ముంద‌స్తుకు భ‌య‌ప‌డుతున్న బాబు.. రీజ‌న్ అదేనా?

July 6, 2018 at 4:08 pm
Chandra babu, Pre Elections, AP, politics

దేశంలో అప్పుడే ఎన్నిక‌ల ఫీవ‌ర్ ప్రారంభ‌మైంది. కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు భారీ ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఒక్క లోక్‌స‌భ‌కే కాకుండా.. దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల‌కు కూడా ఎన్నిక‌లు ఒకే సారి నిర్వ‌హించాల‌ని కూడా మోడీ యోచిస్తున్న‌ట్టు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ వేడి ఏపీకి కూడా పాకింది. అయితే, ఈ విష‌యంలో చంద్ర‌బాబు పిల్లిమొగ్గ‌లు వేస్తున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌లు నిర్వ‌హించినా తాము ఓకే అని అన్న ఆయ‌న వెంట‌నే గొంతు స‌వ‌రించుకున్నారు.

నిజానికి ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా రెడీగా ఉండాలంటూ త‌న త‌మ్ముళ్ల‌ను ఆదేశించారు చంద్ర‌బాబు. దీంతో త‌మ్ముళ్లు కూడా ఎక్క‌డిక‌క్క‌డ నిధులు స‌మకూర్చుకుని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, ఇంత‌లోనే విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఓ స‌ర్వేను బ‌య‌ట పెట్టారు. ఏపీలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. అంటూ సాగిన ఈ స‌ర్వేలో.. చంద్ర‌బాబు టీంలోని చాలా మందికి వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌ని పేర్కొన్నా రు. అంతేకాదు, గెలుపు గుర్రాలుగా భావిస్తున్న వారేమ‌ట్టిక‌ర‌వ‌డం ఖాయ‌మంటూ.. పేర్కొన్నారు. దీంతో ఉలిక్కిప‌డ్డ చంద్ర‌బాబు.. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

తాజాగా ఆయ‌న వెల్ల‌డించిన స‌మాచారాన్ని బ‌ట్టి.. చంద్ర‌బాబు ముంద‌స్తుకు వెళ్లే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీనికి ప్ర‌ధానంగా ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఒక రీజ‌న్ అయితే, గ‌తంలో టీడీపీని వెంటాడిన సెంటిమెంట్ మ‌రో ప్ర‌ధాన రీజ‌న్‌గా క‌నిపిస్తోంది. అంతేకాకుండా ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లకు వెళ్తే.. రాష్ట్రంలో ఒక కొలిక్కిరాని అభివృద్ధిప‌నులు కూడా చంద్ర‌బాబు తిరిగి ఎన్నిక‌ను శాసించే అవ‌కాశం ఉంది. గ‌తంలో అంటే 2004లో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు.. అలిపిరిలో న‌క్స‌ల్స్ ఆయ‌న‌పై దాడి చేశారు. బాంబు పేల్చారు. అయితే, తృటిలో త‌ప్పించుకున్న ఆయ‌న ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డా రు. ఈ నేప‌థ్యంలో ఆ సెంటిమెంట్‌ను వాడుకుని తిరిగి వెంట‌నే సీఎం అవ్వాల‌ని అంటే ముచ్చ‌ట‌గా మూడోసారి.. చంద్ర‌బాబు భావించారు.

ఈ నేప‌థ్యంలోనే ముంద‌స్తుకువెళ్లారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఘోరంగా ఓడిపోయారు. అదేవిధంగా పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ హ‌యాంలోనూ ఇలానే జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో ఈ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే.. ఉన్న అధికారం పోయే ప్ర‌మాదం ఉంద‌ని బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ముంద‌స్తుకు భ‌య‌ప‌డుతున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. మ‌రి ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ కేంద్రం తీసుకోబోయే నిర్ణ‌యాన్ని ఎలా నిలుపుద‌ల చేస్తుందో చూడాలి.

ముంద‌స్తుకు భ‌య‌ప‌డుతున్న బాబు.. రీజ‌న్ అదేనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share