ముసుగు తొలిగింది.. బాబు పయనం ఆ పెద్ద పార్టీ వెంటే!

July 22, 2018 at 9:48 am
Chandra babu, TDP, Aligns, congress party, Rahul gandhi

పీ రాజ‌కీయాల‌ను అడ్డం పెట్టుకుని.. పార్ల‌మెంటు వేదిక‌గా సాగిన అతి పెద్ద పొలిటిక‌ల్ హైడ్రామా.. రంగు, రుచి, వాస‌న నేరుగా దేశాన్ని తాకాయి. ఏపీలో సోదిలో కూడా లేకుండా పోయిన కాంగ్రెస్‌తో అంట‌కాగేందుకు, కాంగ్రెస్ ను మించిన పార్టీ లేద‌ని చెప్పేందుకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన ప్ర‌తి ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయింది. కేంద్రంలో కాంగ్రెస్‌కు ఉన్న బ‌లం నిరూపించ‌డంలోనూ.. ఏపీ విష‌యంలో కాంగ్రెస్ త‌ప్ప ఇక‌, ఏపీ ప్ర‌జ‌ల‌కు దిక్కులేద‌ని స్ప‌ష్టం చేయ‌డంలోనూ చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు. వాస్త‌వానికి తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ పునాదుల‌పై ఏర్పాటైన టీడీపీ.,. అప్ప‌టి కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో పోరు చేసింది. అన్న‌గారు ఎన్టీఆర్‌.. ఇందిర‌మ్మ పాల‌న‌పై నిప్పులు చెరిగారు. ఏపీలో మ‌రో కొత్త ప్ర‌భంజ‌నం సృష్టించి తెలుగువారికి కొత్త పాల‌కుల‌ను అందించారు.

llkjjazhmw-1523030350

ఇప్పుడు ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. అనుస‌రిస్తున్న వ్యూహాత్మ‌క రాజ‌కీయాలు కూడా ఇదే వ‌రుస‌లో కొన‌సాగుతు న్నాయి. ఏపీకి అన్యాయం చేసింద‌ని బీజేపీపై విరుచుకుప‌డుతున్న చంద్ర‌బాబు.. ఆ పార్టీని దోషిగా నిల‌బెట్టేందుకు కేంద్ర స్థాయిలో చేసిన ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయింది. నిజానికి పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టింది టీడీపీ. కానీ, దీనిపై జ‌రిగిన చ‌ర్చ‌లో పాల్గొన్న కాంగ్రె్స్ సార‌థి కానీ, ఇత‌ర పార్టీల నేత‌లు కానీ, ఏపీ విష‌యాన్ని, ఏపీకి జ‌రుగుతున్న అన్యాయాన్ని కూడా ప్ర‌స్తావించ‌లేదు. అదేస‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ సెంట్రిక్‌గా దుమ్ము దులిపారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇది వ్యూహాత్మ‌క రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో భాగంగానే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

668960-rahul-3

ఏపీలో బీజేపీని మేం బ‌ద్నాం చేస్తాం.. జాతీయ‌స్తాయిలో మీరు చూసుకోండి- అన్న‌ట్టుగానే సాగింది. ఇక‌, ఎన్నిక‌ల రాజ‌కీయాల‌కు వ‌చ్చే స‌రికి.. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నప్ప‌టికీ త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని, కేవ‌లం ఏపీ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌నే కొత్త ప‌ల్ల‌వ‌ని ఇప్పుడు చంద్ర‌బాబు వినిపించ‌నున్నారు. అంటే,, ఆయ‌న ఇప్ప‌టికే కాంగ్రెస్తో చేతులు క‌లిపేందుకు రెడీ అయ్యారు. ఈ ఏడాది మేలో జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఇదే బాణిని ఆయ‌న వినిపించారు. ఇక‌, ఇప్పుడు నేరుగా బీజేపీపై అవిశ్వాసం పెట్ట‌డం ద్వారా జాతీయ స్థాయిలో రాహుల్ పెద్ద నాయ‌కుడిగా ఎదిగేందుకు అవ‌కాశం క‌ల్పించ‌డంతోపాటు.. న‌రేంద్ర‌మోడీ ఏపీకి ఏమీ చేయ‌లేదు.. ఇక‌, చేస్తే.. గీస్తే. కాంగ్రెస్ మాత్ర‌మే మిగిలింద‌నే వ్యూహాత్మ‌క అడుగులు వేయ‌డంలో చంద్ర‌బాబు విజ‌యం సాధించారు. ఏతావాతా ఇదే విష‌యాన్ని.. టీడీపీ నేత‌లు కూడా స్ప‌ష్టం చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌తో టీడీపీ చెలిమి విష‌యంలో ముసుగు తొల‌గిపోయింద‌న‌డంలో సందేహం లేదు. మ‌రి రాబోయే రోజుల్లో ఏపీ తెర‌పై స‌రికొత్త మిత్రులు సంద‌డి చేయ‌నున్నార‌న్న‌మాట‌!!

ముసుగు తొలిగింది.. బాబు పయనం ఆ పెద్ద పార్టీ వెంటే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share