బాబు హ‌యాంలోనే అవినీతి ఆంధ్ర… !

September 6, 2018 at 3:28 pm

అవును! ఇది ఎవ‌రో గిట్ట‌నివారో ప్ర‌తిప‌క్ష నాయ‌కులో అన‌డం లేదు. కేంద్ర స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ కాగ్ చెబుతు న్న మాట‌! అవినీతిలో ఏపీ తొలిస్థానానికి చేరుకుంద‌ని కాగ్ తాజాగా వెల్ల‌డించింది. సూచ‌న‌ప్రాయంగా వెల్ల‌డించిన కొన్ని అభిప్రాయాలు ఏపీని అవినీతిలో ఫ‌స్ట్‌లో నిల‌బెట్టాయి. ప్ర‌భుత్వ ప‌రంగా అధికారులు, రాజ‌కీయాల ప‌రంగా ఎమ్మెల్యేలు, ఆఖ‌రుకు మంత్రులు సైతం అవినీతి కూపంలో కూరుకుపోయార‌ని కాగ్ నివేదిక స్ప‌ష్టం చేసింది. నిజానికి ప్ర‌భుత్వ సార‌థి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు కానీ, ఆయ‌న కుమారుడు, మంత్రి నారా లోకేష్‌లు కానీ.. ఏపీని అవినీతి ర‌హిత ఆంధ్ర ప్ర‌దేశ్‌గా మార్చుతామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌క‌టిస్తున్నారు కూడా. nat1

కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి అలా లేదు. వైద్యం ద‌గ్గ‌ర నుంచి విద్య వ‌ర‌కు, పుట్టుక ద‌గ్గ‌ర నుంచి చావు వ‌ర‌కు కూడా అవి నీతి మేట‌లు ప్ర‌జ‌ల‌ను ముంచెత్తుతున్నాయి. వైద్యం చేయాలంటే.. లంచాలు ఇవ్వాలి. వైద్య విద్య లో సీటు తెచ్చుకో వాలంటే లంచాలు ఇవ్వాలి. ఇక‌, విద్య విష‌యానికి వ‌స్తే.. అవినీతి అంశాన్ని ఎంత త‌క్కువ చెప్పుకొంటే అంత మంచిది అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. సర్వశిక్షా అభియాన్‌ ద్వారా రాష్ట్రంలోని పాఠశాలల్లో రూ.4,848 కోట్ల వ్యయంతో చేపట్టదలచిన మౌలికసదుపాయాల కల్పనలో భారీ స్కామ్‌కు విశ్వప్రయత్నం జరిగింది. దీనికోసం విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్‌లో ఉన్నత స్థాయి వ్యక్తులే తెరవెనుక కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.world-food-india_31d1b3bc-2dac-11e8-8732-87a46da2a8cc_0

ఇక‌, బాబు హ‌యాంలోనే శవంపై చిల్ల‌ర ఏరుకునేలా.. పోస్ట్ మార్టం చేసేందుకు కూడా ఐదు వేలు లంచం డిమాండ్ చేశా డు ఓ డాక్ట‌ర్‌. అది కూడా రాజ‌ధాని ప్రాంతమైన విజ‌య‌వాడ‌లో! ఇక‌, ఎమ్మెల్యేల తీరు మ‌రోలా ఉంది. పింఛ‌న్ రాయాలం టే లంచం.. ఎన్టీఆర్ గృహ నిర్మాణంలో లంచం.. ఇలా ప్ర‌తి ప‌నికీ లంచం లేందే.. ప‌నిజ‌ర‌గ‌డం లేదనే విధంగా మారిపో యింది. ఆఖ‌రుకు చంద్ర‌బాబును క‌లిసేందుకు వ‌చ్చిన వారి నుంచి కూడా ఓ పోలీసు డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం వివాదానికి దారితీసింది. ఇక‌, పోలీస్ స్టేష‌న్లు అవినీతికి కేంద్ర‌స్థానాలుగా ఉన్నాయ‌ని కాగ్ ఎత్తిచూపింది. మ‌రి ఇంత‌లా దోచేసుకుంటున్నా.. ప‌ట్ట‌ని చంద్ర‌బాబు కేవ‌లం 1100 నెంబ‌రును ఒక‌దాన్ని ప్ర‌వేశ‌పెట్టి చూస్తూ ఊరుకున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. అప‌ర చాణిక్యుని పాల‌న‌లో రాష్ట్రం అథోగ‌తికి వెళ్తోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

బాబు హ‌యాంలోనే అవినీతి ఆంధ్ర… !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share