బాబు ఎఫెక్ట్…ఇంజినీరింగ్ చదువు ఇక కలే వారికి

July 9, 2018 at 10:11 am
Chandra babu, TDP, Engineering Students, Fees, colleges

నాడు సాహసోపేత నిర్ణ‌యంతో వైఎస్సార్ సాంకేతిక విద్య‌ను పేద విద్యార్థుల‌కు అందుబాటులోకి తెస్తే.. నేడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దానిని కాల‌రాసే నిర్ణ‌యం తీసుకున్నారు. ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని పాత‌రేసేసి, పేదల‌ను ఇంజినీరింగ్ విద్య‌ను దూరం చేస్తున్నారు చంద్ర‌బాబు. దీంతో నేడు ఎంతో మంది విద్యార్థుల‌కు ఇంజినీరింగ్ క‌ల‌గానే మిగిలిపోతోంది. మెడిసిన్, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఉన్నత చదువు పూర్తిచేయాలన్నా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పేద విద్యార్థుల‌కు అండ‌గా నిలిచింది.

ఉమ్మ‌డి రాష్ట్రంలో త‌ల్లిదండ్రుల‌కు ఆర్థిక భారాన్ని దూరం చేసి, వారి పిల్ల‌ల‌కు సాంకేతిక విద్య‌ను ద‌గ్గ‌ర చేసింది. ఇక త‌మ పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల‌కు ఢోకా లేద‌న్న భరోసాతో ఉన్నారు. కానీ.. నేడు చంద్ర‌బాబు పేదలకు ఉన్నత చదువుల్ని దూరం చేశారు. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యంతో ఇప్పుడు ఇంజనీరింగ్‌ కోర్సులకు ఫీజులు భారీగా పెరిగిపోయాయి. ఆర్థిక స్థోమత లేక పేదలు ఈ కోర్సులకు దూరమవుతున్నారు. టెక్నిక‌ల్ రూట్లో వెళ్తే జీవితంలో తొంద‌ర‌గా సెటిల్ అవుతామ‌ని ఎక్కువ‌మంది విద్యార్థులు ఇంజినీరింగ్ వైపు మొగ్గుచూపేవారు. వారి క‌ల‌ల్ని నిజం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్ర‌వేశ‌పెట్టారు.

అప్పట్లో ఆయా కోర్సుల ట్యూషన్‌ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించేది. దీంతో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు బారులు తీరేవారు. ఇప్పుడు ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆ పథకాన్నిచంద్ర‌బాబు నీరుగార్చ‌డంతో విద్యార్థులు ఉన్న‌త‌విద్య‌కు విద్యార్థులు దూర‌మ‌వుతున్నారు. ఇక కాలేజీలేమో మూతపడుతున్నాయి. చంద్ర‌బాబు పేద విద్యార్థుల‌ను ఎలా సాంకేతిక విద్య‌ను దూరం చేస్తున్నారో చూడంది.. ఎంసెట్‌లో పదివేలలోపు ర్యాంకు సాధించిన వారికి మాత్రమే ఆయా కోర్సుల పూర్తిఫీజును చెల్లించేలా ప్రభుత్వం నిబంధనలను మార్చింది.

పదివేలు దాటి ర్యాంక్‌ వస్తే వారికి రూ. 35 వేలు మాత్రమే రీయింబర్స్‌మెంటు ఇస్తున్నారు. తక్కిన ఫీజు ఎక్కువగా ఉండటంతో పిల్ల‌ల‌ తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది. దీంతో తమ పిల్లలను కాలేజీల్లో చేర్చలేకపోతున్నారు. ఆయా కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచేయడం కూడా మ‌రో కార‌ణం. గతంలో రూ. 75 వేల లోపు వరకు గరిష్ట ఫీజు ఉండగా ఇప్పుడు దానిని రూ. 1.10 లక్షలకు పెంచారు. అయితే ఇందులో రాష్ట్ర‌ ప్రభుత్వం రూ. 35 వేలు ఇస్తే విద్యార్థి 75 వేలు చెల్లించాలన్న‌మాట‌. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల సంఖ్య 406 వరకు ఉంది.

బాబు ఎఫెక్ట్…ఇంజినీరింగ్ చదువు ఇక కలే వారికి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share