చంద్రబాబు కరుణ.. కంటితుడుపే!

September 11, 2018 at 9:01 am
Chandra babu, petrol rates, negotiated, Andhra Pradesh

దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ప్రజలను బెంబేలెత్తించే విధంగా పెరుగుతున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకింత కరుణించారు. సెంచరీకి చేరువగా పరుగులు పెడుతున్న ధరలకు పగ్గం వేయడానికి ఆయన ఒక చిన్న ప్రయత్నం చేశారు. ఏపీలో ఒక్కో లీటరు మీద రెండేసి రూపాయల వంతున ధరను తగ్గించారు. అంతే అక్కడితో… తాను ప్రజల మీద భారం పడకుండా విపరీతంగా కరుణించేసినట్లుగా అప్పటినుంచి ఆయన తెగబిల్డప్ లు ఇచ్చేసుకుంటున్నారు. మోడీ మీద నిశిత విమర్శలను కురిపిస్తున్నారు. మోడీ కూడా తగ్గించి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. పనిలో పనిగా… మోడీ పెట్రోలియం ధరలు పెంచుతోంటే.. వైకాపాకు కనిపించలేదా… అంటూ.. తాను అంతిమంగా లక్ష్యించే రాజకీయ ప్రయోజనాలను కూడా ఆయన టార్గెట్ చేస్తున్నారు.

717279-naidu-ap-ians

ఇంతకూ చంద్రబాబునాయుడు పెట్రో ధరల విషయంలో చూపించిన కరుణ నిజంగా అంత గొప్ప విషయమా అనే అనుమానం ఇప్పుడు ప్రజలకు కలుగుతోంది. కాస్త జాగ్రత్తగా గమనిస్తే.. ఈ కరుణ కంటితుడుపు మాయ మాత్రమే అని అర్థమవుతుంది. పోల్చిచూసినప్పుడు.. ఇన్నాళ్లుగా ఇరుగు పొరుగు రాష్ట్రాలు అందరికంటె అత్యధికంగా వ్యాట్ భారం మోపి.. అదనపు లాభాలను దండుకుంటున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వం… ఇప్పుడు ఆ ‘అదనపు భారం’లో కొంత తగ్గించి తామేదో మహోపకారం చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటోంది.

petrol-bizz-May-21

ఇన్నాళ్లూ తెలంగాణ –ఏపీ సరిహద్దుల్లో ఉండే గ్రామాల వారంతా తెలంగాణ లిమిట్స్ లోకి వెళ్లి అక్కడ పెట్రోలు కొట్టించుకుని తిరిగి వచ్చే పరిస్థితి ఎందుకు ఉందో బాబుకు తెలియదా? ఇప్పుడు ఏపీలో లీటరుకు 2రూపాయలు తగ్గించిన తర్వాత.. తెలంగాణతో పోలిస్తే లీటరుకు 53 పైసలు మాత్రమే తక్కువ. అంటే ఇన్నాళ్లూ తెలంగాణలో ధరకంటె 1.47 పైసలు అదనంగా దోచుకుంటూ ఉన్నారన్నమాట. తమాషా ఏంటంటే.. రూ.2 తగ్గించిన తర్వాత.. ఏపీ ధర పక్కనే ఉన్న ఒరిస్సా, తమిళనాడు, కర్నాటక, యానాం(పాండిచ్చేరి) లలో ఇప్పటికి కూడా పెట్రోలు ధరలు ఏపీలో కంటె తక్కువగానే ఉన్నాయి. దీనిని బట్టి… ఇన్నాళ్లుగా చంద్రబాబునాయుడు ఎంత అరాచకంగా దోచుకుంటూ వచ్చారో అర్థమవుతోంది కదా!

చంద్రబాబు కరుణ.. కంటితుడుపే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share