విశ్వ‌స‌నీయ‌త‌లో ఎవ‌రి స‌త్తా ఎంత‌…. జ‌గ‌న్‌, బాబు ఎవ‌రు ఫ‌స్ట్‌..!

March 20, 2018 at 11:08 am
chandra babu, TDP, YS jagan, YSRCP, Most trusted leader, AP, Politics

రాష్ట్రంలో సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఏదైనా విష‌యం ఇలా వెలుగు చూడ గానే అలా షేరింగ్ అయిపోతున్న విషయం కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక‌, తాజాగా రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థి తుల‌పై సోష‌ల్ మాధ్య‌మాలు మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. ఏపీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం స‌హా ప్ర‌త్యేక హోదా ఇచ్చే విష‌యంలో కేంద్రంపై రాష్ట్ర పార్టీల నేత‌లు చేస్తున్న ఉద్య‌మాన్ని ప్ర‌జ‌లు నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. ఏ క్ష‌ణానికి ఏం జ‌రుగుతుందో? అనే రీతిలో ప్ర‌తి ఒక్క‌రూ చ‌ర్చించుకుంటున్నారు. 

 

సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ ప్ర‌భావం మ‌రింత ఎక్కు వ‌గా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు సోష‌ల్ మీడియా వేదిక అయింది. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, వాట్స‌ప్ వంటి మాధ్య‌మాల్లో ఇప్పుడు రాష్ట్రానికి చెందిన వార్త‌లు, విశేషాలే ఎక్కువ‌గా షేర్ అవుతున్నాయి. ఈ కోవ‌లోనే ఇప్పుడు ఏపీ రాష్ట్రాధినేత‌గా సీఎం చంద్ర‌బాబు, విప‌క్షాధినేత‌గా వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి, ఏపీ స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తున్న తీరుపై సోష‌ల్ మీడియాలో ప్ర‌త్యేక చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఏపీ కోసం ఎవ‌రు ఎక్కువ కృషి చేస్తున్నారు? ఎవ‌రు విశ్వ‌స‌నీయంగా ప‌నిచేస్తున్నారు? ఎవ‌రిని ప్ర‌జ‌లు విశ్వ‌సించాలి? వ‌ంటి కీల‌క ప్ర‌శ్న‌లు క‌నిపిస్తున్నా యి. 

 

నిజానికి ఏపీ విష‌యంలో మొద‌టి నుంచి వైసీపీ అధినేత జ‌గ‌న్ ఒకే మాట‌, ఒకే బాట అన్న విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా రు. విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవ‌స‌రం కేంద్రానికి ఉంద‌ని, ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా విష‌యం లో కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రితో రాష్ట్రం మ‌రో 50 ఏళ్లు వెన‌క్కి పోవ‌డం ఖాయ‌మ‌ని కూడా జ‌గ‌న్ పెద్ద ఎత్తున ఆందో ళ‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌త్యేక హోదా కోసం ఎంత‌కైనా పోరాడ‌తామ‌ని చెప్పారు. అంతేకాదు, 2015లోనే జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ శాయ‌శ‌క్తులా పోరాడుతుంది. ఒక‌వేళ 2019లోగా హోదా సాధ‌న సాధ్యం కాక‌పోతే.. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పే జాతీయ పార్టీతోనే తాము పొత్తుకు సిద్ధ‌మ‌వు తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. 

 

ఇక‌, ఆ ప‌రంప‌రలోనే జ‌గ‌న్‌.. కేంద్రంపై ప్ర‌త్య‌క్ష పోరుకు ఏడాదిన్న‌ర కింద‌టే ప్ర‌క‌ట‌న చేశారు. అవ‌స‌ర‌మైతే త‌న పార్టీ ఎంపీల‌తో రాజీనామాలు సైతం చేయిస్తాన‌ని అప్ప‌ట్లోనే ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇక‌, అవిశ్వాసం ప్ర‌క‌ట‌నా జ‌గ‌న్ నోటి నుంచి వ‌చ్చిందే. మ‌రి ఇలా ఏపీ విష‌యంలో జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌లు, చూపిన చొర‌వ అంద‌రి ప్ర‌శంస‌లు పొందింది. 

 

మ‌రి ఇదే స‌మ‌యంలో ఏపీ సీఎంగా, రాష్ట్రానికి పెద్ద‌దిక్కుగా ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న‌లు, తీసుకున్న నిర్ణ‌యాలు.. క‌ప్ప‌దాటు సంగ‌తులుగానే మిగిలాయి. ఏ ఒక్క నిర్ణ‌యంపైనా ఆయ‌న నిల‌క‌డ చూపించ‌లేదు. అంతేకాదు, త‌న రాజ‌కీయ అవ‌స‌రాల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌త్యేక హోదా అవ‌స‌ర‌మ‌న్న నోటితోనే అదేమ‌న్నా సంజీవ‌నా? అని ప్ర‌శ్నించారు. అప్ప‌ట్లో కేంద్రంలోని బీజేపీతో మిలాఖ‌త్ అయిన నేప‌థ్యంలో బాబు ఇలా వ్యాఖ్యానించారు. 

 

అంతేకాదు, హోదా కోసం ఉద్య‌మించిన వారిని ప‌నిలేని నేత‌లుగా అభివ‌ర్ణించారు. మ‌రి ఇంత‌లోనే ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని గ్ర‌హించారో ఏమో.. టంగ్ మార్చేసి.. హోదా కోసం పోరు అంటూ మ‌ళ్లీ కొత్త నాట‌కానికి తెర‌దీశారు. మొత్తంగా ఏపీ విష‌యంలో ఈ ఇద్ద‌రు నేత‌ల విశ్వ‌స‌నీయ‌త ఏంటో ఈ విష‌యంలో అర్ధ‌మైపోవట్లేదూ..!!  

 

విశ్వ‌స‌నీయ‌త‌లో ఎవ‌రి స‌త్తా ఎంత‌…. జ‌గ‌న్‌, బాబు ఎవ‌రు ఫ‌స్ట్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share