మొక్క‌ల్లోనూ బాబుగారి క‌క్కుర్తి..!

September 5, 2018 at 6:09 pm

జీవకోటికి ఆక్సిజ‌న్ అందిస్తున్న మొక్క‌ను మొక్కుతారు గానీ మెక్క‌డం ఏమిటి..? అని ఆశ్చ‌ర్య‌పోకండి..! ఇదంతా కూడా మ‌న ముఖ్య‌మంత్రి బాబుగారి పాల‌న‌లోని చిత్రాలు.. అవినీతి చిట్టాలు..! ముందు నాగలి ఎలా న‌డిస్తే.. వెన‌క నాగలి అలాగే వ‌స్తుంద‌ని అంటారు పెద్ద‌లు. ఇప్పుడు నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం పేరుతో అందిన‌కాడిన దండుకుంటున్న చంద్ర‌బాబు మంత్రాన్నే ఆయ‌న అధికార యంత్రాంగం అందుకుంటోంది. ఇది మీకు అతిశ‌యంగా క‌నిపించ‌వ‌చ్చుగానీ.. ఈ విష‌యం తెలిస్తే మాత్రం మీరు కూడా అంత‌కు మించే అంటారు మ‌రి. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. ఓ మొక్క ఖ‌రీదు నాలుగు వంద‌ల నుంచి ఐదు వంద‌ల రూపాయ‌లు ఉంది. కానీ.. అమ‌రావ‌తి డెవ‌లప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఏడీసీఎల్‌) అధికారులు మాత్రం దానికి ఏకంగా రూ.2800 ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దీనిని ఏమంటారో మీరే చెప్పాలిక‌.10494576_892785950734997_2556722753442480868_n

నూతన రాజధాని అమ‌రావ‌తి కోసం అని ఏర్పాటు చూసిన అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారులు ఎలా తెగ‌బ‌డుతున్నారో తాజాగా వెలుగు చూసిన విష‌యంతో తేట‌తెల్ల‌మ‌వుతోంది. ఆరు వేల దేవ‌గ‌న్నేరు మొక్కల కొనుగోలుకు ఏడీసీఎల్ టెండర్ పిలిచింది. దీని కోసం 1.68 కోట్ల రూపాయల విలువ అంచనా వేసింది. అయితే.. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా… అసలు కథ వేరే ఉంది. ఈ దేవగన్నేరు (Plumeria) మొక్కల ధర ఆన్ లైన్ లోనే కనిష్టం రూ.215 అయితే..గరిష్టం రూ. 499. కానీ మ‌న‌ ఏడీసీఎల్ ఈ మొక్కలకు ఎంత ధర నిర్ణయించిందో తెలుసా?. వంద‌కాదు.. రెండు వంద‌లు కాదు.. ఏకంగా 2800 రూపాయలు. ఆన్ లైన్ లో ఒక్కో మొత్తం 500 దొరుకుతుంటే సర్కారు రూ. 2800 చెల్లించ‌డానికి సిద్ధ‌ప‌డ‌డం చూసి అంద‌రూ సిగ్గుప‌డుతున్నారు.andhra-pradesh-chief-minister-n-chandrababu-naidu-437141

అయితే.. తాము చేస్తున్న ప‌నికి ఏడీసీఎల్ అధికారులు ఏమాత్రం సిగ్గుప‌డ‌డం లేద‌ట‌. ఎందుకంటే.. వాళ్లు లోలోప‌ల స‌మ‌ర్థించుకుంటున్న తీరును చూస్తే.. ఇదేం ఖ‌ర్మ‌రా బాబోయ్ అన‌క మాన‌రు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అండ్‌కో అడ్డ‌గోలు టెండ‌ర్ల పేరుతో అందిన‌కాడికీ దోచుకుంటుంటే.. తాము క‌నీసం మొక్క‌ల్లోనూ క‌క్క‌ర్తి ప‌డొద్దా..? అని ఎదురు ప్ర‌శ్న‌లు వేస్తున్నార‌ట‌. ఇలా ఉంది మ‌రి మ‌న ముఖ్య‌మంత్రి బాబుగారి పాల‌న‌లో అధికారుల తీరు. ఈ బ‌రితెగింపును చూసి ప‌లువురు ఉన్న‌తాధికారులు త‌ల‌దించుకుంటున్నార‌ట‌. ఇంత నిస్సిగ్గుగా వ్య‌వ‌హ‌రిస్తారా..? అంటూ లోలోల ఉడికిపోతున్నార‌ట‌. నిజానికి.. అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ లక్ష్మీపార్థసారధిపైనా గతంలోనే తీవ్ర విమర్శలు రావ‌డం గ‌మ‌నార్హం. దీనిపై మ‌న నిప్పుక‌ణిక‌లు బాబు, లోకేశ్‌లు ఏం చెబుతారో చూడాలి మ‌రి.

మొక్క‌ల్లోనూ బాబుగారి క‌క్కుర్తి..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share