జ‌గ‌న్ క్లారిటీతో బాబు డైల‌మా

June 18, 2018 at 8:51 am
chandra babu, tdp, ysrcp, ys jagan, AP, politics

సింహం సింగిల్‌గానే త‌ల‌ప‌డుతుంది! అన్న‌ట్టుగా మ‌రి ప‌దిమాసాల్లో జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ, సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ కూడా సింగిల్‌గానే పోటీకి సిద్ధ‌మ‌వుతోంది. వచ్చే ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు వ‌స్తున్న ఊహా గానా ల‌కు తెర‌వేస్తూ.. తాజాగా ఆపార్టీ వెల్ల‌డించింది. గ‌త మార్చి నెల నుంచి రాష్ట్రంలో విభ‌న్న‌మైన రాజ‌కీయ వాతా వ‌ర‌ణం నెల‌కొంది. కేంద్రంలోని బీజేపీతో నాలుగేళ్లు అంట‌కాగిన టీడీపీకి ఇప్పుడు అదే బీజేపీ ప్ర‌ధాన శ‌త్రువు అయిపోయింది.

అంతేకాదు, ఆ బీజేపీతో ఎవ‌రు క‌లిసినా.. ఎవ‌రు మాట్లాడినా.. కూడా పెద్ద త‌ప్పుగా, ఘోర‌మైన నేరంగా క‌నిపిస్తోంది. దీనినే విస్తృతంగా ప్ర‌చారం కూడా చేస్తోంది. ఇక‌, ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుకు బ‌ద్ధ శ‌త్రువైన వైసీపీని బీజేపీకి అంట‌క‌ట్టి.. వ్య‌తిరేక ప్ర‌చారం ముమ్మ‌రం చేస్తున్నారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీతో వైసీపీ అంట‌కాగుతోంద‌ని, వైసీపీకి వేసే ఓట్ల‌న్నీ బీజేపీకే ప‌డ‌తాయ‌ని, కేంద్రంలో మ‌ళ్లీ మోడీ ప్ర‌భుత్వం వ‌స్తే.. ఏపీకి మ‌రింత అన్యాయం జ‌రుగుతుంద‌ని పెద్ద ఎత్తున టీడీపీ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. అదేస‌మ‌యంలో జ‌న‌సేన‌ను కూడా దీనికి ముడిపెడుతున్నారు.

బీజేపీ, వైసీపీ, జ‌న‌సేన పార్టీలు మూడూ ఒక్కటేన‌నే ప్ర‌చారం ఇటీవ‌లకాలంలో ఊపందుకుంది. ఈ యాంటీ ప్ర‌చారాన్ని రాబోయే రోజుల్లో మ‌రింత‌గా పెంచాల‌ని కూడా నాయ‌కులు సిద్ధ‌మ‌య్యారు., అయితే, దీనికి వైసీపీ గ‌ట్టి కౌంట‌ర్ అండ్ క్టారిటీ కూడా ఇచ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఎవ‌రి పార్టీతోనూ అంట‌కాగాల్సిన అవ‌స‌రం లేద‌ని, తాము సింగిల్‌గానే బ‌రిలోకి దిగుతామ‌ని తాజాగా వెల్ల‌డించింది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో.. బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌తో జ‌ట్టుక‌ట్టి బ‌రిలోకి నిలిచిన‌ప్పుడే.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. సింగిల్‌గా పోటీ చేసి.. 67 స్థానాల్లో దిగ్విజ‌యం సాధించారు.

అంతేకాదు, ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఏదో ఒక పార్టీ అండ‌లేకుండా చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు బ‌రిలో నిలిచిన రికార్డు లేద‌నే విష‌యాన్ని కూడా నేత‌లు గుర్తు చేస్తున్నారు. కానీ, జ‌గ‌న్ కానీ, ఆయ‌న పార్టీ నేత‌లు కానీ, ఎప్పుడూ సింగిల్‌గానే ప్ర‌జ‌ల్లోకి వెళ్లార‌ని, వ‌చ్చేఊ ఎన్నిక‌ల్లోనూ ఇదే జ‌రుగుతుంద‌ని నాయ‌కులు చెబుతున్నారు. ఈ ఒక్క క్లారిటీతో జ‌గ‌న్ – బీజేపీ జ‌ట్టుక‌డుతున్నారంటూ టీడీపీ అండ్ చంద్ర‌బాబు గ్యాంగ్ చేస్తోన్న విమ‌ర్శ‌ల్లో ప‌స‌లేద‌ని తేలిపోయింది. ఇక‌, ఇదిలావుంటే, వైసీపీ సింగిల్‌గా వెళ్లినా.. ప్ర‌జ‌ల్లో అభిమానం త‌రిగిపోలేదని తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలోనూ వెల్ల‌డి అయింది. దీనిని బ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ సింగిల్ గానే పోరుకు సిద్ధ‌మ‌వుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

జ‌గ‌న్ క్లారిటీతో బాబు డైల‌మా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share