షాకింగ్ రిసల్ట్: బాబు సర్వేలో జగన్ జోరు!

September 20, 2018 at 3:23 pm

అయ్య‌య్యో.. క‌థ అడ్డం తిరుగుతోంది. కాలం మారుతోంది.. బాబుగారికి క‌ష్ట‌కాలం ఎంతో దూరంలో లేద‌ని తెలిసిపోయింది. నిత్యం వంత‌పాడే ప‌చ్చ‌మీడియా స‌ర్వేల్లోనే చంద్ర‌బాబుకు దిమ్మ‌దిరిగి బొమ్మ‌క‌న‌బ‌డే ఫ‌లితాలు వ‌చ్చాయ‌ట‌. ఇక మ‌ళ్లీ అధికారం క‌ల్లేన‌ని వాటిల్లో స్ప‌ష్ట‌మైంద‌ట‌. ప్ర‌భుత్వ ప‌నితీరు, ప‌థ‌కాలు, అభివ‌`ద్ధి కార్య‌క్ర‌మాల అమ‌లు తీరుపై ప్ర‌జ‌లు మంచి సంత‌`ప్తితో ఉన్నార‌నే సొంత లెక్క‌లు వేసుకుని చెప్పుకునే బాబుకు సొంత మీడియా స‌ర్వేలు పెద్ద షాక్‌నే ఇచ్చాయి. ప్ర‌జ‌ల్లో ఏ మాత్ర‌మూ సంత‌`ప్తి లేద‌ని తేలిపోవ‌డంతోపాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు సుమారు 100 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు రావ‌డం ఖాయ‌మేన‌ని తెలియ‌డంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట‌. జ‌నం మీద‌ప‌డి త‌మ్ముళ్లు దండుకుంటున్న తీరుతో పార్టీకి తీవ్ర న‌ష్టం జ‌రిగింద‌ని ప‌చ్చ‌మీడియా చెప్పుకొచ్చింద‌ట‌.

అయితే.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌.. ప్ర‌భుత్వంపై, ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరు, అభివ‌`ద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లుపై బాబుగారు త‌న సొంత‌మీడియాకు ప్ర‌త్యేకంగా స‌ర్వే చేయించుకున్నార‌ట‌. దీని ఆధారంగా ప‌నితీరు మార్చుకోవ‌చ్చున‌ని, అంతేగాకుండా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి టికెట్ ఇవ్వాలో.. ఎవ‌రికి ఇవ్వ‌కూడ‌దో తెలుసుకునేందుకు ఆయ‌న ఈ స‌ర్వే చేయించిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. బాబుగారి ఊహ‌కంద‌ని రీతిలో త‌మ్ముళ్ల ప‌నితీరు ఉంద‌ని.. అంటే జ‌నంమీద‌ప‌డి దోచుకు తింటున్నార‌ని, దీంతో పార్టీకి తీవ్ర ప్ర‌తికూల ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌ని ఆ స‌ర్వేలో తెలిసింద‌ట‌. చంద్ర‌బాబు చెబుతున్నట్లు ప్ర‌జ‌ల సంత‌`ప్తి స్థాయి లేద‌ని.. అది కేవ‌లం బాబుగారి ఆత్మ‌సంత‌`ప్తి కోస‌మేన‌న్న విష‌యం కూడా ప‌చ్చ‌మీడియాకు బాగా అర్థ‌మ‌యింద‌ట‌. ఇందుకు ఓ ఉదాహ‌ర‌ణ కూడా చెప్పుకొచ్చింద‌ట‌.

jagan_6840

అదేమిటంటే… ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడుతున్నాన‌ని చెప్పుకునేందుకు చంద్ర‌బాబు చేస్తున్న ధ‌ర్మ‌పోరాట స‌భ‌ల గురించేన‌ట‌. అయితే.. అధికారం చేతిలో పెట్టుకుని.. స‌భ‌ల‌కు కొద్దిరోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసినా.. బ‌ల‌వంతం చేసినా.. ఆయా స‌భ‌ల‌కు ప్ర‌జ‌లు రావడం లేద‌ని.. కానీ.. ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా.. ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా పాద‌యాత్ర‌గా వ‌స్తున్న జ‌గ‌న్‌కు త‌మ క‌ష్టాల‌ను చెప్పుకునేందుకు వ‌స్తున్న జ‌నాన్ని చూస్తేనే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థ‌మ‌వుతుంద‌నీ, ఇది ప్ర‌భుత్వంపై, టీడీపీపై ఉన్న వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని కూడా ప‌చ్చ‌మీడియా బాబుగారి క‌ళ్ల‌కు క‌ట్టింద‌ట‌. అంతేగాకుండా.. మ‌రో కీల‌క విష‌యం కూడా బాబుగారి ద‌`ష్టికి తీసుకొచ్చింద‌ట‌. అదేమిటంటే.. ఇప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింద‌ని, ఇక న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లకు అవ‌కాశం లేద‌ని.

ఇక ఇదే స‌మ‌యంలో ప‌లువురు ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరుతో పార్టీ ప‌రువు పోయింద‌ని బాబుగారికి పేర్ల‌తో స‌హా పూస‌గుచ్చిన‌ట్లు చెప్పింద‌ట‌. పశ్చిమ గోదావరికి చెందిన ఓ ఎమ్మెల్యే చేస్తున్న ఇసుక దందాతో పార్టీ గ‌ల్లంతు కావ‌డం ఖాయ‌ని ఆ స‌ర్వేలో తేలింద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇదే స్థాయిలో అవినీతికి పాల్ప‌డ్డార‌నే పార్టీ శ్రేణులు, బ‌హిరంగంగానే చెప్పార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక విశాఖ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య నెల‌కొన్ని అంత‌ర్గ‌త విభేదాలతో క్యాడ‌ర్ పూర్తిగా నిస్తేజంలో కూరుకుపోయింద‌ని స‌ర్వేలో తేలిన‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా టీడీపీపై ప్ర‌జ‌ల్లో రోజురోజుకూ వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ట‌.

ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీ లో చేరిన జేసీ దివాక‌ర్‌రెడ్డితో పార్టీకి తీవ్ర న‌ష్ట‌మే జ‌రిగింది త‌ప్ప ఒరిగిందేమీ లేద‌ని ఆ స‌ర్వేలో తేట‌తెల్లం అయింద‌ట‌. త‌న ఇష్టారీతిన మాట్లాడే జేసీ తీరుతో క్యాడ‌ర్ కూడా ఆగ‌మాగం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని పార్టీ శ్రేణులే స‌ర్వేలో వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. ఇక నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరాడం టీడీపీకి నష్టమేనని సర్వేలో శ్రేణులు చెప్పాయ‌ట‌. ఇక ఓవ‌రాల్‌గా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు గ‌ల్లంతు ఖాయ‌మ‌ని సొంత మీడియా జ‌రిపిన స‌ర్వే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు 130సీట్లు గ్యారంటీ అని తేలిన‌ట్లు స‌మాచారం. ఇందుకు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వ‌స్తున్న జ‌న‌మే నిద‌ర్శ‌న‌మ‌ని కూడా ప‌చ్చ‌మీడియా లోలోప‌ల బాబుగారికి గుచ్చిగుచ్చి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. పాపం.. బాబు ఏం చేస్తారో చూడాలి మ‌రి.

షాకింగ్ రిసల్ట్: బాబు సర్వేలో జగన్ జోరు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share