టుల్లో వచ్చే తీర్పులను కూడా రాజకీయ ప్రభుత్వాలే ప్రభావితం చేసేస్తున్నాయని ఆరోపించేట్లయితే.. ఇక ఏ వ్యవస్థనూ నమ్మడానికి వీల్లేదంతే ధర్మాబాద్ కోర్టుతో వారికి సంబంధం లేకపోయినా సరే.. ఎటూ వారంట్లు వచ్చేశాయి గనుక.. వారి మీద బురద చల్లితే ఎంతో కొంత తాము లాభపడుతాం అనేది చంద్రబాబునాయుడు మరియు తెలుగుదేశం కోటరీ ప్లాన్. ఆ ప్లాన్ ను వారు సక్సెస్ ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ ప్రజల వద్ద ఎలాంటి గుర్తింపు, మంచి పేరు లేకుండా కేవలం పురాతన కాలంలో ఉన్న, ప్రస్తుతానికి బాగా సన్నగిల్లిపోయిన కేడర్ బలాన్ని నమ్ముకుని ఎన్నికలకు వెళుతున్న తెలుగుదేశం పార్టీకి.. ఇలా వారంట్లు రావడం అనేది అద్భుతమైన వరంగా వారు భావిస్తున్నారు.

IN14BABLI

నిజానికి ఎనిమిదేళ్ల నాటి కేసులో ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు వారంట్లు వచ్చాయి? అనే ప్రశ్న ఎవరికైనా ఎదురవుతుంది. బాబ్లీ ప్రాజెక్టు వద్దకు అనుమతి లేకుండ వెళ్లడానికి ప్రయత్నించారు అనేది వారి మీద ఉన్న కేసు. అదేమీ అత్యంత ఘోరమైన కేసు కాదు.. నాన్ బెయిలబుల్ వారంట్లు ఇవ్వడానికి. తొలిసారి కేసు నమోదు అయినప్పుడు తొలిసారి కోర్టు వాయిదా ఉన్నప్పుడు వీరందరూ కోర్టుకు హాజరై ఉంటే.. అప్పుడే కేసు కొట్టేసి ఉండేవారని కూడా.. పలువురు విశ్లేషిస్తున్నారు. న్యాయవ్యవస్థ మీద మినిమం గౌరవం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబునాయుడు.. అప్పట్లో మామూలు కేసు విచారణ జరిగినప్పుడు వెళ్లలేదని.. వాయిదాలకు వరుసగా రాకపోవడంతో ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ అయ్యాయని అనుకుంటున్నారు.

ఈనెల 21వ తేదీ కూడా కోర్టుకు హాజరు కాకుండా.. తెలంగాణ ఎన్నికలు అయ్యే దాకా ఈ నోటీసుల వ్యవహారాన్ని తెలుగుదేశం నాయకులు కోతిపుండు బ్రహ్మరాక్షసి సామెత చందంగా మారుస్తారని పలువురు భావిస్తున్నారు.

వారెంట్ కూడా వరంగా మారిన వేళ!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share