బాబును 2019 గ‌ట్టెక్కించే మొనగాడు దొరికాడా!

July 4, 2018 at 8:53 am
Chandra babu, TDP, invite ashok babu in to party, AP NGO

ఏపీ సీఎం చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ఇప్పుడు అందరినీ అయోమ‌యంలో ప‌డేస్తున్నాయి. గత ఎన్నిక‌ల‌కు ముందు ఉద్యోగులంద‌రినీ ఏక‌తాటిపైకి తీసుకురావ‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన ఆర‌డుగుల బుల్లెట్టుపై ఆయ‌న మ‌ళ్లీ ఆశ‌లు పెట్టుకున్నారు. అందుకే ప‌దేప‌దే ఆయ‌న్ను పార్టీలోకి రావాల‌ని ఆహ్వానాల మీద ఆహ్వానాలు పంపుతున్నారు. చంద్ర‌బాబు ఎప్పుడూ ఒక రాజ‌కీయ నాయకుడిని త‌మ పార్టీలోకి రావాల‌ని ప్ర‌జా వేదిక‌పై నుంచి పిలిచిన సంద‌ర్భాలు లేనే లేవ‌ని గుర్తుచేసుకుంటున్నారు. కానీ ఆ ఎన్జీవో నాయ‌కుడిని ఒక‌టి కాదు రెండు సార్లు పార్టీలోకి రావాల‌ని బ‌హిరంగంగానే కోర‌డంపై పార్టీ నాయ‌కులే విస్తుపోతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధి ప‌నులు చూసి పార్టీలోకి వస్తార‌ని చెప్పిన ఆయ‌న‌.. ఇప్పుడు ఇలా ప్రాథేయ‌ప‌డటం అంద‌రినీ విస్మయానికి గురిచేస్తోంది.

`అశోక్‌బాబు పార్టీలోకి రావాలి. వ‌స్తే ఆయ‌న‌కు స‌ముచిత స్థానం క‌ల్పిస్తాం!` అంటూ చంద్ర‌బాబు రెండు సార్లు ఆయ‌న్ను ఆహ్వానించారు. ప‌రిస్థితులు ఎంత‌టి బ‌ల‌వంతుడినైనా లొంగ‌దీసుకుంటాయ‌నేందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌నే వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హార‌శైలి గ‌మ‌నించిన వారు.. ఇలా ఒక ఎన్జీవో నాయ‌కుడిని పార్టీలోకి ర‌మ్మ‌ని ఆహ్వానించ‌డం ఏమిటా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఆయ‌నపై అంత మ‌మ‌కారం.. ప్రేమ ఎందుకు పొంగుకొస్తున్నాయనే సందేహాలు వ్య‌క్తంచేస్తున్నారు. రానున్న ఎన్నిక‌లు టీడీపీకి అనేక స‌వాళ్లు విసురుతున్నాయి. అవినీతి ఆరోప‌ణ‌లు ఒక‌ప‌క్క పార్టీ నేత‌ల మెడ‌కు చుట్టుకుంటున్నాయి. ఈ సమ‌యంలో టీడీపీని గ‌ట్టెక్కించే నేత ఎవ‌రా అనే కొత్త‌ చ‌ర్చ మొద‌లైంది.

ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబుకు ఏపీ ఎన్జీవో అధ్య‌క్షుడు అశోక్‌బాబు రూపంలో కొత్త ర‌క్ష‌కుడు దొరికాడా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో.. ఉద్యోగులంద‌రికీ నాయ‌క‌త్వం వ‌హించి.. వాళ్లంతా బాబు వైపు మొగ్గుచూపేలా చేయ‌డంలో అశోక్‌బాబు పోషించిన పాత్ర ఎంతో ఉంది. అప్ప‌టి నుంచి చంద్రబాబుకు అశోక్‌బాబుపై గురి కుదిరింది. ఇక మొన్న‌టికి మొన్న క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో.. బీజేపీకి తెలుగు వారంతా క‌ల‌సి బుద్ధి చెప్పాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే! అనంత‌రం అశోక్‌బాబుతో పాటు మ‌రికొంద‌రు నేత‌లు అక్క‌డికి వెళ్లి బీజేపీకి ప్ర‌చారం నిర్వ‌హించారు. దీంతో స్వామిభ‌క్తిని అశోక్‌బాబు బ‌య‌ట‌పెడుతూనే ఉన్నారు. దీంతో అశోక్‌బాబును పార్టీలోకి ఆహ్వానిస్తే మ‌రింత మేలు జ‌రుగుంద‌ని అనుకున్నారో ఏమో!

అశోక్‌బాబును టీడీపీలోకి రావాల‌ని బాబు కోరారు. ఇది మ‌రువ‌క ముందే ఏపీ భ‌వ‌న్‌లో జ‌రిగిన స‌మావేశంలో పాల్గొన్న చంద్ర‌బాబు.. మ‌ళ్లీ ఇవే డైలాగులు వినిపించారు. మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న అశోక్‌బాబు టీడీపీలో చేరి క్రీయాశీలకంగా వ్యవహరించాలని కోరారు. ఏపీ విభజన సందర్భంగా ఎన్జీవోలు తీవ్ర పోరాటాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అశోక్‌ బాబు ఎప్పుడు పార్టీలో చేరినా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తంచేస్తున్నారు. చంద్ర‌బాబు అంత నిరాశ‌లో కూరుకుపోయారా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ఓ ఎన్జీవో నాయకుడు పార్టీలోకి ప్రవేశిస్తే టీడీపీ గెలుపు అవకాశాలు అంతగా మెరుగుపడతాయా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. అశోక్ బాబు టీడీపీ రక్షకుడిగా మారతారని చంద్రబాబు భావిస్తున్నారా? ఏమో అనే చర్చ మొద‌లైంది.

బాబును 2019 గ‌ట్టెక్కించే మొనగాడు దొరికాడా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share