జ‌నం క‌ళ్ల‌కు బాబు గంత‌లు.. ఇదీ వాస్త‌వం!

September 8, 2018 at 4:12 pm

వినేవాడు వెర్రివాడైతే.. చెప్పేవాడు చిరంజీవిని మించిపోతాడ‌ని మ‌నోళ్లు స‌ర‌దాకు అంటూ ఉంటారు. అలా ఉంది.. ఏపీ ప‌రిపాల‌న‌. త‌న‌ను మించిన వారు లేర‌ని, ఏపీలో త‌న‌ను మించిన నాయ‌కుడు కూడా లేడ‌ని ప‌దే ప‌దే చెప్పిన టీడీపీ అధి నేత, సీఎం చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల‌కు తాను ఎన్నెన్నో చేస్తున్నాన‌ని డ‌ప్పు చాటుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం స‌మీపి స్తు న్న నేప‌థ్యంలో ఈ హ‌డావుడి మ‌రింత‌గా పెరిగింది. ఈ క్ర‌మంలోనే రైతుల రుణ మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీపై పెద్ద ఎత్తు న ప్ర‌చారం చేస్తున్నారు. రాష్ట్రం లోటు బ‌డ్జెట్‌లో ఉన్న‌ప్ప‌టికీ.. తాము మాత్ర‌మే ఈ రుణాలు మాఫీ చేశామ‌ని చెప్పు కొస్తు న్నారు. అయితే, వీటిపై ఎప్ప‌టిక‌ప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ వీటి అస‌లు రూపాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తూనే ఉన్నారు. 25ONGOLEPAGE4NAIDU

రుణాలు ఒక్క పైసా కూడా మాఫీ కాలేద‌ని, ప్ర‌జ‌ల చెవుల్లో చంద్ర‌బాబు కాలీఫ్ల‌వ‌ర్లు పెడుతున్నార‌ని జ‌గ‌న్ తీవ్ర స్థాయి లో ధ్వ‌జ‌మెత్తారు. అయితే, దీనిని అప్ప‌ట్లో తిప్పికొట్టిన అధికార పార్టీ నేత‌లు.. ఇప్పుడు ఇదే విష‌యంపై అసెంబ్లీలో నిజాలు ఒప్పుకొని లెంపులు వేసుకునే ప‌రిస్థితి తెచ్చుకున్నారు. ఎన్నికల హామీ అయిన డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఒక్కపైసా కూడా మాఫీ చేయలేదని, అసలు అలాంటి ఆలోచనే లేదని టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదని స్త్రీ,శిశు సంక్షేమ, సెర్ప్ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో డ్వాక్రా రుణాల చెల్లింపులపై సమాధానం ఇస్తూ ఈ విషయం తెలిపారు. 8888

2014–15, 2015–16, 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్వాక్రా రుణాల మాఫీ మొత్తం ఎం త? జిల్లాల వారీగా వివరాలు ఇవ్వాలని, రాష్ట్రంలో 2014 జూన్‌ నాటికి మిగిలి ఉన్న డ్వాక్రా రుణాల మొత్తం ఎంత, ఇప్ప టి వరకూ మాఫీ చేసిన రుణాల మొత్తం ఎంత, డ్వాక్రా రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతి పాద న ఉందా? అయితే ఆ వివరాలు ఇవ్వాలని వైసీపీ శాసనసభ్యులు పాముల పుష్ప శ్రీవాణి, ఆర్‌కే రోజా, గౌరు చరితారెడ్డి రాతపూర్వకంగా ప్రశ్నించారు. దీనికి మంత్రి సునీత సమాధానమిస్తూ.. 2014 నుంచి 2018 వరకు ఎలాంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదని, డ్వాక్రా రుణాల మొత్తం రూ. 11,069 కోట్లు ఉన్నాయని తెలిపారు.DWCRA-women-turn-into-bankrollers

అంతేకాదు, దీనికి ఒక్క పైసా కూడా మాఫీ కింద చెల్లించలేదని, దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతి పాదనా కూడా లేదని జవాబిచ్చారు. మొత్తానికి ఈ స‌మాధానంతో చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌లు ఒట్టి డొల్లేన‌ని స్ప‌ష్టం అయి పోయింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక‌, ఈ అస్త్రాన్ని ఉప‌యోగించుకుని వైసీపీ ఎలా యుద్ధం చేస్తుందో చూడాలి.

జ‌నం క‌ళ్ల‌కు బాబు గంత‌లు.. ఇదీ వాస్త‌వం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share