ఇలా చెప్పుకొంటూ పోతే రాష్ట్రం మునిగిపోదా బాబూ..!

September 5, 2018 at 6:20 pm
CBN-222111

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోందని, భారీ ఎత్తున లక్షల్లో ఉద్యోగాలు వస్తున్నాయని డబ్బా కొట్టుకుంటున్న సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గొప్పలు రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా ముంచేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడంపై చంద్రబాబు గొప్పలేనన్నది పెద్ద ఎత్తున వినిపిస్తున్న విమర్శ. రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో కేంద్రంతో పోటీ పడుతోందని, కేంద్రాన్ని మించుతోందని, కేంద్రం కన్నా రెండంకెల వృద్ధి సాధించిందని ఇటీవల కాలంలో చంద్రబాబు ఊదరగొట్టారు. దీనినే ప్రామాణికంగా తీసుకున్న కేంద్రంలోని పలువురు మంత్రు లు సైతం అంత వృద్ధి ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పనేంటి? అనివ్యాఖ్యానించారు. నిజానిజాలు ఎలా ఉన్నా.. ఇప్పటికీ కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సమ్మతించడం లేదన్నది వాస్తవం.

ఇక, ఇప్పుడు మళ్లీ ఇదే పాటను రిపీట్ చేస్తున్నారు చంద్రబాబు. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పిన ఆయన.. కేంద్రం ఏపీకి ప్రత్యే క హోదా ఇవ్వక పోయినా.. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమస్థానంలో ఉన్నామని, ప్రభుత్వంపై నమ్మకంతో గంటలోనే రాజధాని బాండ్లు లిస్టయ్యాయని చెబుతున్న వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. వాస్తవానికి పక్కనోడికి పది రూపాయలు సాయం చేయాలం టేనే పది రకాలుగా ఆలోచించి అడుగులు వేస్తాం. మరి ఏపీకి ప్రత్యేక హోదా(ఒడిసా, తమిళనాడు, బీహార్ వ్యతిరేకిస్తున్నాయి) ఇవ్వాలంటే.. అనేక అడ్డంకులు దాటుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.(రేపు కాంగ్రెస్ వచ్చినా ఇదే పరిస్తితి ఖాయం అంటున్నారు పరిశీలకులు). మరి అలాంటి సమయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.

కానీ, తన రాజకీయ లబ్ధి కోసం. తానేదో మేధావినని నిరూపించుకోవడం కోసం.. రాష్ట్రం రెండంకెల వృద్ధిలో ఉందని, ఇక్కడ పరిశ్రమలు కోకొల్లలుగా ఉన్నాయని, వస్తున్నాయని, వందల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని డబ్బా కొట్టుకోవడం ఎంత వరకు సమంజసమో ఆయనకే తెలియాలని అంటున్నారు నిపుణులు. ఇదే నిజమైతే.. రాష్ట్ర రాజధానికి సంబంధించి బాండ్లను విక్రయించి అధిక వడ్డీకి రుణాలు ఎందుకు తీసుకోవాలి? ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతున్న రాష్ట్రాన్ని మరింతగా ఆర్థిక కష్టాల్లోకి ఎందుకు నెట్టాలి? అనే ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. కేంద్రం ఇస్తున్న నిధులను తన స్వప్రయోజనాల కోసం, ప్రచారం కోసం ఖర్చు చేస్తున్న చంద్రబాబు.. ప్రజల అవసరాలకు మాత్రం అప్పులు చేస్తున్నారనే విమర్శలు ప్రభుత్వంలోని ఓ వర్గం సీనియర్ అధికారుల నుంచే వినిపిస్తుండడం గమనార్హం. సో.. మొత్తానికి తన గొప్పల మంటల్లో రాష్ట్రాన్ని బాబు దహనం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇలా చెప్పుకొంటూ పోతే రాష్ట్రం మునిగిపోదా బాబూ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share